నటీనటులు : రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున అక్కినేని తదితరులు
దర్శకత్వం : అయాన్ ముఖర్జీ
నిర్మాతలు : కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా, రణబీర్ కపూర్, మారిజ్కే డిసౌజా, అయాన్ ముఖర్జీ
సంగీత దర్శకుడు : సైమన్ ఫ్రాంగ్లెన్, ప్రీతమ్
సినిమాటోగ్రఫీ : వి. మణికందన్, పంకజ్ కుమార్, సుదీప్ ఛటర్జీ, వికాష్ నౌలాఖా, పాట్రిక్ డ్యూరక్స్
ఎడిటర్ : ప్రకాష్ కురుప్
రేటింగ్ : 2.75/5
రణ్‌బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, నాగార్జున.. వీళ్ళంతా సూపర్ స్టార్లే. ఇంతమంది సూపర్ స్టార్లు కలసి చేసిన సినిమా ‘బ్రహ్మాస్త్రం’. తెలుగులో ఈ సినిమాని రాజమౌళి సమర్పించడం, మెగాస్టార్ చిరంజీవి వాయిస్ అందించడం, గ్రాఫిక్స్ ఆకట్టుకోవడం ఇవన్నీ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమాతో మళ్ళీ పునర్ వైభవం వస్తోందని అంచనాలు పెట్టుకున్నారు బాలీవుడ్ జనాలు. మరి ఈ సినిమా అలాంటి విజయం ఇచ్చిందా ? అసలు ‘బ్రహ్మాస్త్రం’ కథ ఏమిటో చూద్దాం.
కథ:
పూర్వం హిమాలయాల్లో వున్న ఋషులు తపస్సు చేసి కొన్ని అస్త్రాలని భూమిపైకి తెస్తారు. ఇందులో బ్రహాస్త్రం సకల అస్త్రాలకు అధిపతి. ఆ అస్త్రాన్ని తపస్సు చేసి మంత్ర శక్తీతో శాంతింపచేస్తారు. బ్రహాస్త్రం ప్రపంచాన్ని కాపాడగలదు, నాశనం కూడా చేయగలేదు. బ్రహాస్త్రం ని సాధించి ప్రపంచాన్ని అంధకారం చేయాలని జునూన్ (మౌనీరాయ్) ముఠా ప్రయత్నాలు చేస్తుంటుంది. బ్రహ్మాస్త్రంలోని ఒక భాగం మోహన్ (షారుఖ్ ఖాన్) అనే సైంటిస్ట్ దగ్గర ఉండగా.. రెండో భాగం అనీష్ (నాగార్జున) అనే ఆర్టిస్ట్ దగ్గర ఉంటుంది. ఇక మూడో భాగం ఎక్కడుందన్నది మాత్రం ఎవరికీ తెలియదు.బ్రహ్మాస్త్రాన్ని దక్కించుకునేందుకు జునూన్ ముఠా చేసే ప్రయత్నాలకు డీజే శివ (రణ్‌బీర్ కపూర్) అడ్డుతగులుతాడు. అసలు శివ ఎవరు ? అతనికి బ్రహ్మాస్త్రంకు వున్న సంబంధం ఏమిటి ? చివరికి బ్రహ్మాస్త్రం ఎవరికీ దక్కిందనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
సూపర్ పవర్ వెర్సస్ ఈవిల్ పవర్ కథలు దాదాపు ఒకే లైన్ తో వుంటాయి. ప్రపంచాన్ని రక్షించాలనే హీరో, నాశనం చేయలని దుష్టశక్తులు ప్రయత్నం. ‘బ్రహ్మాస్త్రం’ లైన్ కూడా ఇదే. ‘బ్రహ్మాస్త్రం’ భూమికి రావడంతో ఈ కథ మొదలౌతుంది. షారుక్ పాత్ర రూపంలో ఈ కథకు మంచి జోష్ దొరికింది. అయితే ఆ జోష్ ని కొనసాగించలేకపోయాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. కథ నాయకుడు శివ పాత్రని చాలా సింపుల్ గా పరిచయం చేసిన దర్శకుడు అంటే సింపుల్ గా అతని ప్రేమ కథని నడిపిన విధానం కాస్త నిరాశ పరుస్తుంది. అయితే అనీష్ పాత్రలో నాగార్జున పాత్ర పరిచయంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ఈ క్రమంలో వచ్చే ఇంటర్వెల్ బాంగ్ కూడా సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది.
సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఈ కథ మొత్తం ఒక ఆశ్రమంలో జరిగిపోయే ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి సినిమాల్లో ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేయడం చాలా కీలకం. అమితాబ్ పాత్రతో ఒక ఆశ్రమం, అందులో చిత్రమైన పాత్రలని చక్కగానే రాసుకున్నాడు దర్శకుడు. అమితాబ్ ‘బ్రహ్మాస్త్రం’ గురించి చెప్పడం శివ శక్తులని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించడం ఆసక్తికరంగానే వుంటాయి. అయితే సినిమా క్లైమాక్స్ ని కాస్త షార్ప్ గా చేసివుంటే బావుండేది. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ అంతా బావున్నప్పటిటికీ నిడివి ఎక్కువ అనిపిస్తుంది. బిర్యాని బావుందని ఒకేసారి నాలుగు హండీలు తినలేం కదా.. ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా ఓవర్ లోడ్ అనిపిస్తుంది.
నటీనటులు:
శివ పాత్రలో రణ్‌బీర్ కపూర్ కొత్తగా కనిపించాడు. సూపర్ హీరో రోల్ ఇది. అయితే రణ్‌బీర్ మాత్రం తనదైన శైలి చాలా సెటిల్ద్ గా చేశాడు. ఈషా పాత్రలో అలియా ఒదిగిపోయింది. రణ్‌బీర్ - అలియాల కెమిస్ర్టీ బావుంది. షారుఖ్ పాత్ర కథపై చాలా అంచనాలు పెంచింది.
నంది అస్త్రం గా నాగ్ పాత్ర అదరగొట్టింది. అమితాబ్ పాత్ర సెకండ్ హాఫ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మౌనీరాయ్ విలనిజం చక్కగా పలికించింది. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
టెక్నికల్ గా :
నిర్మాణ పరంగా సినిమా ఉన్నతంగా వుంది. విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆకట్టుకుంటాయి. కుంకుమ పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంది. నేపధ్య సంగీతం కూడా గ్రాండ్ గా వుంది. కెమరాపనితనం బ్రిలియంట్ గా వుంది.
దర్శకుడు అయాన్ మంచి లైన్ రాసుకున్నాడు. అయితే ఎమోషన్స్ విషయంలో ఇంకాస్త ద్రుష్టిపెట్టి వుంటే సినిమా ఫలితం మరో స్థాయిలో వుండేది. ఇప్పటికీ నష్టం ఏమీ లేదు. మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ‘బ్రహ్మాస్త్రం’.
ప్లస్ పాయింట్స్
కథా నేపధ్యం
రణ్‌బీర్ కపూర్ , షారుక్, నాగార్జున, అమితాబ్
విజువల్ ఎఫెక్ట్స్
మైనస్ పాయింట్స్
లవ్ ట్రాక్
ఎమోషన్స్ మిస్ కావడం
ఫైనల్ వర్డిక్ట్ : థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే ‘బ్రహ్మాస్త్రం’.