ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ తండ్రి కృష్ణరాజ్ రాయి కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు.
అందుతున్న సమాచారం ప్రకారం, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణరాజ్ రాయి ని రెండు వారల క్రితం ముంబై లోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే క్రమేపి అతని అరోగ్యం క్షీణిస్తూ వస్తు నేటి మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు.
వయసు రిత్యా వచ్చిన అనారోగ్యం కారణంగానే ఆయన చనిపోయినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. చనిపోయే సమయానికి కృష్ణరాజ్ రాయి దగ్గర కూతురు ఐశ్వర్య రాయ్ అలాగే తన భార్య వ్రిందా, కుమారుడు ఉన్నట్టు సమాచారం.