శివం భజే మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: శివం భజే
దర్శకత్వం: అప్సర్
కథ - రచన: అప్సర్


నటీనటులు: అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ. 


నిర్మాతలు: మహేశ్వర్ రెడ్డి మూలి


సంగీతం: వికాస్ బడిస
సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర
ఎడిటర్: చోటా కే ప్రసాద్ 


బ్యానర్:  గంగా ఎంటర్టైన్మంట్స్
విడుదల తేదీ: 1 ఆగస్టు 2024

 

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5

 

ఓం కార్ తమ్ముడిగా అశ్విన్ ఇండస్ట్రీ లో అడుగుపెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే ఓం కార్ కట్టిన పునాదులపై అశ్విన్ ఎదుగుతున్నాడు. అశ్విన్ మొదటి నుంచి మూస కథలని ఎంచుకోకుండా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. తన డిఫరెంట్ కథలతో, నటనతో ఇంప్రూవ్ అయ్యి తనకుతాను సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా శివం భజే అనే విభిన్న కథతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఎలా ఉందో? అశ్విన్ నటన పరంగా మెప్పించాడో లేదో రివ్యూ లో చూద్దాం.              

 

కథ :

కథలో మొదట చైనా , పాకిస్తాన్ కలిసి భారత్ పై దాడికి పథక రచన చేస్తుంటాయి. నెక్స్ట్ షాట్ లో హీరో ఎంట్రీ ఉంటుంది.  చందు (అశ్విన్ బాబు) లోన్ రికవరీ ఎజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకుని తిరిగే వారి దగ్గర పైసా వసూళ్ల కార్యక్రమం చేస్తుంటాడు. ఈ నేపథ్యం లోనే  శైలజ (దిగంగనా సూర్యవంశీ)ని చూసి ప్రేమలో పడతాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. శైలజ ఓ కెమికల్ ల్యాబ్‌లో జాబ్ చేస్తుంటుంది.  ఆ ఏరియాలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో కొన్ని సంఘటనలు మిస్టీరియస్ గా జరుగుతుంటాయి. రెండు హత్యలు కూడా జరుగుతాయి. వాటిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది. ఈ లోగా కొన్ని అనుకోని సంఘటనల వలన హీరో కళ్ళు పోతాయి.  తరవాత  కొన్ని నాటకీయ సంఘటనల నేపథ్యంలో శివుడి అనుగ్రహంతో చందు కళ్లకు ఆపరేషన్ జరగటం, చూపు రావటం జరుగుతుంది.


ఇక్కడనుంచి అసలు కథ మొదలవుతుంది. ఆపరేషన్ అయ్యి చూపు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. చందుకి కళ్ళు పోవటానికి కారణమేంటి? కంటి ఆపరేషన్ తరవాత చందు పరిస్థితేంటి? చందుకి పెట్టిన కళ్ళు ఎవరవి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి ? శివుడి అనుగ్రహంతో చందు ఏం సాధించాడు?  శివం భజే లో కుక్క పాత్ర ఏంటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.    

 

విశ్లేషణ: 

ఇదొక డిఫరెంట్ జోనర్ మూవీ. శివం భజే లో డివోషనల్ కాన్సెప్ట్ తో పాటు మిస్టీరియస్ థ్రిల్లర్‌ కూడా ఉంది. యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా హైలెట్ అవుతాయి. క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకుడి ఊహకు మించి ఉంటుంది. దర్శకుడు స్క్రిప్ట్  పర్ఫెక్టుగా రాసుకున్నాడన్న సంగతి అర్థమవుతోంది. డివోషనల్ మిక్స్ చేసిన క్రైమ్ డ్రామా ఓకే అనిపిస్తోంది. మూవీలో వచ్చే కొన్ని సస్పెన్స్ సీన్స్ బాగున్నాయి. చందు పాత్రలో అశ్విన్ బాబు మరొకసారి మెప్పించాడు. హీరోయిన్ నటన బానే ఉంది. డైరక్టర్ అప్సర్ తీసుకున్న మెయిన్ పాయింట్ ని ఎలివేట్ చేస్తూ రాసుకున్న సీన్స్ పర్వాలేదనిపించాయి. శత్రుదేశాల దాడి డ్రామా కూడా బాగానే ఉంది. కాకపోతే స్లో నరేషన్ ఆడియన్స్ కి విసుగు తెప్పిస్తుంది. కొని చోట్ల క్రైమ్ ఎలిమెంట్స్ తెలిపోయాయి. డివోషనల్ కాన్సెప్ట్ ని ఇంకా వాడుకుని ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. హత్యలకు బలమైన మోటీవ్ చెప్పలేకపోయారు. కొన్ని సందర్భాల్లో కన్ఫ్యుజింగ్ గా అనిపిస్తుంది. శత్రుదేశాల దాడి కుట్ర , డివోషనల్ , ఎమోషనల్, సస్పెన్స్ వీటన్నిటిని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేక తానూ గందరగోళంలో పడి, ప్రేక్షకుడ్ని కూడా అయోమయానికి గురిచేశాడు దర్శకుడు.              

 

నటీ నటులు:

అశ్విన్ నటన పరంగా పరవాలేదనిపించాడు. ఇంతక ముందు సినిమాల్లాగే నటనకి స్కోప్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. హీరోయిన్ ని తన పాత్ర పరిధిమేరకు బానే నటించింది. పెద్దగా స్కోప్ ఉన్న పాత్ర కాదు. ఎదో హీరోయిన్ అవసరమన్నట్టు తనని పెట్టారు. హైపర్ ఆది పంచ్‌లు కొంచెం నవ్విస్తాయి.  ఆది మేనరిజమ్ కొత్తగా ఉంది. బ్రహ్మాజీ, మురళీ శర్మ, తులసి తదితరులు తమ పాత్ర పరిథి మేరకు నటించారు.  

 

టెక్నికల్ :

దర్శకుడు అప్సర్‌ సినిమాని డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌ గా మలిచి, పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. క్రైమ్ డ్రామాని ఇంకొంచెం బెటర్‌గా డవలప్ చేసి ఉండి ఉంటే బాగుండేది. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. వికాస్ బడిస సంగీతం పర్వాలేదనిపించింది. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ ఆకట్టుకుంది. నిర్మాత ఖర్చుకి వెనకాడకుండా ఈ మూవీని నిర్మించారని ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే అర్థమవుతోంది. 

 

ప్లస్ పాయింట్స్ 

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ 
క్లైమాక్స్  
సినిమాటోగ్రఫీ 
  

మైనస్ పాయింట్స్ 

స్లో నరేషన్ 
ఫస్ట్ హాఫ్ బోర్  
అనవసర సీన్స్ 


ఫైనల్ వర్దిక్ట్ : పెద్దగా ఆకట్టుకొని 'శివం భజే'


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS