అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం:  అప్పుడో ఇప్పుడో ఎప్పుడో   
దర్శకత్వం: సుధీర్ వర్మ  
కథ - రచన: సుధీర్ వర్మ

నటీనటులు: నిఖిల్ సిద్దార్థ్ , రుక్మిణి వసంతన్,  దివ్యాంశ కౌశిక్, హర్ష చెముడు, అజయ్, జాన్ విజయ్ తదితరులు.

నిర్మాతలు: బీవిఎస్ ఎన్ ప్రసాద్

సంగీతం: కార్తీక్ , సన్నీ MR
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్


విడుదల తేదీ: 8 నవంబర్ 2024

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.25/5

ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఈ మధ్యలో అప్పుడెప్పుడో విడుదల అవాల్సిన 'అపుడో ఇపుడో ఎపుడో' మూవీని మేకర్స్ ఆడియన్స్ ముందుకు తెచ్చారు. స్వామి రారా లాంటి హిట్ ఇచ్చిన సుధీర్ వర్మ ఈ మూవీని తెరకెక్కించారు. నిఖిల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై ద్రుష్టి పెట్టడంతో ఈ మూవీ ప్రమోషన్స్ కి కూడా రాలేకపోయాడు. ఈ సినిమా ఫలితం నిఖిల్ స్వయంభూ మీద పడుతుందని భయపడుతున్నాడు. ఈ శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ అయిన అపుడో ఇపుడో ఎపుడో ఎలా ఉందో నిఖిల్ భయాలను దూరం చేసిందా? లేదా చూద్దాం.

కథ :   

హైద్రాబాద్ లో ఉంటున్నరిషి (నిఖిల్)కి రేసర్ కావాలని కోరిక. రిషి తార (రుక్మిణి వసంత్)ని ప్రేమిస్తాడు. కానీ ఆమెకి చెప్పేలోపు తారకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అనుకుని బాధతో ఇక్కడ ఉండలేక  లైఫ్ లో సెటిల్ అవటం కోసం లండన్  వెళ్ళిపోతాడు. లండన్ లో రేస్ డ్రైవర్ గా ట్రైనింగ్ తీసుకుంటూ, పాకెట్ మనీ కోసం చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. అక్కడకు వెళ్లిన రెండేళ్లకు మళ్లీ తార కనపడుతుంది. అప్పుడు తెలుస్తుంది తారకి బాయ్ ఫ్రెండ్ లేడని, దాంతో మళ్ళీ ఆమెకి దగ్గర అవుతాడు. ఈ క్రమంలో కరక్ట్ గా తార ప్రపోజ్ చేసే టైంకి తులసి (దివ్యాంశ కౌశిక్) వచ్చి రిషిని హగ్ చేసుకుంటుంది. దాంతో తార ప్రపోజ్ చేయకుండా డ్రాప్ అయిపోతుంది.  తార వెళ్లిన తర్వాత లండన్ సిటీలో ఉండే లోకల్ డాన్ బద్రి నారాయణ (జాన్ విజయ్) మనుషులు వచ్చి రిషి, అతని స్నేహితుడు బాలాజీ (హర్ష చెముడు)ని తీసుకు వెళ్లిపోతారు. ఈ బద్రి నారాయణ ఎవరు? రిషిని బద్రి నారాయణ ఎందుకు కిడ్నాప్ చేసాడు? అతడి నుంచి రిషి తప్పించుకున్నాడా  లేదా? ఈ కథలో తారా, తులసిల పాత్రలు ఏమిటి?  చివరికి రిషి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? మున్నా (అజయ్) ఎవరు? చుంబన ఎవరు?లాంటి ప్రశ్నలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: 

రొటీన్ కథ. పెద్దగా ట్విస్ట్ లు ఏం లేవు. సినిమా స్టార్టింగ్, ఇంటర్వెల్, ఎండింగ్ అన్ని నార్మల్ గా సాగుతాయి. పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' చూస్తున్నంత సేపూ క్యూరియాసిటీ గానీ, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నటెన్షన్  గానీ కలగవు. సినిమా ప్రారంభం థ్రిల్లర్ సినిమాలా మొదలై ఆ తర్వాత ప్రేమ కథగా మారుతుంది. తరువాత ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్న ట్విస్ట్ తో క్రైమ్ డ్రామాగా ముగిసింది. లవ్ సీన్స్ కూడా చాలా రొటీన్ గా ఉన్నాయి. అంతో కొంతో బెటర్ అనిపించేది పాటలు మాత్రమే. కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్ కూడా కొత్తమ్మాయి కావటంతో కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. అంతే తప్ప ఈ మూవీలో పెద్దగా చెప్పుకోవటానికి ఏం లేదు.

