కుమార్తెకు బాసటగా నిలిచిన కమల్‌హాసన్‌

మరిన్ని వార్తలు

కమల్‌ హాసన్‌ చిన్న కుమారై అక్షరా హాసన్‌ మతం మార్చుకున్నట్లు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. ఆమె బౌద్ధ మతం తీసుకున్నట్లుగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆమెకు కొత్త విషయాల్ని తెలుసుకోవడం అంటే చిన్న తనం నుండీ చాలా ఇంట్రెస్ట్‌. ఆ ఇంట్రెస్ట్‌తోనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తెర వెనుక విభాగంలోని మెలకువలని గమనించింది. అలాగే నటిగా ఉండే కష్టనష్టాల్ని తెలుసుకుంది అక్షరా హాసన్‌. అలాగే బౌద్ధ మతం ద్వారా పలు విషయాలను ఆకళింపు చేసుకోవాలనుకుంటోందట అక్షరా హాసన్‌. కూతురు మతం మార్చుకున్న విషయంపై తండ్రి కమల్‌ హాసన్‌ తాజాగా ట్విట్టర్‌లో స్పందించారు. 'హే అక్షు..మతం మార్చుకున్నావా? నువ్వు మతం మార్చుకున్నా నువ్వంటే నాకు ఇష్టమే.. మతం కాదు, ప్రేమ నిస్వార్ధమైనది. జీవితాన్ని ఎంజాయ్‌ చెయ్‌.. నీ బాపు' అని కమల్‌ ట్వీట్‌ చేశారు. కూతురుపై తన ప్రేమని కమల్‌ హాసన్‌ ఇలా తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం అక్షరా హాసన్‌ 'వివేగం' సినిమాలో నటిస్తోంది. అజిత్‌, కాజల్‌ జంటగా నటిస్తున్నారు ఈ సినిమాలో. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. తెలుగులోనూ మంచి అవకాశాల కోసం అక్షరా ఎదురు చూస్తోంది. బాలీవుడ్‌లో ఓ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. త్వరలోనే 'వివేగం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది అక్షరా హాసన్‌.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS