'ఇష్క్' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు : తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు 
దర్శకత్వం : ఎస్.ఎస్ రాజు
నిర్మాత‌లు : ఎన్ వి ప్రసాద్, పరాస్ జైన్, వాకాడ అంజన్ కుమార్
సంగీతం : మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫర్ : శ్యాం కే నాయుడు
ఎడిటర్: ఏ. వర ప్రసాద్


రేటింగ్: 2.5/5


మలయాళంలో మంచి కధలు వస్తున్నాయి. చిన్న కాన్సప్ట్ లని తీసుకొని హిట్లు కొడుతున్నారు అక్కడి సినీ రూపకర్తలు. మలయాళంలో హిట్ అయిన కధలపై టాలీవుడ్ మేకర్స్ కి కూడా మంచి గురి. ఇప్పుడు మరో మలయాళీ కధ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ఇష్క్. 2019లో అదే టైటిల్ తో మలయాళంలో వచ్చిన ఈ సినిమాని తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ తో రిమేక్ చేశారు. సమ్మర్ లో రావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. థియేటర్లు తెరుచుకున్న మొదటి రోజే ఆడియన్స్ పలకరించిన ఈ సినిమా ఎలా వుంది ? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే. 


కధ:


సిద్దు (తేజ సజ్జ) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అను (ప్రియా ప్రకాశ్ వారియర్)తో సిద్దు ప్రేమలో ఉంటాడు. అను బర్త్ డే సందర్భంగా ఆమెతో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తాడు సిద్దు. డ్రైవ్ లో ఒక పార్కింగ్ ప్లేస్ లో ఆపి అనుకి ముద్దు అడుగుతాడు సిద్దు. రొమాంటిక్ మూడ్ లో అను, తేజకి ముద్దు పెడుతుతుంది. ఐతే అను ముద్దుపెట్టిన సీన్ ని పోలీసు మాధవ్ (  రవీందర్ ) ఫోటోలు తీస్తాడు. స్పాట్ లోనే బ్లాక్ మెయిల్ చేస్తాడు. టార్చర్ పెడతాడు. చివరికి డబ్బులు తీసుకొని వదిలేస్తాడు. ఐతే తనకు జరిగిన అవమానంపై తేజ ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు ? అలాంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ తర్వాత ఇద్దరి ప్రేమికుల మధ్య నెలకొన్న పరిస్థితులు ఏమిటి ?  చివరి వారి ప్రేమ కధ ఎలా ముగిసింది ? అనేది తెరపై చూడాలి. 


మలయాళంలో ఇలాంటి కధలని చాలా నేచురల్ గా డీల్ చేస్తారు. బహుసా ఆ సహజత్వం నచ్చే ఈ కధని తెలుగు రీమేక్ చేయడానికి సిద్దపడి వుంటారు నిర్మాతలు. ఐతే ఈ కధలో చెప్పడానికి చూపించడానికి అంత అవకాశం లేదు. థియేటర్ లో కూర్చున్న ముఫ్ఫై నిమిషాలకే విరామం వచ్చేస్తుంది. అసలు కధ ఏం ముందుకు జరక్కుండానే ఇంటర్వెల్ ఏమిటనే సందేహం ప్రేక్షకుడిలో కలుగుతుంది. ఒక దశలో షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ సినిమాకి తక్కువ అనే భావన కలిస్తుంది ఇష్క్. ఓటీటీకి సరిపడే కంటెంట్ ఇది. థియేటర్లు తెరచుకున్నాయి. థియేటర్ ఎక్స్ పిరీయన్స్ చేద్దామనుకుంటే మాత్రం ఇష్క్ తో నిరాశ తప్పదు.


