కన్నడ నటుడు ధృవ (35) ఇక లేరు.
వివరాల్లోకి వెళితే, ధృవ ఉన్నట్టుండి శనివారం రోజున తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనని కుటుంబసభ్యులు దగ్గరలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండురోజులుగా చికిత్సపొందుతూ ఈరోజు తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్ తో తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఊహించని ఈ పరిణామంతో కన్నడ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురయింది. ఈయన నటనతోనే కాకుండా CCLలో కర్ణాటక తరపున వరుసగా 6 సార్లు ప్రాతినిధ్యం వహించారు.
ఇక ఈయనకి మాట్లాడం అలాగే వినడం సమస్యలు ఉన్నప్పటికీ ఈయన తన అసాధారణ అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.
ఈయన అకాల మృతికి iQlikmovies.com తరపున ఆయన కుటుంబసభ్యులకి సంతాపం తెలియచేస్తున్నాము.