నటీనటులు: వరుణ్‌తేజ్.. సాయిపల్లవి.. రాజా.. సాయిచంద్.. శరణ్య ప్రదీప్.. గీతా భాస్కర్.. హర్షవర్దన్ రాణే.. నాథన్ స్మేల్స్ తదితరులు.
ఛాయాగ్రహణం: విజయ్ సి.కుమార్
కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్
సంగీతం: శక్తికాంత్
నిర్మాణం: దిల్‌రాజు, శిరీష్
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
సంస్థ: శ‌్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
యావరేజ్ యూజర్ రేటింగ్: 3.5/5
కథ:
అన్నయ్య పెళ్లి కోసం అమెరికా నుండి ఇండియా కి వస్తాడు వరుణ్ (వరుణ్ తేజ్). అక్కడ భానుమతి (సాయి పల్లవి) ని చూసి ప్రేమలో పడిపోతాడు వరుణ్. సరదాగా కొన్ని రోజులు కలిసి తిరిగినా ప్రేమ గురించి టాపిక్ తీసుకొని రారు. పెళ్ళి తర్వాత తిరిగి అమెరికా వెళ్లి వరుణ్ అక్కడ నుండి మళ్ళి భాను కి ప్రేమ వ్యక్తపరుస్తాడు. కాని ఉన్న ప్రేమ ను దాచుకొని భాను వరుణ్ ప్రేమ ని తిరస్కరిస్తుంది. భానుమతి అలా చేయడానికి గల కారణం ఏంటి? చివరగా ఏమవుతుంది అనేది ఫిదా కథ.
నటీనటుల పనితనం:
తెలుగు సినిమా పరిశ్రమ కు దొరికిన మరో అద్బుత నటి సాయి పల్లవి. అలరెడి తనకంటూ ఉన్న ఒక పాపులారిటీ ని కంటిన్యు చేస్తూ భానుమతి పాత్ర లో చక్కగా ఒదిగిపోయింది పల్లవి. ఈ కథ కి సంబంధించి తన పాత్ర చాలా ప్రత్యేకమైనది. సినిమా మొత్తం తన భుజాల పై వేసుకొని నడిపించింది పల్లవి. ఈ మధ్య కాలం లో స్ట్రాంగ్ ఫీమేల్ రోల్ మనం చూసి ఉండము కానీ పల్లవి ఈ చిత్రం లో వేసిన పాత్ర దానికి మినహాయింపు. ఈ చిత్రం ద్వారా వరుణ్ కూడా మంచి నటుడు అనిపించే ప్రయత్నం చేసాడు. వరుణ్ కూడా తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. స్లో గా తన కెరీర్ లో ఒక్కో పాత్ర తో ఎదుగుతూ కొంత ప్రామిస్ చూపిస్తున్నాడు వరుణ్. చిత్రం మొత్తం వీళ్ళ ఇద్దరి మధ్య నడుమనే జరుగుతుండడం వల్ల పెద్దగా మిగిలిన నటులు కనిపించి వెళ్లిపోతుంటారు. అందరు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
సమీక్ష:
ఈ చిత్రం లో అందమైన మూమెంట్స్ చాలా ఉన్నాయి. అన్ని ఎమోషన్స్ చక్కగా కుదరడం, ఒక చక్కని కథాంశం తో శేఖర్ మన దగరకి రావడం తో ఫిదా అయిపోవాల్సిందే. ఈ చిత్రానికి కొంత ఫ్రెష్ రోమాన్స్ యాడ్ అవడం వల్ల సినిమా లుక్ అంతా మారిపోయింది అని చెప్పచ్చు. అందరూ నటులు చక్కని నటన కనబరిచారు. సినిమా మొదటి భాగం చాలా బాగా వచ్చినా, రెండో భాగం కాస్త స్లో గా అనిపించొచ్చు. రోమాన్స్ కూడా పూర్తిగా బిల్డ్ అవకపోవడం కొంత ఆసక్తి రేపని అంశం. ఈ సినిమా పేస్ కాస్త అటు ఇటు గా నడుస్తుంది. చిత్రానికి సంబందించిన ముగింపు కూడా చాలా హడావుడిగా అయిపోయింది అనే అభిప్రాయం తీసుకొని రావచ్చు. ఈ చిత్ర కథ అంతా మనకు ఊహకు అందడం ఒక నిరాశ కల్పించే అంశం.
ఈ చిత్రం లో సింహ భాగం ప్రేమ మీదనే సాగుతుంది. ప్రేమ కథ ను చక్కగా తీర్చిదిద్దాడు శేఖర్ కమ్ముల. సినిమా లో అంతా సింక్ అయి పని చేయడం వలన అవుట్ పుట్ చాలా బాగా రావడానికి ఉపయోగపడింది. విక్రం కెమెరా పనితనం చాలా చక్కగా కుదిరింది. విలేజ్ వాతావరణం చక్కగా సృష్టించారు నిర్మాతలు. సినిమా ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ కూడా ఎమోషన్స్ ఫ్లో ని పర్ఫెక్ట్ గా సింక్ చేసే ప్రయత్నం చేసాడు. శక్తి కాంత్ అందించిన సంగీతం కూడా ఈ చిత్రానికి చక్కగా కుదిరింది. సినిమా అంతా అన్ని పాటలు చక్కగా రావడానికి బాగా ఉపయోగ పడింది. చిత్రానికి నేపథ్య సంగీతం కూడా చాలా బాగా జరిగింది. సినిమా కి ఆ నేపథ్య సంగీతం ప్రాణం అనేలా వర్క్ చేసారు సంగీత దర్శకులు.
శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి రైటర్ గా దర్శకుడు గా మంచి మార్కులు కొట్టేసాడు. ఆయన మార్క్ చూపిస్తూ ఆయన సినిమాలను మనం మిస్ అవుతున్నాం అనే అపవాద ని తొలగిస్తూ ఆయన సినిమా ని తిరిగి పరిచయం చేసాడు. ఆయన స్త్రెంత్ కథ. ఈ చిత్రం తో కూడా కథ ను బాగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేసాడు దర్శకుడు. అక్కడక్కడా మామూలుగా అనిపించినా, సినిమా మొత్తం మంచి ఎమోషన్స్ ని మైంటైన్ చేస్తూ కథ ని నడిపించారు. నటీ నటుల ప్రతిభ, చక్కని కథ, మంచి దర్సకత్వం అన్ని కలిపి సినిమా ని ఇంటరెస్టింగ్ గా తీర్చిదిద్దారు దర్శకుడు.
ప్లస్:
+ సాయి పల్లవి
+ నటీనటుల పనితనం
+ సంగీతం, నేపథ్య సంగీతం
+ కథ
మైనస్:
- అన్ని వర్గాలను అలరించకపోవచ్చు
ఆఖరి మాట:
ఈ ఫిదా కి మనం ఫిదా
రివ్యూ బై రామ్