మెగాస్టార్ చిరంజీవి రి-ఎంట్రీ చిత్రం ఖైదీ నెం 150 ఘనవిజయం సాదించి కొత్త రికార్డుల వైపు దూసుకుపోతుంది.
అయితే సామాన్య ప్రజల నుండి సెలబ్రిటిల దాక చిరంజీవి కొత్త చిత్రం చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీరిలో మన తెలుగు రాష్ట్రాల గవర్నర్ కుడా ఉన్నారు. అందుతున్న సమాచారం ప్రకారం, గవర్నర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాద్ ల్యాబ్స్ లో స్పెషల్ షో వీక్షించారు.
షో అనంతరం, గవర్నర్ చిరు నటనని అలాగే చిత్రలో స్పృశించిన సామాజిక అంశాన్ని సైతం ఆయన మెచ్చుకున్నారు. ఈ స్పెషల్ షో చిరంజీవినే ఏర్పాటు చేశారన్నది ఇన్సైడ్ టాక్.
మొత్తానికి చిరు 150వ చిత్రం అన్ని వర్గాల నుండి ఆదరణ వస్తుంది.