నటీనటులు: రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకుణే, జీవ, చిరాగ్ పాటిల్, పంకజ్ త్రిపాఠీ, సకీబ్ సలీమ్
దర్శకత్వం : కబీర్ ఖాన్
నిర్మాతలు: మధు మంతెన, విష్ణు ఇందూరి
సంగీత దర్శకుడు: ప్రీతమ్ చక్రవర్తి, జూలియస్ ప్యాకియం
సినిమాటోగ్రఫీ: అసీమ్ మిశ్రా
ఎడిటర్: నితిన్ బైడ్
రేటింగ్ : 3/5
1983 ఇండియన్ క్యాలెండర్ ఓ హిస్టారికల్ ఇయర్. 1983 భారత్ క్రికెట్ ప్రపంచ కప్ ముద్దాడిని క్షణం. అదో హిస్టారికల్ మూమెంట్. ఇప్పుడా ఘట్టాన్ని వెండితెరపై ఆవిష్కరించారు. లజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన సినిమా '83’. ఈ చిత్రానికి తెలుగులో కూడా విడుదల చేశారు. రణ్‌వీర్ సింగ్ కపిల్ గా పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక్కసారి ఆ హిస్టారికల్ మూమెంట్ లోకి వెళితే..
కథ:
చరిత్రని కథగా తీసినప్పుడు దాదాపు చాలామందికి కథపై ఒక ఐడియా వుంటుంది. 1983లో భారత్ వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ చరిత్రనే సినిమాగా తీశారు. అయితే ఈ చరిత్రలో ఆసక్తికరమైన అంశాలు వున్నాయి.
1983 కి ముందు ఇండియా టీమ్ ని ఎవరూ లెక్కచేయలేదు. ఎలాంటి అంచనాలు లేని జట్టు వరల్డ్ కప్ ఫైనల్ వరకు ఎలా చేరింది? అప్పటికే రెండు సార్లు ప్రపంచకప్ గెలుచుకున్న వెస్టండీస్‌పై ఎలా గెలిచి చింది ? ఇండియన్ క్రికెటర్ల మధ్య ఎలాంటి అనుబంధం వుండేది ? భారత జెండాను లార్డ్స్ మైదానంలో సగర్వంగా ఎగిరేలా చేసిన క్రికెట్టు జట్టు సమష్టి కృషి ఏమిటి ? కపిల్ దేవ్ ఒక కెప్టన్ గా జట్టుని ఎలా ముందుకు నడిపించాడు? అనేది వెండితెరపై చూడాలి.
విశ్లేషణ:
భారత్ లో క్రికెట్ అనేది ఒక ఆట కాదు. ఒక ఎమోషన్. అందుకే క్రికెటర్ల జీవితాలపై కూడా ఒక ఆసక్తి. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ధోని జీవితంపై సినిమా తీస్తే అంతే ఆసక్తిగా చూశారు ప్రేక్షకులు. అందులో ఎమోషన్ కూడా అద్భుతంగా పండింది. ఇప్పుడు మొదటి ప్రపంచ కప్ హీరో జీవితంపై సినిమా వచ్చింది. అలనాటి జ్ఞాపకాలు, ఆ మధుర క్షణాలని అంతే ఎమోషనల్ గా అద్భుతంగా క్యాప్చర్ చేశాడు 83 దర్శకుడు కబీర్ ఖాన్. భారత జట్టు ప్రపంచ కప్ పోటీల కోసం ఇంగ్లండ్ బయలుదేరడంతో సినిమా మొదలవుతుంది. జట్టు మీద ఉన్న తక్కువ అంచనాలను చూపిస్తూ.. నాటి జట్టు సభ్యులని పరిచయం చేస్తూ.. అలనాటి కాలంలోకి తీసుకెళ్ళడంలో దర్శకుడు విజయం సాధించాడు. ఎలాంటి అంచనాలు ఎల్ని భారత జట్టు ఎదురుకున్న అవమానాలు, నాటి జట్టు సభ్యుల మానసిక స్థితిని తెరపై చక్కగా చిత్రీకరించాడు. చరిత్ర మనికి ముందే తెలుసు.. అయితే ఆ చరిత్రని ఆసక్తికరంగా చూపించడంలో టీం విజయం సాధించింది.
కేవలం మైదానమే కాదు మైదానం బయట నాటి పరిస్థితిలు కూడా చూపించే ప్రయత్నం జరిగింది. నాటి మత ఘర్షణలు, ప్రధానిగా ఇందిరా, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రోజున ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితి, భారతీయుల ఉద్వేగం.. ఇలాంటి విషయాలని కూడా చూపించే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని చోట్ల ఎమోషన్ పడించడానికి ఓవర్ డ్రామా చేసినట్లు కూడా అనిపిస్తుంది. కొన్ని చోట్ల సహజత్వం లోపించినట్లుగా టేకింగ్ వుంటుంది. అది మినహిస్తే.,., అలనాటి జ్ఞాపకాలన్నీ పోగేసి వెండితెర ఓ దృశ్యాన్ని మలచిన తీరు మాత్రం ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారు? కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ ఒదిగిపోయాడు. టీంలో ధైర్యం నింపే కెప్టన్ గా అదే సమయంలో భారత్ ఆశలని మోసిన ఒక క్రికెటర్ గా అతడి నటన మెప్పిస్తుంది. కపిల్ దేవ్ భార్య రోమి భాటియాగా దీపికా పదుకొణె ఆకట్టుకుంది. జట్టు మ్యానేజర్ మాన్ సింగ్‌గా పంకజ్ త్రిపాఠికి మంచి పాత్ర దక్కింది.క్రిష్ణమాచారి శ్రీకాంత్‌గా జీవా మెప్పిస్తాడు. మిగతా జట్టు సభ్యుల పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి.
టెక్నికల్:
అలనాటి పరిస్థితులని తెరపై చక్కగా తీసుకొచ్చారు. మంచి ఆర్ట్ వర్క్ కనిపిస్తుంది. సంభాషణలు ఆకట్టుకుంటాయి. కెమెరా పనితనం బావుంది. నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
రణ్‌వీర్‌సింగ్
కబీర్ ఖాన్ దర్శకత్వం
అలనాటి జ్ఞాపకాలని చక్కగా తెరపైకి తీసుకొచ్చిన విధానం
మైనస్ పాయింట్స్
కొన్ని చోట్ల సాగాదీత
కొన్ని ఓవర్ డ్రమటైజ్ సీన్స్
ఫైనల్ వర్దిక్ట్ : 83.. అలనాటి మధుర జ్ఞాపకాలు