కథను మూడో వ్యక్తి కోణంలో చూపించడంలో సినిమా స్పీడ్ అందుకుంది. కథలోని ప్రధాన మలుపును రివీల్ చేసిన విధానం  మైనస్ అయ్యింది. ఫస్టాఫ్ మరీ తేలిపోయింది. సెకండాఫ్ కాస్త బెటర్ గా ఉన్నా ఆడియన్స్ లో అప్పటికే సహనం నశిస్తుంది. మెయిన్ సీన్స్ కూడా ఎలివేట్ చేసే విధానం బాలేదు. పూర్తి స్థాయిలో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో  అలరించ లేకపోయింది. ఇది ఎప్పుడో తీసిన సినిమా అని నిఖిల్ ని చూస్తే తెలుస్తోంది. క్రైమ్ డ్రామా సీన్స్ ఆసక్తిగా లేవు, కామెడీ లేదు, ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. సుధీర్ వర్మ, నిఖిల్ కాంబో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది.

నటీ నటులు:

నిఖిల్ కు ఇలాంటి పాత్రలు చేయడం కొత్తకాదు. తన పాత్ర పరిధిమేరకు నిఖిల్ బాగానే నటించాడు. కానీ కొత్తదనం లేకపోవటంతో చేయటానికి, నటనకి పెద్దగా ఆస్కారం లేదు. కేవలం నిఖిల్ సినిమా అని వెళ్తే ఈ సినిమాకి వెళ్ళాలి. సినిమా మొత్తం తన భుజాల మీద  మోయాలని చూసినా సినిమాలో అంత సీన్ లేదు. తారగా నటించిన రుక్మిణీ వసంత్ కన్నడలో సప్తసాగరాలు దాటి సినిమాతో మంచ్చి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగులో ఈ సినిమాలో నటించింది. తన పాత్ర వరకు న్యాయం చేసింది. స్క్రీన్ లుక్ బాగుంది. దివ్యాంశ కౌశిక్ ఎప్పటిలా డైలాగ్స్ కి ఎక్సప్రెషన్ కి సంబంధం లేకుండా ఉంది. లిప్ మూమెంట్ కూడా సింక్ అవలేదు. ఆ  పాత్ర డిజైన్ చేసిన విధానం బావుంది. నిఖిల్ స్నేహితుడిగా హర్ష చెముడు కొన్ని సన్నివేశాల్లో నవ్వించారు. సుదర్శన్, సత్య సీన్స్ కథకు సంబంధం ఉండదు. వారి వలన సినిమాకి కలిసొచ్చింది ఏం లేదు. జాన్ విజయ్, అజయ్ లు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ :

స్వామీ రారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన సుధీర్ వర్మ మార్క్ ఈ మూవీలో కనిపించలేదు. అంత క్రియేటివిటీ ఉన్న సుధీర్ వర్మ ఇంత పేలవంగా సినిమా తీసాడా అనిపిస్తుంది. అవుట్ డేటెడ్ కథ. దర్శకుడిగా కొంచెం అయినా సక్సెస్ అయిన సుధీర్ వర్మ కథకుడిగా పూర్తిగా  ఫెయిల్ అయ్యాడు. ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే లేదు. సుధీర్ వర్మ సినిమాల్లో విలన్ పాత్రలు చాలా టిపికల్‌గా ఉంటాయి. అలాటిది జాన్ విజయ్ పాత్రల్లో విలనిజం పండలేదు.  రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ వర్క్  పరవాలేదు. కార్తీక్ అందించిన  పాటలు వినసొంపుగా ఉన్నాయి. సన్నీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కలిసి రాలేదు. ప్రొడక్షన్ & ఆర్ట్ డిపార్టుమెంట్స్ వర్క్ కూడా ఏమి కనిపించటం లేదు. సినిమా టైటిల్ లాగే వాళ్ళు కూడా ఎప్పుడో రావాల్సిన సినిమా అని శ్రద్ద పెట్టలేదు. ఎదో తీసాం కాబట్టి రిలీజ్ చేసాం అన్నట్టు జనాల మీదకి వదిలేసారు. సినిమా మొత్తం చెప్పుకొనే స్థాయిలో లేదు.

ప్లస్ పాయింట్స్ 

రుక్మిణీ వసంత్ , నిఖిల్ 
పాటలు

మైనస్ పాయింట్స్ 

దర్శకత్వం 
స్క్రిన్ ప్లే 
కథ

ఫైనల్ వర్దిక్ట్ : ఇప్పుడు చూడాల్సిన సినిమా కాదు 'అప్పుడో ఇపుడో ఎప్పుడో'

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS