చిత్రం: డెవిల్
నటీనటులు: కల్యాణ్ రామ్, సంయుక్త మీనన్, మాళవిక నాయర్
దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాత: అభిషేక్ నామా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
ఛాయాగ్రహణం: సౌందర్‌రాజన్
కూర్పు: తమ్మిరాజు
బ్యానర్స్: అభిషేక్ పిక్చర్స్
విడుదల తేదీ: 29 డిసెంబర్ 2023
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.75/5
ఈ ఏడాది లాస్ట్ పంచ్ ఇచ్చే అవకాశం కళ్యాణ్ రామ్ కి వచ్చింది. స్పై థ్రిల్లర్ గా ‘డెవిల్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కళ్యాణ్ రామ్. 2023 చివరి శుక్రవారం బాక్సాఫీసు ముందుకు వచ్చిన మీడియం రేంజ్ సినిమా ఇదే. ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని రేపింది. మరి డెవిల్ ప్రేక్షకులని అలరించిందా ? ఈ బ్రిటిష్ ఏజెంట్ కథలో థ్రిల్స్ ఏమిటి ?
కథ: ఆది బ్రటిష్ హయంలో వున్న భారతదేశం. నేతాజీని పట్టుకోవాలనే ప్రయత్నంలో ఉంటుంది నాటి బ్రిటిష్ సర్కార్. నేతాజీ రాక ని సీక్రెట్ ఏజెంట్స్ ద్వారా తెలుసుకుంటుంది. ఐతే సరిగ్గా ఇదే సమయానికి రాసపాడు జమిందార్ ఇంట్లో ఓ హత్య జరుగుతుంది. జమిందార్ కూతురు విజయని ఎవరో హత్య చేస్తారు. ఈ కేసుని ఛేదించడానికి సీక్రెట్ ఏజెంట్ డెవిల్ ( కళ్యాణ్ రామ్ )ని పంపుతుంది బ్రిటిష్ సర్కార్. అసలు డెవిల్ కి, నేతాజీకి, విజయ హత్యకు, ఈ కథలో మరో కీలక పాత్రధారి అయిన త్రివర్ణ కు మధ్య వున్న లింక్ ఏమిటి అనేది తెరపై చూడాలి.
విశ్లేషణ: ఓ హత్య చుట్టూ సాగే నేరపరిశోధనతో డెవిల్ కథ మొదలవుతుంది. అంతకుముందు నేతాజీ నేపధ్యం వస్తుంది. హత్య కేసులో డెవిల్ రంగంలోకి దిగాక కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వస్తాయి. అయితే పూర్తిగా థ్రిల్లర్ గా సాగాల్సిన ఈ కథలో పాటలు, ప్రేమ కోణం కాస్త ఇబ్బంది పెడతాయి. విరామానికి ముందు వచ్చే సన్నివేశాల మళ్ళీ కథపై ఆసక్తిని పెంచుతాయి. ఇంటర్వల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకునేలా తీశారు.
ద్వితీయార్ధంలో ‘కోడ్’ చుట్టూ నడిచే సన్నివేశాలు గందరగోళంగా వుంటాయి. నిజానికి అందులో నుంచి మంచి డ్రామా క్రియేట్ కావాలి. కానీ అది జరగదు. ఈ కథలో దేశభక్తి కోణం కూడా పెద్ద ప్రభావాన్ని చూపదు. సెకండ్ హాఫ్ చాలా వరకూ ‘త్రివర్ణ’ ఎవరనే అంశంపై నడుస్తుంది. అయితే ఈ సుస్పెన్స్ అంతగా ఆకట్టుకోదు. ప్రేక్షకులకు ఆ పాత్రపై ముందే ఒక అంచనా వుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రంఆ జోనర్ ని ఇష్టపడే ప్రేక్షకులకు అలరించేలా వుంటాయి.
నటీనటులు: కల్యాణ్‌రామ్ డెవిల్ లుక్ లో అలరిస్తాడు. ఆయన నటన, డైలాగ్ చెప్పే విధానం ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల బింబిసార ని కూడా గుర్తుకు తెస్తాయి. సంయుక్త మీనన్ పాత్ర కీలకమైనదే. ఐతే ఆ పాత్రకు ప్రేమ కోణం జోడించడం కుదరలేదు. మాళవిక నాయర్ పాత్రలో దేశభక్తి కనిపిస్తుంది. అజయ్, శ్రీకాంత్ అయ్యంగార్ , సత్య, వశిష్ట సింహా, షఫి, మహేశ్ తదితరులు పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
టెక్నికల్: సాంకేతికంగా సినిమా బావుంది. పాటలు కుదరలేదు కానీ నేపథ్య సంగీతం బావుంది. కెమెరా పనితనం నీట్ గా వుంది. పీరియాడిక్ మూడ్ ని బాగానే క్రియేట్ చేశారు. ఆర్ట్ విభాగానికి కూడా మంచి మార్కులు పడతాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.
ప్లస్ పాయింట్స్
కళ్యాణ్ రామ్
కథా నేపథ్యం
నిర్మాణ విలువ విలువలు
మైనస్ పాయింట్స్
బలహీనమైన కథనం
ప్రేమ కథ, పాటలు
ఫైనల్ వర్దిక్ట్ : అక్కడక్కడ థ్రిల్ ఇచ్చే డెవిల్..