ఫస్ట్ హాఫ్ అంతా ఒక్క కార్ లోనే చుట్టేస్తారు. సెకెండ్ హాఫ్ అంతా ఓ ఇంట్లో ముగించేస్తారు. చాలా చిన్న బడ్జెట్ సినిమా ఇది. బహుసా అతి తక్కువ ఖర్చుతో ఓ సినిమా తీసేయొచ్చనే పాయింట్ కూడా ఈ కధని తెలుగులో తీసుకురావడానికి ఒక కారణం కావచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా లాగ్ చేశారు. చెప్పడానికి విషయం లేనప్పుడు తొందరగా తేల్చాలి. తక్కువ నిడివి పెట్టుకొని కూడా ప్రేక్షకుడిని యంగ్ గేజ్ చేయలేకపోయాడు దర్శకుడు. హీరో క్యారెక్టర్ ని తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం కూడా చిన్న ఇబ్బంది వుంది. ఈ విషయంలో మలయాళం ఆడియన్స్ కి తెలుగు ఆడియన్స్ కి చిన్న తేడా వుంది. ఈ తేడాని తెసుకొని కొన్ని మార్పులు చేసుంటే కధ మరోలా వుండేది. కానీ వున్నది వున్నట్లు చేయడంతో హీరో పాత్ర మరీ ఆ రేంజ్ సహజత్వం డైజస్ట్ కాదు. 


సెకండ్ హాఫ్ లో హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే పాయింట్ పై సాగుతుంది. అయితే ఇందులో కొత్తదనం చూపించలేదు. విలన్ ఏం చేశాడో దాన్నే ఫాలో అవుతాడు హీరో. దీంతో హీరోకి విలన్ కి పెద్ద తేడా లేకుండా పోయింది. కాకపోతే ఈ కధకి ఇంతకంటే పెద్ద ముగింపు వుండదు. ఐతే చివర్లో హీరోయిన్ తీసుకున్న నిర్ణయం బావుంది. అమ్మాయిల ఆత్మభిమానం పాయింట్ అఫ్ వ్యూలో చూపించడం సమంజసంగా వుంది. 


నటీనటులు: 


తేజలో ఇందులో రెండు కోణాలు చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా కూల్ గా వున్న తేజ సెకండ్ హాఫ్ వచ్చేసరి సైకోలో బిహేవ్ చేస్తుంటాడు. సైకో కోణంలో తేజ నటన బావుంది. చాలా చిన్న వయసులో పరిణితి గల నటన ప్రదర్శించాడు. ప్రియా వారియార్ మొదటి నాలుగు సీన్లో అందంగా కనిపించింది. తర్వాత ఆమెను కార్ లాక్ చేసేశారు. సెకండ్ హాఫ్ లో ఒకే సీన్ కి పరిమితమైయింది. విలన్ గా నటించిన రవీంద్ర విజయ్ కి ఫుల్ మార్కులు పడాతాయి. సినిమాలో అతడి నటన హైలెట్. తన పాత్రలో ఒదిగిపోయాడు.


టెక్నికల్ గా:  


చాలా చిన్న కధ ఇది. బడ్జెట్ లో తీసేయొచ్చనే పాయింట్ పై సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఈ ప్రాజెక్ట్ చేసిం దని చెప్పాలి. తక్కువ లొకేషన్ వునప్పటికీ శ్యాం కే నాయుడు అనుభవం వల్ల ఫ్రేమ్స్ రిచ్ గా వచ్చాయి. ఎడిటింగ్ ఇంకా కొంచెం షార్ఫ్ గా ఉండాల్సింది. నేపధ్య సంగీతం బావుంది. సిద్ శ్రీరామ్ పాడిన పాట బావుంది. 


ప్లస్ పాయింట్స్ : 


తేజ సజ్జ నటన,  
సెంకడ్ హాఫ్ 

మైనస్ పాయింట్స్ 


సాగాదీత 
థియేటర్ ఎక్స్ పిరియన్స్ లేకపోవడం 


ఫైనల్ గా .. ఇష్క్.. థియేటర్లో అయితే రిస్క

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS