'స్పైడర్‌'పై ఈ రూమర్‌ నిజమేనా?

మరిన్ని వార్తలు

మహేష్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'స్పైడర్‌' విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ డిసెంబరుకు చేరింది ప్రస్తుతానికి. మొదట్లో ఈ సినిమాని ఆగష్టులో విడుదల చేయాలనుకున్నారు. కానీ సెప్టెంబర్‌కు వాయిదా పడి దసరా కానుకగా రాబోతుందన్నారు. ఇప్పుడు మళ్లీ దసరా రేసు నుంచి తప్పుకుని డిసెంబర్‌కి వెళ్ళిపోయిందట. ఈ గాసిప్‌ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దాంతో మహేష్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే డిసెంబర్‌లోకి మారిందనే తాజా గాసిప్‌లో నిజమెంతుందో తెలీదు కానీ ఈ గాసిప్స్‌తో సంబంధం లేకుండా సినిమా షూటింగ్‌ని శరవేగంగా పూర్తిచేసే పనిలో ఉంది చిత్ర యూనిట్‌. దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ హైద్రాబాద్‌లో ఇటీవలే రాత్రి వేళ షూటింగ్‌ జరిపిన విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించారు. ఆ సమయంలో తన పొటోని పోస్ట్‌ చేయడం ద్వారా మురుగదాస్‌ ఈ విషయాన్ని తెలిపారు. తెలుగు, తమిళంలో ఏకకాలంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మహేష్‌ కెరీర్‌లోనే భారీ ప్రాజెక్ట్‌ ఇది. అత్యంత భారీ బడ్జెట్‌ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌ చూస్తే సినిమాపై అంచనాలు పెరిగాయి. హై రేంజ్‌లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సినిమా కోసం వాడారని తెలియవస్తోంది. ఎస్‌.జె.సూర్య ఈ సినిమాలో మహేష్‌కి విలన్‌గా నటిస్తుండగా, తమిళ హీరో భరత్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. స్పై కాప్‌గా నటిస్తున్నాడు మహేష్‌ ఈ సినిమాలో.

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS