తమిళనాట అత్యధిక పారితోషికం తీసుకొంటున్న కథానాయకుడు ఎవరంటే... రజనీకాంత్ పేరే చెబుతారు. తన పారితోషికం దాదాపు రూ.120 కోట్లని టాక్. విజయ్ ఆ తరవాతి స్థానంలో ఉండేవాడు. విజయ్ రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకీ దాదాపు 100 నుంచి 110 కోట్ల వరకూ ఉండేది. ఇప్పుడు విజయ్ పారితోషికం అమాంతంగా పెరిగి రూ.150 కోట్లయ్యిందని టాక్. `వారసుడు` సినిమాకి విజయ్ రూ,110 కోట్లు తీసుకొన్నాడు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దాదాపుగా రూ.400 కోట్లతో రూపొందుతున్న సినిమా ఇది. విజయ్‌కి ఏకంగా రూ.150 కోట్లు ఇచ్చినట్టు చెన్నై వర్గాల టాక్. ఆ లెక్కన పారితోషికం విషయంలో రజనీకాంత్ ని విజయ్ దాటేసినట్టే.
విజయ్ గత చిత్రం `బీస్ట్` పెద్దగా ఆడలేదు. ఆ సినిమాకి విజయ్ తీసుకొన్న పారితోషికం రూ.100 కోట్లు. ఆ తరవాతి సినిమాకి రూ.110 కోట్లు.. ఇప్పుడు రూ.150 కోట్లు. విజయ్‌కి తమిళనాట అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. విదేశాల్లోనూ విజయ్ సినిమాని బాగానే చూస్తున్నారు. తెలుగునాట కూడా తనకు మార్కెట్ ఉంది. పైగా..రజనీకాంత్ కి గత కొంతకాలంగా హిట్లు లేవు. అందుకే రజనీ పారితోషికం పడిపోతోంది. విజయ్ రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతూ పోతోంది.