Amigos Review: అమిగోస్ మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: కళ్యాణ్ రామ్, ఆశికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి & ఇతరులు
దర్శకుడు : రాజేంద్ర రెడ్డి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
సంగీత దర్శకులు: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: ఎస్. సౌందర్ రాజన్
ఎడిటర్: తమ్మిరాజు


రేటింగ్: 2.75/5


జయాపజయాలు మాట పక్కన పెడితే కళ్యాణ్ రామ్ కథల ఎంపిక బావుంటుంది. కథలో ఎదో కొత్తదనం ఉండేలా చూసుకుంటారు కళ్యాణ్ రామ్. బింబిసార అలా కొత్త ప్రయత్నంలో వచ్చిందే. ఇప్పుడు అదే జోష్ లో ‘అమిగోస్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కళ్యాణ్ రామ్. ఇది కల్యాణ్‌రామ్‌కు తొలి త్రిపాత్రాభినయ చిత్రం. కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి తెరకెక్కించారు. బింబిసార తర్వాత చేస్తున్న చిత్రం కావడం, ట్రైలర్ ఆసక్తిని పెంచడంతో అమిగోస్ పై అంచనాలు ఏర్పడాయి. మరా అంచనాలని అందుకున్నారా ? ఇంతకీ అమిగోస్ కథ ఏమిటి ?


కథ :


సిద్ధు( కళ్యాణ్ రామ్) తన తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటుంటాడు. రేడియో జాకీగా పని చేసే ఇషికా (ఆషికా రంగనాథ్‌)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో వాళ్ల ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తాడు. అయితే ఇషికా మాత్రం సిద్ధుకి కొన్ని కండీషన్లు పెడుతుంది. అదే సమయంలో సిద్ధార్థ్‌ ఓ వెబ్‌సైట్‌ వల్ల తనలాగే ఉండే మంజునాథ్, మైఖేల్‌ను కలుసుకుంటాడు. మంజు, మైఖేల్‌ సాయంతో సిద్ధు పెళ్ళికి లైన్ క్లియర్ అవుతుంది. ఇదే సమయంలో మైఖేల్ కారణంగా సిద్ధు, మంజు జీవితాలు ప్రమాదంలో పడతాయి. మైఖేల్‌ గురించి సిద్ధు కి ఓ నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏంటి ? అసలు మైఖేల్ ఎవరు ? మంజు, సిద్ధుతో ఎందుకు కలిశాడు ? చివరికి సిద్ధు మంజు ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారనేది మిగతా కథ.  


విశ్లేషణ:


ఒకే పోలికలతో ఉండే ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగే కథ ఇది. బేసిగ్ గా ఇది థ్రిల్లర్. అయితే దర్శకుడు ప్రేమకథగా కథని మొదలుపెతాడు. సిద్ధు , మంజుని చూడటం, ఇష్టపడటం , పెళ్లి చూపులకు వెళ్ళడం.. ఇవన్నీ రొటీన్ గానే వుంటాయి. ఒకే పోలికలతో ఉన్న సిద్ధార్థ్, మంజునాథ్, మైఖేల్‌ ఒకచోటకు చేరాక అసలు కథ మొదలౌతుంది. అయితే తర్వాత అదే వేగానాన్ని కొనసాగించి వుంటే బావుండేది మళ్ళీ ప్రేమ కథలోకి తీసుకొచ్చి ఇంటర్వెల్ వరకూ టైం పాస్ చేసిన వ్యవహారం కనిపిస్తుంది. మైఖేల్ పాత్ర రూపంలో ఇంటర్వెల్ ఎలా వుంటుందో ప్రేక్షకులకు ముందే తెలిసినా ఆ ఎపిసోడ్ ని ఆసక్తిగానే మలిచారు. 


సెకండ్ హాఫ్ లో అసలు థ్రిల్ మొదలవ్వాలి. అయితే పాత్రలని రాసుకున్న విధానంలో సాగదీత కనిపిస్తుంది. మైఖేల్ పాత్ర తప్పా మిగతా పాత్రలన్నీ వీక్ గా డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్ లో సన్నివేశాలన్నీ అక్కడికక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో ప్రేమ కథ వీక్ గా వుంటే సెకండ్ హాఫ్ లో ప్రీక్లైమాక్స్ క్లైమాక్స్ ని సాగదీశారు. నిజానికి ఈ కథకు థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్, ఎత్తులు పైఎత్తులతో రసవత్తరంగా స్క్రిప్ట్‌ సిద్ధం చేసుకుంటే ఓ వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ అయ్యేది. కానీ, దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఆ దిశ గా అలోచించలేదు. డోపెల్‌గాంజర్స్ అనే కాన్సెప్ట్ కొత్తగా వుంటుందని భావించాడు తప్పితే ఇలాంటి కథలు, పాత్రలు ఇప్పటికే ప్రేక్షకులు చూశారు ఇందులో కొత్తదనం ఏమిటనే పాయింట్ అలోచించి వుంటే.. అమిగోస్ థ్రిల్ ఇంకాస్త బెటర్ గా వుండేది. 
 

నటీనటులు :


కళ్యాణ్ రామ్ కి ట్రిపుల్ యాక్షన్ చేసే అవకాశం ఇచ్చిన కథ ఇది. మూడు పాత్రల్లోనూ చక్కటి వేరియేషన్‌ చూపించాడు కళ్యాన్ రామ్ .


మైఖేల్‌ పాత్రని చాల బలంగా చేశాడు. మిగతా రెండు పాత్రలలో కూడా చక్కని వైవిధ్యం చూపించాడు. అశిక అందంగా కనిపించింది. నటన ఓకే బ్రహ్మాజీని కామెడీ కోసం ఎత్తారు కానీ అది వర్క్ అవుట్ కాలేదు. మిగతా పాత్రలు పరిధి మేర వున్నాయి. 


టెక్నికల్ :


జిబ్రాన్‌ నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. ‘‘ఎన్నో రాత్రులొస్తాయి’ పాట బాలకృష్ణ ఫ్యాన్స్ మంచిన ట్రీట్. ఎడిటింగ్ షార్ఫ్ గా ఉండాల్సింది.


 కెమరాపనితనం బావుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బావున్నాయి. మాటల్లో మెరుపుల్లేవ్. కథనం ను ఇంకాస్త ఎంగేజింగా రాసే అవకాశం వుంది. 


ప్లస్ పాయింట్స్


కళ్యాణ్ రామ్ 
కథా నేపధ్యం 
నిర్మాణ విలువలు 


మైనస్ పాయింట్స్


సాగదీత 
లవ్ ట్రాక్ 
ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్


ఫైనల్ వర్దిక్ట్ : థ్రిల్ తగ్గింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS