Oke Oka Jeevitham Review: 'ఒకే ఒక జీవితం' రివ్యూ & రేటింగ్!

By iQlikMovies - September 09, 2022 - 09:26 AM IST

మరిన్ని వార్తలు

నటీనటులు: శర్వానంద్, రీతూ వర్మ, అక్కినేని అమల, వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు.
దర్శకత్వం : శ్రీ కార్తీక్
నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు
సంగీత దర్శకుడు: జెక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: సుజీత్ సారంగ్


రేటింగ్: 3/5


అమ్మ కథ ఎప్పుడూ గొప్ప వుంటుంది. ఎన్నిసార్లు చెప్పిన బోర్ కొట్టదు. వెండితెరపై కూడా అమ్మ ఎవర్ గ్రీన్ ఎమోషన్. తెలుగులో అమ్మ కథతో ముగ్గురు మొనగాళ్ళు, బొబ్బిలి రాజా.. లాంటి మాస్ ఎంటర్ టైనర్లు, మాతృదేవోభవ..లాంటి ఫీల్ గుడ్ సినిమాలు అనేకం వున్నాయి. ఇప్పుడు శర్వానంద్ మరో అమ్మ కథతో వచ్చాడు. అదే `ఒకే ఒక జీవితం`. అయితే ఈ సినిమాకి వున్న ప్రత్యేకత ఏమిటంటే..ఈ కథకి టైమ్ మిష‌న్ నేపధ్యం తోడయ్యింది. టైమ్ మిష‌న్ కథలు కూడా మనకి కొత్త కాదు. ఆదిత్య 369 లాంటి క్లాసిక్స్ చూశాం. మరి టైం ట్రావెల్ కి వెళ్లి చెప్పిన ఈ అమ్మ కథ ఎలా వుందో చూద్దాం. 


కథ :


ఆది (శ‌ర్వానంద్‌) మ్యుజీషియ‌న్‌. స్టేజ్ ఫియర్ తో ఇబ్బందిపడుతుంటాడు. స్టేజీ ఎక్కితే కాళ్లు ఒణికి పారిపోతుంటాడు. ఆది అమ్మ (అమ‌ల‌) తన చిన్నప్పుడే చనిపోతుంది. అమ్మ చ‌నిపోయి ఇర‌వై ఏళ్లు అవుతున్నా ఆమె జ్ఞాప‌కాల్లోనే బ‌తుకుతుంటాడు అది. అది స్నేహితుడు శ్రీ‌ను (వెన్నెల కిషోర్‌) ఓ రియ‌ల్ ఎస్టేట్ బ్రోకర్‌. శ్రీ‌నుని అంతా బ్రోక‌ర్ .. బ్రోక‌ర్ అని పిలుస్తుంటారు. చిన్నప్పుడు సరిగ్గా చ‌దువుకుని వుంటే బాగుండేది క‌దా బాధ ప‌డుతుంటాడు.


మరో స్నేహితుడు చైతూ (ప్రియ‌ద‌ర్శి) ది పెళ్లి సమస్య. తనకి ఎవ‌ర్ని చూసినా న‌చ్చరు. చిన్నప్పుడు ఓ అమ్మాయిని రిజెక్ట్ చేస్తాడు. పెద్దయ్యాక అదే అమ్మాయి అందంగా త‌యార‌య్యేస‌రికి.. చిన్నప్పుడే ఎందుకు ఈ అమ్మాయిని ప్రేమించ‌లేదని మదన పడుతుంటాడు. పాల్ (నాజ‌ర్‌) ఓ సెంటిస్ట్. టైమ్ మిష‌న్ క‌నుక్కోవ‌డానికి ఇర‌వై ఏళ్లుగా శ్రమిస్తుంటాడు. ఈ ముగ్గురుని టైం ట్రావెల్ తో గతంలోకి వెళ్ళే ఆఫర్ ని ఇస్తాడు పాల్. మరి ఈ ముగ్గురు గతంలోకి వెళ్లి ఏం చేశారు ? వారికీ ఎదురైన పరిస్థితులు ఏమిటి ? విధిని మార్చుకోగలిగారా ? అనేది మిగతా కథ. 


విశ్లేషణ:


టైం ట్రావెల్ కథలన్నీ విజువల్ గ్రాండీయర్ కి పెద్దపీట వేస్తుంటాయి. తెలియని, ఎప్పుడూ చూడని ప్రపంచాన్ని చూపిస్తుంటాయి. అయితే `ఒకే ఒక జీవితం` కథ కోసం దర్శకుడు శ్రీకార్తిక్ ఇందుకు భిన్నంగా అలోచించాడు. ఓ ముగ్గురు సామాన్యులు తమ గతంలోకి వెళ్లి చేసిన తప్పులని సరిదిద్దుకోవాలని ప్రయతాన్ని చూపించాడు. ప్రతి ఒక్కరి గతం వుంటుంది. అందరూ ఎదో ఒక సమయంలో గతం గురించి రిగ్రేట్ ఫీలౌతారు. '' అప్పుడు అలా చేయాల్సింది కాదు.. ఇలా చేసుంటే ఎంత బావుండేదో'' ఈ ఫీలింగ్ అందరిలోనూ వుంటుంది. ఇది కామన్ ఎమోషన్. సరిగ్గా అవే ఫీలింగ్స్, ఎమోషన్స్ ని పట్టుకున్నాడు దర్శకుడు. అందరికీ కనెక్ట్ అయ్యేలా `ఒకే ఒక జీవితం` ని ప్రజంట్ చేశాడు.


కథని చాలా ఆసక్తికరంగా మొదలుపెట్టాడు దర్శకుడు. తొలి నాలుగు సన్నివేశాలకే దర్శకుడు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ముగ్గురి కథలని ఎమోషనల్ గా చాలా బ్యాలెన్స్ చేస్తూ నడిపాడు. తల్లి జ్ఞాపకాలలో ఆది పాత్ర ఎమోషనల్ హై ఇస్తుంటే వెన్నెల కిషోర్, ప్రియదర్శి పాత్రల రూపంలో కథకు కావాల్సిన వినోదం పంచాడు.


ఈ క్రమంలో మొదటిసగం చాలా సాఫీగా సాగిపోతుంది. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. ఇలాంటి కథలకు రెండో సగం చాలా కీలకం. గతం, వర్తమానంలోకి కథ నడుస్తున్నపుడు సీన్స్ రిపీట్ గా అనిపించే అవకాశం వుంది.`ఒకే ఒక జీవితం`కి కూడా ఆ సమస్య రెండో సగంలో కొంతవరకూ వచ్చింది. అయితే అది మరీ కంప్లయింట్ చేసేలా వుండదు. ఇలాంటి కథలు లాజిక్ కి కొంత దూరంలోనే వుంటాయి. ఐతే లాజిక్స్ ని వెతుక్కునే అవకాశం ఇవ్వకుండా కథని ఎమోషన్స్ తో నడిపిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ కథతో దర్శకుడు ఇచ్చిన సందేశం కూడా స్ఫూర్తిదాయకంగా వుంటుంది. 


నటీనటులు :


శ‌ర్వా బలం నటన. అందుకే బలమైన కథలవైపే మొగ్గుచూపుతుంటాడు. ఈ సినిమా కూడా శర్వానంద్ లోని నటుడ్ని మరో స్థాయిలో నిలబెట్టింది. ఎమోషన్స్ సీన్స్ లో శర్వా నటన కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తాయి. వెన్నెల కిషోర్ పాత్రని చక్కగా డిజైన్ చేశాడు దర్శకుడు. ఆ పాత్రలో కిషోర్ మంచి వినోదం పంచాడు. ఎమోష‌న‌ల్ యాంగిల్ కూడా వుండటం కిషోర్ కి కొత్త టచ్ ఇచ్చింది.


ప్రియ‌ద‌ర్శి పాత్ర కూడా మెప్పిస్తుంది. అమల పాత్ర ఈ సినిమాకి మరో ప్రధాన బలం. అమ్మ పాత్రని ఎంత గొప్పగా చేయాలో అంత హుందాగా చేసింది. రీతు వర్మ చాలా నేచురల్ గా కనిపించింది. నాజ‌ర్‌కి అలవాటైన పాత్రే. చిన్న పిల్లలు కూడా చక్కగా నటించారు. మిగతా నటీనటులు పరిధిమేర చేశారు. 


టెక్నికల్ :


సుజిత్ సారంగ్ కెమరాపనితనం డీసెంట్ గా వుంది. జేక్స్ బిజోయ్ నేపధ్య సంగీతం బావుంది కానీ మళ్ళీ మళ్ళీ వినాలనుకునే పాటలైతే లేవు.


తరుణ్ భాస్కర్ డైలాగ్స్ సహజంగా వున్నాయి. గతంలోకి వెళ్లినపుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ మరింత సహజంగా పని చేయాల్సింది.  డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సినిమాకి కావాల్సింది సమకూర్చారు. 


ప్లస్ పాయింట్స్ 


కథ, కథనం 
శర్వానంద్, వెన్నెల కిషోర్ 
మదర్ సెంటిమెంట్ 


మైనస్ పాయింట్స్ 


సెకండ్ హాఫ్ వేగం తగ్గడం 
కొన్ని లాజిక్స్ మిస్ కావడం


ఫైనల్ వర్డిక్ట్ : మనసుని హత్తుకునే జీవితం. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS