'క‌ప‌ట‌ధారి' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: సుమంత్‌, నందిత‌, సుమ‌న్ రంగ‌నాథ‌న్‌, నాజ‌ర్‌, వెన్నెల కిషోర్ తదితరులు 
కథ: హేమంత్ ఎం.రావు
స్క్రీన్ ప్లే: డా.జి.ధ‌నంజ‌య‌న్‌
దర్శకత్వం : ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి
నిర్మాత‌లు : ల‌లిత ధ‌నుంజ‌య‌న్
సంగీతం : సైమ‌న్ కె.కింగ్
సినిమాటోగ్రఫర్ : రసమథి 
ఎడిటర్: కె ఎల్ ప్రవీణ్


రేటింగ్: 2.5/5


సుమంత్ కి చాలా రోజులుగా హిట్ లేదు. సినిమాలు కూడా తగ్గించేశాడు. ఐతే 'మళ్ళీ రావా' సినిమాతో మళ్ళీ లైన్ లోకి వచ్చాడు. ఆ సినిమా మల్టీ ప్లెక్ష్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. తర్వాత మళ్ళీ అపజయాలు ఎదురయ్యాయి. సుబ్రమణ్యపురం, ఇదమ్ జగత్ సినిమాలు నిరాశ పరిచాయి. ఇపుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుమంత్. అదే 'క‌ప‌ట‌ధారి'.  కన్నడ సూపర్‌ హిట్‌ ‘కవలుధారి’ సినిమాకు ఇది రీమేక్‌.  ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రివ్యూలోకి వెళితే.. 


కథ‌: 


గౌతమ్‌ (సుమంత్‌) ఓ  ట్రాఫిక్‌ ఎస్సై. ట్రాఫిక్‌ కాకుండా క్రైమ్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లాల‌నేది అతని ఆశయం. కానీ సుపీరియర్ అధికారుల నుండి ప్రోత్సాహం వుండదు. ఒక రోజు అతను డ్యూటీ చేస్తున్న  ప‌రిధిలోనే  మెట్రో కోసం తవ్విన తవ్వకాలల్లో ఓ కుటుంబానికి చెందిన అస్తిపంజరాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తూతూ మంత్రంగా విచారణ చేసి కేసును మూసేసే ప్రయత్నం చేస్తారు. కానీ గౌతమ్‌ మాత్రం ఆ కేసును సీరియస్‌గా తీసుకొని తనదైన శైలో విచారణ మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతనికి జర్నలిస్ట్‌ గోపాల్‌ కృష్ణ (జయప్రకాశ్),  రిటైర్డ్‌ పోలీసు అధికారి రంజన్ ‌(నాజర్‌) పరిచయం అవుతారు. తర్వాత విచారణలో గౌతమ్ కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి?  ఆ హ‌త్యల్ని ఎవ‌రు చేశారు? ఆ  అస్తిపంజరాలు ఎవరివి ? గౌత‌మ్ హంత‌కుల్ని ప‌ట్టుకున్నాడా? అనేది మిలిగిన కధ.


విశ్లేష‌ణ‌:


క్రైమ్ థ్రిల్లర్స్ ఎప్పుడూ ఆసక్తికరంగానే వుంటాయి. ఒక క్రైమ్ సీన్  చూపించి దాని ముందు వెనుక ఏం జరిగింది ? ఆ క్రైమ్ వెనుక సూత్రధారులు ఎవరు ? తేల్చే క్రమం ఆసక్తి మలచి ప్రేక్షకులకు థ్రిల్ ని పంచుతుంటాయి థ్రిల్లర్స్. క‌ప‌ట‌ధారి కూడా ఈ తరహా కధనే.  ఈ సినిమాకి మాతృక  ‘కవలుధారి’ మంచి విజయం సాధించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ‘కవలుధారి’ కధపై వున్న నమ్మకంతోనే తెలుగులోకి తీసుకొచ్చారు. ఐతే రీమేక్ తో కొన్ని చిక్కులు వున్నాయి. అన్ని సార్లు ఆ మ్యాజిక్ వర్క్ అవుట్ కాదు. ఒక భాషలో విజయవంతమైన కధ మరో భాష ప్రేక్షకుడికి రుచించకపోవచ్చు.

 

కధ ఆత్మ దెబ్బతిన వచ్చు. నేటివిటీ తగ్గ మార్పులు చేయకపోతే లోకల్ ఫీలింగ్ రాకపోవచ్చు. క‌ప‌ట‌ధారి విషయంలో కూడా ఇవన్నీ చోటు చేసుకున్నాయి. దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి ఒరిజినల్ సినిమా కి మక్కీకి మక్కీ దించేశాడు. కొన్ని చోట్ల నేటివిటీ మార్పులు కూడా చేయలేదనే భావన కలుగుతుంది. బేసిగ్గా థ్రిల్లర్స్ కధల టెంప్లెట్ లోనే వుంటుంది  క‌ప‌ట‌ధారి. ఐతే క్రైమ్ అనేది మూడు ద‌శాబ్దాల కింద జరగడం, దాన్ని వెలుగులోకి తీసుకురావడాని జరిగిన విచారణ ఒక్కింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.


ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ కు బిగినింగ్ చాలా ముఖ్యం.  క‌ప‌ట‌ధారి కూడా చాలా ఆసక్తికరమైన బిగినింగ్ దొరికింది. ఎప్పుడైతే  గతంలో ఆ కేస్‌ని డీల్ చేసిన పోలీస్ అధికారి నాజర్  సీన్ లోకి వస్తాడో కధ వేగం పుంజుకుంటుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేషాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఈ క్రమంలో వచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చక్కగా కుదిరింది.  ఐతే తర్వాత కధలో వేగం తగ్గింది.  ద్వితీయార్థం అక్కడక్కడా కొన్ని మెరూపులు కనిపించినా థ్రిల్లర్స్ నడిచే వేగం లోపించింది. ఇక క్లైమాక్స్ కూడా సగటు థ్రిల్లర్ పంధాలోనే రాసుకోవడం ఒక్కింత నిరాశకు గురి చేసింది. ఐతే ఒరిజినల్ ని చూడని ప్రేక్షకులకు అక్కడక్కడా కొంచెం సాగాదీతగా అనిపించినా కొన్ని చోట్ల థ్రిల్లింగ్ అనుభవం పంచుతుంది  క‌ప‌ట‌ధారి.


* న‌టీన‌టులు


బేసిగ్గా సుమంత్ మంచి నటుడు. ఆయనలో చాలా ఎమోషన్స్ పలుకుతాయి. ఇదివరకే కొన్ని  థ్రిల్లర్స్ చేశాడు. ఈ సినిమాలో కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా కేవలం తన పాత్రకు ఏం కావాలో దాన్ని ఎచీవ్ చేసే ప్రయత్నం చేశాడు. నాజ‌ర్‌ కి మరో మంచి పాత్ర పడింది. ఆయన నటన సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్.  జ‌య‌ప్రకాష్ పాత్ర కూడా చక్కగా తీర్చిదిద్దారు.  హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునే  ప్రాధాన్యం లేదు. వెన్నెల కిషోర్ కామెడీ కోసం ప్రయత్నం చేశాడు కానీ ఈ కధకు అది అనవసరం అనే ఫీలింగ్ వస్తుంది. 


* సాంకేతిక వ‌ర్గం
 

టెక్నికల్ ప్రమాణాలు బావున్నాయి . సంగీతం, కెమెరా పనితీరు చక్కగా కుదిరాయి. సైమ‌న్ కె.కింగ్‌ అందించిన నేపధ్య సంగీతం కొన్ని సీన్స్ ని ఎలివేట్ చేసింది. దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి మాతృకని చెడగొట్టకుండా వున్నది వున్నట్లుగా తీయాలనే ఆలోచన బావుంది.  కానీ కొన్ని సాగాదీత సన్నివేశాలని షార్ప్ చేసి కొంత ఫైన్ ట్యూన్ చేసుంటే కపటధారిని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం వుండేది.  


* ప్లస్ పాయింట్స్ 


కొన్ని ట్విస్ట్ లు  
నేపధ్య సంగీతం
ఇన్వెస్టిగేష‌న్‌
 

* మైనస్ పాయింట్స్ 


స్లో నేరేషన్ 
సాగదీత సన్నివేషాలు 


* ఫైనల్ వర్దిక్ట్: `క‌ప‌ట‌ధారి` యావరేజ్ థ్రిల్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS