ముంబైలోని ఒక ధియేటర్ లో సినిమా చూడడానికి వెళ్ళిన మరాఠీ నటి ప్రియాకి ఒక చెదు అనుభవం ఎదురయింది.
సినిమా చూస్తున్న సమయంలో ప్రియా వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నటి పై అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. చివరికి ఆమెని తాకే ప్రయత్నం చేయగా ప్రియా వెంటనే ధియేటర్ సెక్యూరిటీ వారిని పిలవడంతో వారుసదరు వ్యక్తిని పోలీసులకి అప్పగించారు.
అయితే ఆ వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడు అని ఆ మత్తులోనే ఇలా ప్రవర్తించాడు అని పోలీసులు నిర్దారించారు. అతని పై నటి ప్రియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.