డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల విచారణలో భాగంగా ఈ రోజు ప్రముఖ హీరో రవితేజ అబ్కారీ శాఖ సిట్ అధికారుల ఎదుట హాజరయ్యాడు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న 12 మంది సినీ ప్రముఖుల్లో ఇప్పటి వరకూ ఎనిమిది మందిని విచారించిన సిట్ అధికారులు, తొమ్మిదో వ్యక్తిగా రవితేజను విచారిస్తున్నారు. డ్రగ్స్ పెడరల్స్‌గా ఉన్న ఇద్దరు వ్యక్తుల వద్ద రవితేజ ఫోన్ కాంటాక్ట్స్ ఉండడంతో, ఈ కేసులో రవితేజ అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఇంతవరకూ విచారించిన వారిలో ఒక్కొక్కరినీ దాదాపు 10, 11, 12 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. మరి రవితేజని ఎంత సేపు విచారిస్తారో అనేది ఆశక్తిగా మారింది. వాస్తవానికి రవితేజని కేవలం సాక్షిగా మాత్రమే పిలుస్తున్నామని సిట్ అధికారులు అంటున్నా, లోపల జరిగేది వేరేగా ఉంటుందంటూ వాదన వినిపిస్తోంది మరో పక్క. రవితేజ కోసం కొత్త కోణంలో విచారించడానికి సిట్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారమ్ అందుతోంది. ఏది ఏమైనా ఈ కేసుకి సంబందించి రవితేజ ఇచ్చే సమాచారం అత్యంత కీలకం కానుంది. షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్న రవితేజ రెండ్రోజుల క్రితమే హైద్రాబాద్‌కి వచ్చారు. తనకు డ్రగ్స్‌తో ఏ సంబంధం లేదనీ, తనపై వస్తున్న అభియోగాల్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ రవితేజ సన్నిహితులతో అన్నట్లు సమాచారమ్. ఉదయం 10 గంటలకు రవితేజ చాలా కాన్ఫిడెంట్‌గా సిట్ కార్యాలయంలోకి ప్రవేశించారు. ఈ విచారణలో రవితేజ ఏం చెప్తారనేది. ఎలాంటి సమాచారాన్ని రవితేజ నుండి సిట్ అధికారులు సేకరిస్తారనేది వేచి చూడాలి.