నటీనటులు: విశాల్, సునైనా, ప్రభు, మునిష్కాంత్, తలైవాసల్ విజయ్, మిషా గోషల్
దర్శకుడు : ఎ వినోద్ కుమార్
నిర్మాతలు: రమణ & నందా
సంగీత దర్శకులు: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: బాలసుబ్రమణ్యం & బాలకృష్ణ తోట
ఎడిటర్: N.B.శ్రీకాంత్
రేటింగ్ : 2.5/5
కోలీవుడ్ నుండి తెలుగు లో మార్కెట్ సంపాయించిన హీరోల్లో విశాల్ ఒకరు. విశాల్ సినిమా అంటే తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతుంటుంది. ఇప్పుడు విశాల్ నుండి మరో సినిమా వచ్చింది. అదే ‘లాఠీ’. యాక్షన్ కథలతో అలరించే విశాల్.. ‘లాఠీ’ని కూడా యాక్షన్ ఎంటర్ టైనర్ గా మలిచాడు. మరి ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలిచింది ? కానిస్టేబుల్ పాత్రలో విశాల్ చేసిన డ్యూటీ ఏమిటి ?
కథ :
మురళీకృష్ణ (విశాల్) నిజాయితీ గల పోలీసు కానిస్టేబుల్. భార్య కవిత (సునైన) కొడుకు రాజునే ప్రపంచంగా బతుకుతుంటాడు. ఓ కేస్ కారణంగా సస్పెన్షన్‌ని గురవుతాడు మురళి. ఆ తర్వాత డీఐజీ ప్రభు సిఫార్సుతో మళ్లీ విధుల్లో చేరతాడు. ఒకరోజు డీఐజీ ప్రభు తన కస్టడీలో ఉన్న ఓ నేరస్తుడిని లాఠీతో శిక్షించాలని మురళీని కోరతాడు. వీరాని తీవ్రంగా కొడతాడు మురళి. దీంతో మురళిపై వీర క్షక పెంచుకుంటాడు. వీర తండ్రి సూరా పెద్ద దాదా. ఈ ఇద్దరూ కలసి మురళిని ఏం చేశారు.. వారిని నుండి తప్పించుకోవడానికి మురళి ఎలాంటి పోరాటం చేశాడనేది మిగతా కథ.
విశ్లేషణ:
పోలీసు కథలు దాదాపు ఒకే టెంప్లెట్ తో వుంటాయి. ఒక దాదా , వాడి అన్యాయాలకు ఎదురుతిరిగే నిజాయితీ గల పోలీసు. ‘లాఠీ’ కథ కూడా ఇదే కానీ దిన్ని యాక్షన్ పంధాలో నడిపారు. హీరో , విలన్స్ పరిచయం, విలన్స్ ని క్రూరంగా చూపించడం, వీర మురళిపై పగ పట్టడం..ఇలా ఫస్ట్ లో కథని ముందుకు తీసుకెళ్ళారు. ఐతే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం భిన్నంగా ప్రయత్నించారు. ఒక నిర్మాణంలో వుండే భవనంలోనే అతి పెద్ద యాక్షన్ సీక్వెన్స్ పెట్టి సినిమా ముగించారు. ఇలాంటి యాక్షన్ ఆలోచన బావుంది కానీ అది తెరపై చాలా సాగదీతగా వచ్చింది.
నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో దాదాపు 45 నిమిషాలపాటు సాగే యాక్షన్ సీన్స్ సహనానికి పరీక్ష పెడతాయి. ఆ భవనంలోనే మురళీకృష్ణతోపాటు, అతని కొడుకు టప్ కూడా చిక్కుకోవడం, బాబుని కాపాడుకునేందుకు మురళీ చేసే పోరాటం ఎమోషనల్ గా వర్క్ అవుట్ అవుతుందని దర్శకుడు భావించాడు. కానీ ఇది ఫలితాన్నివ్వలేదు. ఐతే ఈ యాక్షన్ ఎపిసోడ్ లో మురళీ పన్నిన 'వల' ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అలంటి ట్విస్ట్ లు మరిన్ని ఉండాల్సింది. సెకండ్ హాఫ్ లో కథ లేకపోవడం ఇందులో మైనస్ గా మారింది. ఎమోషన్ లేని యాక్షన్ భరించడం కష్టమే.
నటీనటులు :
విశాల్ మరోసారి యాక్షన్ తో అలరించాడు. మురళి పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ ఘట్టాలు చాలా బాగా చేశాడు. సునైన పాత్ర కు కథలో అంత ప్రాధన్యత లేదు. కానీ తన స్క్రీన్ ప్రజన్స్ బావుంది. ప్రభు పాత్ర చిన్నదే. విలన్స్ భయకంరంగా వుంటారు. కానీ విలనిజం లో బలం లేకపోవడం కూడా ఒక మైనస్. సూరా, ఆయన కొడుకు వీరా లుక్స్ తో భయపెట్టారు. బాబు చక్కగా నటించాడు. మిగతా పాత్రలు పరిధి మేర వున్నాయి.
టెక్నికల్ :
యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం హెవీగా వుంది. కొన్ని యాక్షన్ సీన్స్ ని ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా వుంది. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్ సీక్వెన్స్ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు ఓకే.
ప్లస్ పాయింట్స్
విశాల్
యాక్షన్ సీక్వెన్స్
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
కథనంలో బలం లేకపోవడం
ఎమోషన్ మిస్ కావడం
ఫైనల్ వర్డీక్ట్ : ప్రేక్షకుడికి తగిలే 'లాఠీ'