రాజమౌళి మొత్తానికి బాహుబలి రెండు భాగాలను విజయవంతంగా చెక్కి ప్రేకషకుల ముందు పెట్టనున్నాడు. ఇక ఈ తరుణంలో ఆయన తరువాత చేయబోయే సినిమా పై అందరి దృష్టి పడింది.
అయితే రాజమౌళి మహేష్ తో తన తదుపరి చిత్రం చేయాల్సి ఉంది. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్తితుల్లో మహేష్ తో సినిమా రాజమౌళి చేయలేదు అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీనికి కారణమేంటంటే, మహేష్ నెక్స్ట్ కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ అనే చిత్రాన్ని ఏప్రిల్ కాని మే నెలలో మొదలెట్టనున్నాడు.
మరి ఆ సినిమాకి 2017 మొత్తం సరిపోతుంది. అందువల్ల ఈ గ్యాప్ లో రాజమౌళి ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం మెండుగా ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే ఎన్టీఆర్-బాబీల చిత్రం ఈ దసరాకి విడుదల చేసే యోచనలో సెప్టెంబర్ వరకు ఈ షూటింగ్ పూర్తీ చేయనున్నారు.
దీనితో రాజమౌళి-ఎన్టీఆర్ చిత్రం అక్టోబర్లో మొదలయ్యే ఆస్కారం ఉంది.