ఒకప్పుడు సినిమా పైరసీ అంటే CDల రూపంలో జరిగేది, ఆ తరువాత టెక్నాలజీ లో వచ్చిన మార్పుల కారణంగా పైరసీ కూడా రూపాంతరాలు చెందుతూ వస్తున్నది.
తాజాగా ఈ ట్రెండ్ ఏకంగా సినిమాని ఫేస్ బుక్ లో లైవ్ పెట్టె వరకు వచ్చేసింది. ఈ మధ్యనే జరిగిన ఒక ఇన్సిడెంట్ దీనికి ఉదాహరణ. సందీప్, ఆది, నారా రోహిత్, సుధీర్ బాబు లు కలిసి నటించిన చిత్రం శమంతకమణి చిత్రాన్ని కొంతమంది ఏకంగా ధియేటర్ నుండే ఫేస్ బుక్ లైవ్ లో సినిమాని పెట్టేసారు.
దీనిని సోషల్ మీడియాలో చూసిన హీరో సందీప్ కిషన్ ఒకింత అసహనానికి గురయ్యాడు. తాము ఎంతో కష్టపడి సమయం, డబ్బు వెచ్చించి సినిమాని తీస్తే, ఇలాంటి పైరసీ పద్దతుల ద్వారా తమని నష్టానికి గురిచేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
పైరసీ లో రోజురోజుకి అప్డేట్ అవుతున్నవారిని పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ వారు కూడా అప్డేట్ అవ్వాల్సిన అవసరం కనపడుతుంది.