'ఆచార్య' మూవీ రివ్యూ రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: చిరంజీవి, రామ్ చరణ్ తేజ, పూజా హెగ్డే, సోనూ సూద్, జిషు సేన్‌గుప్తా, తనికెళ్ల భరణి
దర్శకత్వం : కొరటాల శివ
నిర్మాతలు: రామ్ చరణ్ తేజ, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సంగీత దర్శకుడు: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: తిర్రు
ఎడిటర్ : నవీన్ నూలి


రేటింగ్: 2/5


మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే బాక్సాఫీసు హంగామా. ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తోడయ్యారంటే అంచనాలు ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. కెరీర్లో అపజయం లేని దర్శకుడు కొరటాల శివ చిత్రానికి దర్శకుడు అంటే ఆ అంచనాలు ఇంకా రెట్టింపవుతాయి. ఇలా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆచార్య. మరి ఈ అంచనాలని ఆచార్య అందుకుందా ? ఆచార్య ఎలాంటి పాఠాలు చెప్పారు ? ఆ పాఠాలు ప్రేక్షకులకి నచ్చాయా ? తెలియాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.


కథ:


ధ‌ర్మస్థలిది ఏళ్ల నాటి చరిత్ర. ధర్మానికి ప్రతీక. దానికి అనుకోని వున్న తండా పాద‌ఘ‌ట్టం. బసవ (సోనూసూద్) ధర్మస్థలిని తన చేతిలికి తీసుకొని నేరాలకు పాల్పడి ఆచరాచం సృష్టిస్తుంటాడు. ఈ క్రమంలో ధర్మస్థలిలో అడుగుపెడతాడు ఆచార్య (చిరంజీవి). అక్కడి ప్రజలకు ఆచార్య ఎలా సహాయం చేశాడు ? బసవ అక్రమాలని ఎలా కట్టడి చేశాడు ? సిద్ధ (రామ్ చరణ్)తో ఆచార్యకి ఉన్న సంబంధం ఏమిటి ? వీరిద్దరూ ధర్మస్థలి ప్రజలను ఎలా కాపాడారనేది మిగతా కథ.


విశ్లేషణ:


పాత కథలు, చిన్న పాయింట్లని కొత్తగా ప్రజంట్ చేయడం కొరటాల శివ స్టయిల్. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను .. గొప్ప కథలు కావు. అయితే ట్రీట్మెంట్ గొప్పగా వుంటుంది. ఆచార్యలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలనీ ప్రయత్నించాడు కొరటాల. బ్యాడ్ లక్ ఏమిటంటే.. ఆ టెక్నిక్ ఇక్కడ వర్క్ అవుట్ కాలేదు. అన్యాయాల్ని ఎదురురించడానికి ఓ హీరో వస్తాడు. క్రీస్తు పూర్వం నాటి లైను ఇది. ఇదే లైన్ తో ధర్మస్థలి-పాధఘట్టం ఏదేదో చెప్పి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేశాడు కొరటాల. ధర్మం మాట పక్కన పెడితే ప్రేక్షకులు అన్యామైపోయిన పరిస్థితి నెలకొంది. 


కథ మొదలుపెట్టడానికే చాలా సమయం తీసుకున్న కొరటాల.. తర్వాత హీరో ఎంట్రీతోనైనా ఒక ఊపు వస్తుందని వూహించిన ప్రేక్షకుడి నిరాశే మిగిల్చాడు. బహుసా ఇంత సింపుల్ ఎంట్రీ మెగాస్టార్ కెరీర్ లోనే అరుదు. హీరో ఎంట్రీ ఎంత సాదాసీదాగా వుంటుందో తర్వాత వచ్చే సీన్స్ కూడా అంతే సింపుల్ గా రొటీన్ గా వెళ్ళిపోతుంటాయి. ఏ సీను బలంగా వుండదు. అసలు చూస్తున్నది చిరంజీవి సినిమానేనా అనే డౌట్ కూడా వస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఆ ఐటెం సాంగ్ కొంత ఊరట. 


సరిగ్గా ఇంటర్వెల్ సమయానికి సిద్దా పాత్ర స్వాగతం పలికి సెకండ్ హాఫ్ పై అంచనాలు రేపిన దర్శకుడు.. సెకండ్ హాఫ్ మొదలైన మూడో సీన్ నుంచే పరమ రొటీన్ గా కధనం నడిపించాడు. సీన్స్ ని కొత్తగా ప్రజంట్ చేయలేకపోయిన కొరటాల కనీసం డైలాగ్స్ పై ద్రుష్టి పెట్టలేదు. ఒక్క డైలాగ్ కూడా సూపర్ అనిపించలేదు. చివరికి క్లైమాక్స్ కూడ ఒక ప్రహసనంగా మారి ప్రేక్షకుడు తలపెట్టుకునేలా చేస్తుంది. 


కొరటాల సినిమాలో పాత్రలు బలంగా వుంటాయి. కథ స్లోగా నడుస్తున్నా ఒక్కడక్కడ ఒక మెరుపులా వేగం పెంచి వావ్ అనిపించే మూమెంట్ వుంటుంది. ఆచార్యలో లాంటి ఒక్క మెరుపు కూడా లేదు. కొరటాల మంచి కథకుడు. అయితే ఇంత వీక్ స్టోరీ ఎందుకు ఎంచుకున్నాడో అర్ధం కాదు. బహుషా మెగాస్టార్ వుంటే చాలనుకునే అతి విశ్వాసం కావచ్చు. ఎవరి పాత్రలు ఎలా వున్నా కనీసం హీరో పాత్రని బలంగా డిజైన్ చేయాలి. నాలుగు హిట్లు కొట్టిన కొరటాల ఈ రూలు మర్చిపోవడం ఇంకా వింతగా వుంది. మొత్తానికి మెగాస్టార్ కెరీర్ లో ఇంతటి బోరింగ్ సినిమా చేరుతుందని ఎవరూ వూహించి వుండరు. 


నటీనటులు :


మెగాస్టార్ నటన గురించి ఈ రోజు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆచార్య పాత్ర ఆయనకి కొట్టిన పిండి. అయితే పాత్ర నిర్మాణంలో బలం లేకపోవడంతో ఆచార్యకు ఆడియన్ కనెక్ట్ కాలేడు. డ్యాన్సులు ఫైటులు ఇలా ఎన్ని చూసినా అంతా కుత్రిమ వ్యవహారంలా వుంటుంది.


చరణ్ సిద్దా పాత్రలో కొత్తదనం ఏమీ లేదు. ఇలాంటి పాత్ర చరణ్ ఇంతముందే చేసేశాడు. పూజా హెగ్డే వల్ల సినిమాకి కలిగిన లాభం లేదు. నీలాంబరి పాట ఓకే అనిపిస్తుంది. సోనుసూద్ పాత్ర కూడా వీక్ గా వుంటుంది. మిగతా పాత్రలు గురించి చెప్పడం అనవసరం. 
  

టెక్నికల్ గా:


నిర్మాణ విలువలు ఉన్నంతగా వున్నాయి. మణిశర్మ పాటల్లో మునుపటి ఊపు లేదు. నేపధ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. ఆర్ట్ వర్క్ బావుంది. కెమరా పనితీరు రిచ్ గా వుంది. ఎడిటింగ్ ఇంకా సార్ఫ్ గా ఉండాల్సింది. నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు. 


ప్లస్ పాయింట్స్


చిరంజీవి, రామ్ చరణ్ 
బంజారా, నీలాంబరి పాటలు 
కొన్ని యాక్షన్ సీన్లు 


మైనస్ పాయింట్స్


అత్యంత బలహీనమైన కథ 
పరమ రొటీన్ స్క్రీన్ ప్లే 
పాత్రలు బలంగా లేకపోవడం 
ఎమోషన్స్ పండకపోవడం


ఫైనల్ వర్దిక్ట్ : ఆచార్య ..పరమ రొటీన్ పాఠం


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS