పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమాకి డైరెక్టర్‌ ఎవరో?

మరిన్ని వార్తలు

'కాటమరాయుడు' సినిమాతో నిరాశ పరిచిన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ 'అజ్ఞాతవాసి' సినిమాతోనైనా హిట్‌ ఇస్తాడని భావించారంతా. త్రివిక్రమ్‌ - పవన్‌ కాంబినేషన్‌ అంటే అభిమానులు కూడా అదే ఎక్స్‌పెక్ట్‌ చేశారు. ఆ క్రేజ్‌తోనే విడుదలకు ముందే ఈ సినిమాపై పెరిగిన హైప్‌కి ఆకాశమే హద్దయ్యింది. కానీ విడుదలయ్యాక పవన్‌ కళ్యాణ్‌ ఈ సారి కూడా తుస్సుమనిపించాడంటూ పవన్‌ అభిమానులు చాలా డిజప్పాయింట్‌ అయ్యారు. 

ఈ సినిమా రిజల్ట్‌ ఇలా ఉండగా, మరోపక్క పవన్‌ మాత్రం రాజకీయాలంటూ, జనంతో మమేకం అవుతూ బిజీగా గడుపుతున్నారు. ఒక్కో సందర్భంలో పవన్‌ ఇక సినిమాలకు టాటా చెప్పేస్తారా అనే అనుమానాలు కూడా కలిగేలా సంకేతాలు పంపుతున్నారు. అయితే సినిమా హీరోగా పవన్‌ కళ్యాణ్‌ చేయాల్సిన భారీ ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. సంతోష్‌ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది పవన్‌ కళ్యాణ్‌. ఇది కాక తమిళ డైరెక్టర్‌ నేశన్‌తో సినిమా ఎప్పుడో ప్రారంభోత్సవం జరిగింది. 'గబ్బర్‌సింగ్‌' వంటి సెన్సేషనల్‌ హిట్‌ ఇచ్చిన హరీష్‌ శంకర్‌ పవన్‌ కోసం ఓ స్క్రిప్టు రెడీ చేసి పెట్టాడు. 

ఇవన్నీ కాక మైత్రీ మూవీస్‌ బ్యానర్‌ వారు పవన్‌తో ఓ సినిమా నిర్మించాలనీ, అందుకు పవన్‌ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే, 'అజ్ఞాతవాసి' భారీ ఫెయిల్యూర్‌తో డీలా పడ్డ నిర్మాత రాధాక్రిష్ణ, పవన్‌తో హారికా హాసినీ బ్యానర్‌లోనే మరో సినిమాని రూపొందించాలనుకుంటున్నాడట. 'అజ్ఞాతవాసి' బాధితుల కోసమే రాధాక్రిష్ణ మళ్లీ ఈ ప్రయత్నం చేయాలనుకుంటున్నారనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. ఏది ఏమైనా పవన్‌ చేయబోయే తదుపరి చిత్రంపై త్వరలోనే క్లారిటీ రానుందట. ఈ విషయమై మార్చిలో పవన్‌ క్లియర్‌గా ఓ అనౌన్స్‌మెంట్‌ చేయనున్నారనీ తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS