అల్లరి నరేష్...అంటే కామెడీ పాత్రలే గుర్తుకువస్తాయి. అయితే ఆ ముద్ర చెరిపేసుకోవడానికి ముందు నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నేను, గమ్యం, శంభో శివ శంభో లాంటి చిత్రాలతో వైరెటీగా కనిపించడానికి ట్రై చేశాడు. ముఖ్యంగా గాలిశీను పాత్ర తనలోని కొత్త నటుడ్ని పరిచయం చేసింది. అయితే విజయాలు మాత్రం కామెడీ కథలే కట్టబెట్టాయి. `నాంది`తో తనని తాను పూర్తిగా మార్చుకొన్నాడు నరేష్. ఆ సినిమాతో మంచి విజయాన్నీ అందుకొన్నాడు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు `ఉగ్రం` చేస్తున్నాడు.
నరేష్ నటిస్తున్న కొత్త సినిమా ఇది. `నాంది` దర్శకుడు విజయ్ కనకమేడలతో రెండో సినిమా. ఇది కూడా వెరైటీ కథే. ఈరోజే ఫస్ట్ లుక్ ని సైతం విడుదల చేశారు. ఒంటినిండా రక్తంతో ఉగ్రనాదం చేస్తున్న నరేష్ లుక్‌ని ఫస్ట్ లుక్ పోస్టర్ గా విడుదల చేశారు.
ఆల్మోస్ట్.. నాంది టీమే ఈ సినిమాకీ పని చేస్తోంది. సోమవారం చిత్రీకరణ మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలెట్టేస్తారు. ఇదో.. థ్రిల్లర్ కథాంశమని చిత్రబృందం చెబుతోంది. మరి ఈసారి.. నరేష్ ఏ స్థాయిలో మాయ చేస్తాడో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.