డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలు ఉన్నట్టుగా బయటకి వచ్చిన పేర్లలో పూరీ జగన్నాధ్ పేరు ఒకటి. ఇక ఆయనకి Excise Enforcement ద్వారా నోటీసులు కూడా అందాయి. దానితో ఆయన ఇవాళ సిట్ ముందు విచారణకి హాజరయ్యాడు.
ప్రస్తుతం ఆయనని అకున్ సబర్వాల్ నేతృత్వంలోని సిట్ అధికారులు విచారణ చేపడుతున్నారు. సరిగ్గా 10.30 నిమిషాలకు మొదలయిన ఈ విచారణ ఎంత సేపు కొనసాగుతుంది అన్న విషయం ఇంకా తెలియలేదు.
ఇక మీడియా ఈ విచారణ జరిగే క్రమాన్ని పెద్ద ఎత్తున కవర్ చేస్తున్నది, విచారణకి వచ్చింది సినీ సెలబ్రిటీ అవ్వడంతో ఈ న్యూస్ కి బాగా పబ్లిసిటీ వచ్చింది.
ఇవాళ నుండి జరిగే ఈ విచారణలో రోజుకు ఒక్కొక్కరి చొప్పున సెలెబ్రిటీస్ సిట్ ముందు విచారణకి హాజరుకానున్నారు.