Gargi Review: 'గార్గి' మూవీ రివ్యూ& రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: సాయి పల్లవి, కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి, ఆర్ ఎస్ శివాజీ తదితరులు.
దర్శకత్వం : గౌతం రామచంద్రన్
నిర్మాతలు: రవిచంద్రన్ రామచంద్రన్, థామస్ జార్జ్, ఐశ్వర్య లక్ష్మి వి, గౌతం రామచంద్రన్
సంగీత దర్శకుడు: గోవింద్ వసంత
సినిమాటోగ్రఫీ: శ్రేయంతి & ప్రేమకృష్ణ అక్కతు
ఎడిటర్: షఫీక్ మహమ్మద్ అలీ

 

రేటింగ్ : 3/5


సాయి పల్లవి నుండి సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో ఒక ఆసక్తి వుంటుంది. దీనికి కారణం కెరీర్ బిగినింగ్ నుండి ఆమె ఎంచుకుంటున్న కథలు. సహజమైన నటన.. అంతే నేచురల్ గా వుండే పాత్రలు ఎంచుకుంటూ తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. ఇటీవల విరాటపర్వం లో వెన్నెల పాత్రలో ఆకట్టుకున్న సాయి పల్లవి ఇప్పుడు గార్గి గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక్కసారి గార్గి కథలోకి వెళితే..


కథ :


గార్గి (సాయి పల్లవి) ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్. గార్గి కి పెళ్లి కూడా కుదురుతుంది. గార్గి తండ్రి బ్రహ్మ్మనందం (శివ బాలాజీ ) ఒక అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తుంటాడు. ఒక రోజు ఆ బిల్డింగ్ లో ఒక బాలిక పై అత్యాచారం జరుగుతుంది. ఆ కేసులో గార్గి తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. దింతో ఒక్కసారిగా గార్గి జీవితం తలకిందులు అయిపోతుంది. అమాయకుడైన తన తండ్రిని నిర్దోషి గా బయటికి తీసుకురావడానికి గార్గి కోర్ట్ ని ఆశ్రయిస్తుంది. తర్వాత ఎం జరిగింది ..? గార్గి కి ఈ పోరాటం లో గెలిచిందా ? బాలిక పై అత్యాచారం చేసింది ఎవరు ? కోర్టులో గార్గికి ఎలాంటి సవాళ్లు ఎదురుకుంది? అనేది మిగతా కథ.


విశ్లేషణ:


సినిమా అంటే బోలెడు లెక్కలు. ఇలాంటి కథ ఆడుతుందా ? మాస్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ? కమర్షియల్ అంశాలు తూకం సరిపోయిందా ? ఇలా అనేక లెక్కలు వేసుకుంటారు కొందరు దర్శక నిర్మాతలు. అయితే నిజాయితీగల సినిమాలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. ఎలాంటి లెక్కలు లేకుండా ఒక కథని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. అలాంటి నిజాయితీ గల చిత్రమే గార్గి. దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ ఈ చిత్రం కోసం ఒక నిజాయితీ గల పాయింట్ ని అంతే నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇది వరకు బాలిక అత్యాచారాలపై చాలా కథలు వచ్చాయి. అయితే గార్గి లో దర్శకుడు డీల్ చేసిన పాయింట్ చాలా హార్ట్ టచ్చింగ్ గా అలోచించ చేసిదిగా వుంటుంది.  


ఎలాంటి కాలయాపన లేకుండా నేరుగా కథలోకి తీసుకెళ్ళిపోయాడు దర్శకుడు. గార్గి పాత్ర పరిచయం, ఓ మైన‌ర్ బాలిక‌పై అత్యాచార ఘ‌ట‌న వార్త, అదే నైటు గార్గి తండ్రి ఆ కేసులో ఓ నిందితుడిగా అరెస్టు కావడంతో కథ మెయిన్ ట్రాక్ లోకి వచ్చేస్తుంది. ఇలాంటి కేసుల్లో బాధితులు కాదు.,. నిందితుల కుటుంబ సభ్యులు సమాజం నుంచి ఎలాంటి వివక్ష ఎదుర్కొంటారనేది కళ్ళకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు.


ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా వుంటాయి. అయితే ఏ కథకైనా ఎత్తుపల్లాలు వుంటాయి. గార్గి కోర్టు రూమ్ డ్రామా గా మరీనా తర్వాత సన్నివేశాలు కాస్త సాగాదీతగా అనిపిస్తాయి. ఐతే జడ్జిగా ట్రాన్స్‌జెండర్‌ని తీసుకోవడం దర్శకుడి ధైర్యానికి నిదర్శనంగా నిలిచింది. జడ్జ్ ‘ఆడవాళ్లకు నొప్పి ఎక్కడ ఉంటుందో.. మగాళ్లకు ఎక్కడ పొగరు ఉంటుందో నాకే బాగా తెలుసు’ అని చెప్పిన మాటలు చప్పట్లు కొట్టిస్తాయి. దర్శకుడు క్లైమాక్స్ రాసుకున్న విధానం కొత్తగా వుంది. మనసు బరువెక్కించే కథ కధనాలు పాత్రలతో గార్గి గుర్తించుకునే చిత్రంగా నిలిచిపోతుంది.


నటీనటులు:


సాయి పల్లవి కెరీర్ లో మరో గుర్తిండి పోయే పాత్ర గార్గిఆ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఎమోషనల్ సీన్స్ లో సాయి పల్లవి నటన అద్భుతంగా వుంటుంది. బాలిక తండ్రిగా క‌లైమామ‌ణి న‌ట‌న ఆకట్టుకుంటుంది.


లాయ‌ర్ గిరీశం క‌ప్పగంతుల పాత్ర ఎమోషనల్ డ్రామాలో కొంత రిలీఫ్ గా వుంటుంది. మిగతా పాత్రధారులు చక్కగా నటించారు


టెక్నికల్ :


సాంకేతికంగా సినిమా ఉన్నంతంగా వుంది. గోవింద వసంత్ నేపధ్య సంగీతం ఎమోషనల్ సీన్స్ ని ఎలివేట్ చేసింది. కెమరా పనితనం కూడా ఆకట్టుకుంది. ఎడిటర్ కోర్ట్ రూమ్ డ్రామాని కొంత షార్ఫ్ చేసే అవకాశం వుంది. నిర్మాణ విలువలు కథకు తగినట్లుగా వున్నాయి.
 

ప్లస్ పాయింట్స్


సాయి పల్లవి
నిజాయితీ గల కథ


మైనస్ పాయింట్స్


కొన్ని చోట్ల సాగదీత
నెమ్మదించిన కోర్ట్ రూమ్ డ్రామా


ఫైనల్ వర్దిక్ట్ : 'గార్గి' గుర్తిండిపోతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS