అభిమానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సాయం

మరిన్ని వార్తలు

కష్టాల్లో ఉన్నానని అయన తలుపు తడితే చాలు.. వెంటనే ఆపన్నహస్తం అందించే మెగా మనసున్న మనిషి మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే చిరంజీవి ఐ, అండ్ బ్లడ్ బ్యాంకు ద్వారా ఎందరికో సేవలందిస్తున్న మెగాస్టార్ తాజాగా అనారోగ్యంతో బాధ పడుతున్న తన మెగా అభిమాని వెంటనే కోలుకోవాలంటూ ఆయనకు లక్ష రూపాయల సాయం అందించారు. ఆ వివరాల్లోకి వెళితే .. కడపకు చెందిన సీనియర్ మెగా అభిమాని పి సురేష్ అంటే తెలియని మెగాభిమానులుండరు.

 

అఖిల భారత చిరంజీవి యువతకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన కడప జిల్లా మాజీ అధ్యక్షుడిగా ఎనలేని సేవలు చేసిన అనుభవశాలి. మెగాస్టార్ చిరంజీవిగారంటే ప్రాణం కన్నా మిన్నగా అభిమానించే ఆయన చిరంజీవిగారి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేసారు. ప్రస్తుతం సురేష్ అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ కదిరిలో ఉంటున్నారు. చికిత్స నిమిత్తం ప్రతి రెండ్రోజులకోసారి కదిరి నుండి కడప, తిరుపతి వెళ్తూ వస్తున్నారు.

 

ఆయన తీవ్ర అనారోగ్యంతో, ఆర్థికంగా సతమతమవుతున్న సురేష్ కి మెగాస్టార్ సాయం అందించారు. మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున పి సురేష్ గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసారు మెగాస్టార్. గురువారం మధ్యాహ్నం పి సురేష్ అకౌంట్ కు లక్షరూపాయలను ట్రాన్స్ఫర్ చేసారు.

 

ఆపదలో ఉన్నవాళ్లను రక్షించేందుకు మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు ముందుంటారని మరోసారి రుజువైంది. కరోనా సమయంలో కూడా అయన ఎందరో అభిమానులకు తనదైన సపోర్ట్ అందించారు. ఈ సందర్బంగా అఖిల భారత చిరంజీవి యువత మెగాస్టార్ చిరంజీవి గారికి కృతఙ్ఞతలు తెలిపారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS