'చెక్ పోస్ట్ 1995' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: మాస్టర్ మహేంద్రన్, షజ్ఞా, కాలకేయ ప్రభాకర్, దొర బాబు, రవి తదితరులు 
దర్శకత్వం : రవి కిషోర్
నిర్మాతలు: కోటేశ్వర్ రావు గూడేల, పీవీ చంద్రశేఖర్
సంగీత దర్శకుడు: వినోద్ యాజమాన్య
సినిమాటోగ్రఫీ: శివ కుమార్ దేవరకొండ


రేటింగ్: 3/5


ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రేక్షకులు డిఫరెంట్ కంటెంట్ ని చూడటానికి ఇష్టపడుతున్నారు. అటు ఫిల్మ్ మేకర్స్ కూడా ఒరిజినల్ కంటెంట్ పై ద్రుష్టి పెట్టారు. ఈ క్రమంలో కొన్ని వైవిధ్యమైన కథలు, సంఘటనలు ఆధారంగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తాజాగా చెక్ పోస్ట్ 1995 మూవీ ఐఓటిటి వేదికగా విడుదలైయింది. మాస్టర్ మహేంద్రన్, శాజ్ఞశ్రీ, కాళికేయ ప్రభాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రవి కిషోర్ చందిన దర్శకత్వం వహించారు. రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం రివ్యూలోకి వెళితే.. 


కథ:


రాజు (మహేంద్రన్) అడవికి దగ్గరగా మారుమూల గ్రామం అనంతగిరిలో జీపు నడుపుకొని జీవనం సాగిస్తుంటాడు. తన ఊర్లోనే దీప(శాజ్ఞశ్రీ)ని ప్రేమిస్తాడు. రాజు తండ్రి నక్సలైట్. పసి వయసులో తన కళ్ళముందే పోలీసులు కాల్పుల్లో తండ్రిని కోల్పోతాడు రాజు. తన తండ్రిని కాల్చిచంపిన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ (కాళికేయ ప్రభాకర్) పై పగ పెంచుకుంటాడు రాజు. కొనేళ్ళు గడిచిన తర్వాత ఎంకౌంట్ స్పెషలిస్ట్ ప్రభాకర్ అనంతగిరి దగ్గర కొత్తగా ఏర్పాటైన చెక్ పోస్ట్ కి ఆఫీసర్ గా వస్తాడు. ప్రభాకర్ ని చూసి రాజు పగతో రగిలిపోతాడు. 

 

ఇదే సమయంలో నక్సలైట్ గా పోలీసులకు పట్టుబడి పదేళ్ళ శిక్ష అనుభవించిన జైలు నుండి విడుదలౌతాడు అంజయ్య (పలాస ఉమాఉమామహేశ్వర్ ). ప్రభాకర్ కారణంగానే అంజయ్య శిక్ష అనుభవించాల్సి వస్తుంది. జైలు నుండి వచ్చిన అంజయ్యని కలుస్తాడు రాజు. ఇద్దరూ కలసి ప్రభాకర్ ని చంపాలని నిర్ణయించుకుంటారు. తర్వాత ఏం జరిగింది ? రాజు పగ తీరిందా? ప్రభాకర్ ని చంపగలిగారా? తన తండ్రి చావు గురించి రాజు తెలుసుకున్న నిజాలు ఏంటి ? అసలు ఈ కథకు అనంతగురి చెక్ పోస్ట్ కి లింక్ ఏమిటి? అనేది మిగతా కథ. 


విశ్లేషణ:


ఓటీటీ సినిమా అంటేనే వైవిధ్యం. నాలుగు పాటలు నాలుగు ఫైట్లు లెక్కలు ఇక్కడ అనవసరం. మంచి కథని చూపించడమే ఓటీటీ సక్సెస్ మంత్రం. ఇలా చూసుకుంటే చెక్ పోస్ట్ ఫస్ట్ క్లాస్ లో పాసైపోతుంది. కథ పరంగా చూసుకుంటే చాలా ఒరిజినల్ కథ. దర్శకుడు ఎత్తుకున్న పాయింట్ లో ఒరిజినాలిటీ వుంది. నక్సల్ నేపధ్యం కథని ప్రారంభించి కథకు ఒక సీరియస్ మూడ్ ని క్రియేట్ చేయగలిగారు.


తర్వాత రాజు, దీపల మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా ఫ్రెష్ గా వుంటుంది. చెక్ పోస్ట్ దగ్గర టీ కొట్టు దాని చుట్టూ అల్లుకున్న కొన్ని కామెడీ సీన్లు కూడా వర్క్ అవుట్ అయ్యాయి. వేశ్య పాత్ర ప్రవేశం మొదట్లో అనవసరం అనిపిస్తుంది. ఐతే ఆ పాత్ర కథతో చాలా తెలివిగా ముడిపెట్టాడు దర్శకుడు. అంజయ్య జైలు నుండి విడుదలైన తర్వాత కథ జోష్ అందుకుంటుంది. పతాక సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా వుంటాయి. చివర్లో వచ్చే ట్విస్ట్ తో కథకు మంచి ముగింపు దొరికినట్లయింది. 


నటీనటులు :


రాజు పాత్రలో చేసిన మహేంద్రన్ చక్కగా నటించాడు. ఎమోషనల్ సీన్స్ చక్కగా పండించాడు. శాజ్ఞశ్రీ సహజంగా కనిపించింది. కాలకేయ ప్రభాకర్ కి కథలో కీలకమైన పాత్ర దక్కింది.


అంజయ్య పాత్రలో పలాస ఉమాఉమామహేశ్వర్ మరోసారి ఆకట్టుకున్నాడు. దొరబాబు సీన్లు నవ్విస్తాయి. మిగతా నటులు పరిధిమేర చేశారు 


టెక్నికల్ :


పరిమిత బడ్జెట్ తో తీసిన సినిమా ఇది. అది స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. దర్శకుడు తనకుఉన్నంతలో కథని చక్కగా ప్రజంట్ చేశాడు. కథ అడవి, చెక్ పోస్ట్ ప్రాంతంలో వుండటం వలన 95 నేపధ్యాన్ని తనకున్న వనరులతోనే సృష్టించాడు.


సెన్సార్ చేయాల్సిన డైలాగ్స్ కొన్ని వున్నాయి. ఐతే ఓటీటీ కావడంతో ఆ అభ్యంతరం లేదు. పాల పిట్ట పాట చిత్రీకరణ బావుంది. నిడివి తక్కువ వుండటం కూడా ఒక ప్లస్ పాయింట్. నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. 


ప్లస్ పాయింట్స్ 


కథ 
పాల పిట్ట సాంగ్
క్లైమాక్స్ 


మైనస్ పాయింట్స్ 


నిర్మాణ విలువలు 
కొన్ని సెన్సార్ డైలాగ్స్ 


ఫైనల్ వర్డిక్ట్ : చెక్ పోస్ట్ .. పాసైపోయింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS