నాని కి ‘మాస్ హీరో’ టైటిల్ వచ్చేసిందిగా!!

మరిన్ని వార్తలు

మోస్ట్ ప్రామిసింగ్ హీరోస్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్న నాని మెల్లమెల్లగా తన రేంజ్ పెంచుకుంటూ ఇప్పుడు టాలీవుడ్ టాప్ -10 హీరోస్ లో ఒకడిగా నిలిచాడు.

అయితే ఇతని ఫ్యాన్ బేస్ ఎక్కువగా అమ్మాయిలు అలాగే యూత్ లో ఉంటుంది. అలాకాకుండా మొత్తానికి మొత్తంగా అందరి అభిమానం పొందాలంటే మాస్ హీరో ఇమేజ్ తప్పనిసరి. ప్రస్తుతం నాని ఆ ఇమేజ్ ని సొంతం చేసుకొనే పనిలో పడ్డాడు.

ఇది ఇలా ఉంటే అతని కొత్త చిత్రానికి ‘మాస్ హీరో’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. అయితే ఇది కావాలనే ఈ టైటిల్ ఫిక్స్ చేసారా లేక కధను బట్టి పెట్టిన్రా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

ఈ చిత్రానికి కొత్త దర్శకుడు శివ దర్శకత్వం వహిస్తుండగా డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS