ముద్దుగుమ్మ ఈషా రెబ్బ ప్రస్తుతం హీరోయిన్‌గా బిజీగానే ఉంది. లేటెస్ట్ మూవీ 'దర్శకుడు'తో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ ముద్దుగుమ్మ. అచ్చమైన తెలుగమ్మాయి. అందమైన సీతాకోక చిలుకలా ఇలాగే తనకీ రెక్కలుంటే ఎంత బావుండో కదా. హాయిగా ఆకాశంలో విహరిస్తానన్నట్లుగా ఉంది ఈ ఫోటోలో అమ్మడి పోజు. ఈ ముద్దుగుమ్మ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. తెలుగమ్మాయి అయినందుకు తెలుగు సినిమాల్లోనే నటించి, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటానంటోంది. ఫోటో సెషన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అమ్మడికి. డిఫరెంట్ స్టైల్స్‌లో ఫోటోలకు పోజిచ్చి, ఇలా సోషల్ మీడియాని తన గ్లామర్‌తో నింపేస్తోంది ముద్దుగుమ్మ ఈషా రెబ్బ.