నటీనటులు: సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, వినయ్, సూరి, సత్యరాజ్తదితరులు
దర్శకత్వం : పాండిరాజ్
నిర్మాత: కళానిధి మారన్
సంగీత దర్శకుడు: ఇమన్
సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు
ఎడిటర్ : రూబెన్
రేటింగ్:2/5
సూర్య అందరికీ నచ్చే నటుడు. సూర్య సినిమా అంటే బావుంటుందనే నమ్మకం. అందుకే సూర్య సినిమా అంటే తెలుగులోనూ ఆసక్తి. ఆయన ప్రతి సినిమా తెలుగు డబ్ అవుతుంటుంది. ఇటివలే ‘జై భీమ్’తో తనలోని విలక్షణతని మరోసారి చూపించారు సూర్య. ఈ సినిమా ఓటీటీకి వెళ్ళింది కానీ థియేటర్ లోకి వచ్చుంటే మరింత విజయం సాధించేది. అయితే ఇప్పుడు ఆయన నుంచి నేరుగా థియేటర్ లోకి ఓ సినిమా వచ్చింది. అదే ‘ఈటీ’. జై భీమ్ లాంటి కల్ట్ క్లాసిక్ తర్వాత సూర్య నుంచి వస్తున్న ఈ సినిమా కావడంతో అందరికీ ఓ ఆసక్తి నెలకొంది. మరి ఈటీలో ఏముందో తెలుసుకోవడానికి రివ్యూ లోకి వెళ్దాం .
కథ :
కృష్ణ మోహన్ (సూర్య ) ఓ లాయర్. అతనికి ఒక విషాదమైన గతం వుంటుంది. చిన్నప్పుడే చెల్లిని పోగొట్టుకుంటాడు. తన ఊర్లో ప్రతి ఆడపిల్లని తన సొంత చెల్లిగా భావించి వారి బాగోగులు చూసుకుంటూ ఊర్లో కుటుంబంతో సరదాగా గడిపేస్తుంటాడు. కృష్ణ మోహన్ కి తన పొరుగు ఊరుతో ఒక సమస్య వుంటుంది. అయితే ఆ ఊరికి చెందిన ప్రియాంకని చూసి ఇష్టపడతాడు. అంతా సజావుగా సాగుతుందనే సమయానికి తన గ్రామంలో కొందరు అమ్మాయిలు దారుణంగా చనిపోతారు.
ఈ సంఘటనతో కృష్ణ మోహన్ జీవితం ఒక్కసారిగా తలకిందులైపోతుంది. అసలు అమ్మాయిలు చనిపోవడానికి కారణం ఏంటి ? హత్యలా ? ఆత్మ హత్యలా ? ఆ చావులు వెనుక వున్నది ఎవరు? ఈ కేసు పరిశోధనలో ఎలాంటి నిజాలు వెలుగు చుశాయనేది మిగతా కథ ?
విశ్లేషణ :
జై భీమ్ లో సూర్య చేసిన లాయర్ పాత్ర అతని కెరీర్ లోనే ది బెస్ట్. సూర్యని ఒకేసారి పది మెట్లు ఎక్కించిన పాత్ర అది. అయితే సూర్య ఈటీ కోసం మళ్ళీ లాయర్ పాత్రని ఎంచుకున్నాడు. అయితే ఈ లాయర్ మాత్రం చాలా రొటీన్ గా వున్నాడు. కథ వినడానికి కాస్త ఇంట్రస్టింగా వున్నా తెరపై చూడడానికి మాత్రం రొటీన్ గా వుండే సినిమా ఈటీ.
సినిమా మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే.. మొదటి సగం సీరియల్ ట్రీట్మెంట్ తో నడిపి, తర్వాత సగం జై భీమ్ కి యాక్షన్ జోడించినట్లుగా అనిపిస్తుంది. అయితే జై భీమ్ సహజమైన లాయర్ కనిపిస్తే ఇందులో మాత్రం ఒక మకర్శియల్ సినిమా లాయర్ లా బుద్ధి బలం కాకుండా భుజ బలంతో ఫైట్లు చేసి దోషులని పట్టుకునే లాయర్ గా కనిపిస్తాడు.
ఈటీ లో రెండు టోన్లు వున్నాయి. మొదటి సగానికి రెండో సగానికి అస్సల్ పోలిక వుండదు. మొదటి బాగం అంతా విలేజ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించిన దర్శకుడు ఎప్పుడైతే కథలో క్రైమ్ కోణం తెరపై వస్తుందో అప్పుడు ట్రీట్మెంట్ అంతా క్రైమ్ జోనర్ లోకి వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ కి ముందు ఇది క్రైమ్ థ్రిల్లర్ అని ఆడియన్స్ ప్రిపేర్ చేసిన దర్శకుడు .. రెండో సగంపై ఆసక్తిని పెంచడంలో సక్సెస్ అయ్యాడు. అయితే ఇంటర్వెల్ తర్వాత సినిమా మళ్ళీ రొటీన్ ఫార్ముల లోకి వెళ్ళిపోతుంది.
మహిళలు గురించి దర్శకుడు ఇచ్చిన మెసేజ్ బావున్నప్పటికీ కొన్ని ఎలిమెంట్స్ ఓవర్ గా అనిపిస్తాయి. క్రైమ్ థ్రిల్లర్స్ లో విచారణ ఎలా జరిగిందనేది కీలకం. ఈ విషయంలో దర్శకుడు కొంచెం కొత్త అలోచించుంటే బావుండేది . కానీ రొటీన్ గానే వెళ్ళిపోయాడు. పైగా క్లైమాక్స్ లో చూపించిన కొన్ని ఎలిమెంట్స్ కొంచెం అతిగా వుంటాయి. ఈ క్రమంలో సాగదీత కూడా ఎక్కువైయింది. దర్శకుడు చెప్పదలచుకున్న పాయింట్ లో సీరియస్ నెస్ వుంది కానీ దాన్ని కొత్తగా చూపించడంలో కొంత నిరాశ ఎదురౌతుంది.
నటీనటులు :
సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే జై భీమ్ తర్వాత మళ్ళీ ఓ లాయర్ పాత్ర చేసినప్పుడు కొత్తదనం విషయంలో సూర్య కాస్త చెక్ చేసుకోవాల్సింది. యాక్షన్ ఓకే కానీ లాయర్ పాత్ర అంటే ముందు తెలివి చూపించాలి. కానీ ఈటీలో మాత్రం బలం చూపించడానికే ప్రాముఖ్యత ఇచ్చారు. అయితే ఎమోషనల్ సీన్స్ లో సూర్య తన మార్క్ చూపించాడు ప్రియాంక అరుల్ స్క్రీన్ ప్రెజన్స్ బావుంది. వినయ్ రాయ్ తన పాత్రని సమర్దవంతంగా చేశాడు. సత్యరాజ్, శరణ్య, దేవదర్శిని తదితరులు పరిధిమేర చేశారు.
టెక్నికల్ గా : డి ఇమ్మాన్ సంగీతం ఓకే . నేపధ్య సంగీతం కొన్ని చోట్ల బావుంది. రత్నవేలు కెమరా పనితనం సినిమాకి ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ ఇంకా శార్ఫ్ ఉండాల్సింది.
ప్లస్ పాయింట్స్
సూర్య
సెకెండ్ హాఫ్
సందేశం
మైనస్ పాయింట్స్
సాగదీతగ సాగిన ఫస్ట్ హాఫ్
రొటీన్, సాగాదీత క్లైమాక్స్
ఫైనల్ వర్దిక్ట్ : 'రొటీన్' ఎంటర్‌టైన్మెంట