చిరు యాక్షన్... చిత్ర పరిశ్రమ రియాక్షన్

మరిన్ని వార్తలు

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పరిశ్రమకి గ‌ద్ద‌ర్ అవార్డులు ఇస్తామని, దీనిపై సినీపరిశ్రమ అభిప్రాయాన్ని కోరారు. కానీ ఎవరు స్పదించలేదని, సీఎం స్వయంగా అవార్డ్స్ ఇస్తామంటే పరిశ్రమ నుంచి ఎవరు ముందుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఇండస్ట్రీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి బాధ్యతగా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి- తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన అవార్డ్స్ గూర్చి చర్చించాలని. చిరు లేఖతో స్పదించిన వీరు వెంటనే రెస్పాండ్ అయి తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ  ఎ. రేవంత్ రెడ్డి - గౌరవ సినిమాటోగ్రాఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్న కృషికి ధన్యవాధాలు తెలియజేస్తూ ఒక ప్రకటన చేశారు.
   

రేవంత్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబందించిన సంస్థల ప్రతినిధులకు త‌మ విలువైన స‌మ‌యం ఇచ్చి పరిశ్రమ గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంటున్నం దుకు సంతోషం వ్యక్తపరుస్తూ నూత‌న ప్ర‌భుత్వం తెలంగాణాలో అన్నిరకాల అభివృద్ధికి కృషి  చేస్తారని తెలియజేసారు. అన్నట్టే సినీ పరిశ్రమకు చెందిన వారికి గద్దర్ అవార్డులు ప్రదానం చేస్తామని దానికి సంబంధించిన విధి విధానాలు తయారు చేయాలని కోరారు. ఈ విషయంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి- తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి గద్దర్ అవార్డ్స్ గైడ్ లైన్స్ ను తెలంగాణ ఎఫ్ డీసీకి తెలియ‌జేసాం. త్వరలో గద్దర్ అవార్డుల‌ కొరకు మార్గ దర్శకాలు తెలంగాణ ఎఫ్ డీసీ వారి సంప్రదింపులతో తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి - గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రికి స‌మ‌ర్పిస్తాం. గద్దర్ ని చూసి మేము గర్విస్తున్నామని లేఖలో తెలిపారు.


నటుడిగా, కళాకారుడిగా, సేవా రంగంలో ఆయన చేసిన కృషికి గద్దర్ పై మాకు చాలా గౌరవం ఉందని నిర్మాత‌ల మండ‌లి గౌరవ కార్య‌ద‌ర్శి టి ప్ర‌స్న్న కుమార్ పేర్కొన్నారు. నిర్మాత‌ల మండలి-వాణిజ్య మండ‌లి త‌రుపున ఓ క‌మిటి వేసి విధి విధానాలు రూపొందించి ఎఫ్ డీసీ ద్వారా సీఎంకి త‌మ ప్ర‌తిపాద‌న పంపిస్తామ‌ని ఫిలిం ఛాంబ‌ర్ అధ్య‌క్షులు భ‌ర‌త్ భూషణ్, కార్య‌దర్శులు కె.ఎల్ దామోద‌ర్ ప్ర‌సాద్, కె. శివ‌ప్ర‌సాద్ రావు ఈ ప్ర‌క‌ట‌నలో పేర్కొన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS