నాగ్‌ ఎప్పటికీ నవ యుగ మన్మథుడే

మరిన్ని వార్తలు

ఇంత వయసులోనూ మన్మధుడిగా కనిపించడం టాలీవుడ్‌లో నాగ్‌కే చెల్లింది. అందుకే ఆయన టాలీవుడ్‌ మన్మధుడయ్యాడు. తాజాగా ఆయన 'రాజుగారి గది - 2' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలోని వర్కింగ్‌ స్టిల్‌ ఒకటి తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశాడు నాగార్జున. ఈ స్టిల్‌ని పోస్ట్‌ చేస్తూ 'మీకు దయ్యాలంటే భయమా? ఈ ముగ్గురికి..' అని ట్వీట్‌ చేశారు. ఇదో హారర్‌ థ్రిల్లర్‌ మూవీ. అలాగే వినోదం కూడా ఉంటుంది. అయితే సినిమా సంగతి అలా ఉంచితే, ఈ తాజా స్టిల్‌లో నాగ్‌తో పాటు అశ్విన్‌ బాబు, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌ ఉన్నారు. ఈ ముగ్గురూ నాగ్‌ కంటే వయసులో చాలా చాలా చిన్నవాళ్లు. ఇంచుమించుగా నాగ్‌కి తన కొడుకు వయసులో ఉన్నవాళ్లు. అయినా కానీ ఆ ముగ్గురి వయసు కన్నా తక్కువ వయసున్నోడిలా, యంగ్‌ అండ్‌ డైనమిక్‌గా హ్యాండ్‌సమ్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. అందుకే నాగార్జునకి యూత్‌లో అంత ఫాలోయింగ్‌. ఇకపోతే ఈ సినిమా ఓంకార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. 'రాజుగారి గది' సినిమాతో అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాడు ఓంకార్‌. కాన్సెప్ట్‌ నచ్చి, నాగార్జున ఈ సినిమాలో నటించేందుకు ముందుకొచ్చారు. తొలిసారిగా హారర్‌ మూవీలో నటిస్తున్నాడు నాగార్జున. సైకియాట్రిస్ట్‌ పాత్ర పోషిస్తున్నాడు. సమంత కీలక పాత్రలో నటిస్తుండగా, సీరత్‌ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS