ప్రముఖ రాజకీయ నాయకుడైన దేవినేని నెహ్రు ఆకస్మిక మృతి పై ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ స్పందించారు.
వివరాల్లోకి వెళితే, నేటి తెల్లవారుజామున దేవినేని నెహ్రు గుండెపోటుతో హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో మరణించారు. దేవినేని మరణం పై ఆర్జీవీ తన విచారం వ్యక్తం చేశారు.
ఈ మధ్యనే ఆర్జీవీ తీసిన వంగవీటి సినిమా నేపధ్యంలో దేవినేని నెహ్రు ని పలుమార్లు కలుసుకోవడం ఆ నేపధ్యంలో తమ మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధం ఏర్పడిందిఅని పేర్కొన్నారు.
ఇక దేవినేని పార్థివ దేహాన్ని సినీ రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాలర్పించారు. ఆ జాబితాలో నందమూరి హరికృష్ణ కూడా ఉన్నారు.