సాధారణంగా పెళ్లితో తమ కెరీర్ ఆగిపోతుంది అనుకునే మహిళలకి స్పూర్తినిచ్చే సంఘటన ఇది.
వివరాల్లోకి వెళితే, నటుడిగా తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న అజయ్ భార్య శ్వేతా రావూరి ఈ సంవత్సరపు మిసెస్ ఇండియా వరల్డ్ ఫైనల్స్ కి ఎంపిక అవ్వడం జరిగింది.
ఈ విషయాన్నిఅజయ్ స్వయంగా తన ఫేస్బుక్ ద్వారా అందరితో పంచుకున్నాడు. అలాగే తన భార్య టైటిల్ గెలవాలని ఆకాంక్షిస్తూ బెస్ట్ విషెస్ చెప్పండి అంటూ తన ఫ్యాన్స్ కి మెసేజ్ చేశాడు.
ఈ సందర్భంగా భార్యని ఇంతలా ప్రోత్సహిస్తున్న అజయ్ అందరికి ఆదర్శప్రాయుడు అని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.