సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న రాజశేఖర్ కి గరుడ వేగ రూపంలో ఒక మంచి హిట్ వచ్చింది.
ఇక ఈ చిత్రం విషయానికి వస్తే, దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటున్నది. NIA ఆఫీసర్ గా రాజశేఖర్ అద్బుతమైన ప్రతిభ కనబరిచినట్టు అందరు ఒకే మాట చెబుతున్నారు.
ఇంకొంతమంది అయితే రాజశేఖర్ ని దర్శకడు ప్రవీణ్ వాడుకున్నంతగా ఎవరు వాడుకోలేదు అని చెప్పడం గమనార్హం. ఇక దర్శకుడు ప్రవీణ్ గురించి చెప్పాలంటే ఆయన కెరీర్ మొదలైన నాటి నుండి కూడా దర్శకత్వం వహించిన ప్రతి చిత్రం ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా తీయగలిగాడు.
చందమామ కథలు చిత్రానికి జాతీయ అవార్డు పొందిన ఈ దర్శకుడు తనలోని విలక్షణతని ఈ చిత్రంతో సైతం నిరూపించుకున్నాడు. గరుడ వేగ చిత్రాన్ని కథతో పాటు టెక్నికల్ గా కూడా చాలా బాగా తీసాడు అని అందరు ముక్తకంఠంతో చెబుతున్న మాట.
ఏదైతేనేమి.. రాజశేఖర్ కి తన కెరీర్ లో తప్పనిసరిగా కావాల్సిన హిట్ దొరికింది అలాగే ప్రవీణ్ కి కూడా తనలోని ప్రతిభని మరో చిత్ర రూపంలో చూపించగలిగాడు.