'మళ్ళీ మొదలైయింది' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

చిత్రం: మళ్ళీ మొదలైయింది

నటీనటులు : సుమంత్ అక్కినేని, వర్షిణి, వెన్నెల కిశోర్ తదితరులు
దర్శకత్వం : టీజీ కీర్తి కుమార్
నిర్మాత‌లు : కె రాజశేఖర్ రెడ్డి
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫర్ : శివ G R N 
ఎడిటర్: ప్రదీప్ రాఘవ్


రేటింగ్: 2.5/5


రొమాంటిక్ కామెడీలతో మెప్పించడం అంత సులభం కాదు. పైకి తేలిగ్గా కనిపించే కష్టమైన జోనర్ రొమాంటిక్ కామెడీ. మిస్సమ్మ నుంచి మొదలుపెడితే మొన్నటి గీతగోవిందం వరకు తెలుగుతెరపై ఈ జోనర్ లో క్లాసికల్ హిట్స్ వున్నాయి.  మీడియం సినిమా అనేసరికి రొమాంటిక్ కామెడీలే వైపే చూస్తారు సినీ రూపకర్తలు.  అయితే రొమాంటిక్ కామెడీ అంటే రోమాన్స్ కామెడీ అనుకుని దిగుతారు కొందరు. ఇలా దిగిగితే నిరాశతప్పదు. ఇప్పుడు సుమంత్ 'మళ్ళీ మొదలైయింది' టైటిల్ తో ఓ రొమాంటిక్ కామెడీ చేశాడు. జీ5 ఓటీటీలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చంది. ఈ రొమాంటిక్ కామెడీ రివ్యూలోకి వెళితే.. 


కథ: 


విక్రమ్ (సుమంత్) ఓ చెఫ్. విక్రమ్ తల్లి సుజాత (సుహాసిని) గరమ్ మసాలా పౌడర్ కంపనీకి ఓనర్. నిషా (వర్షిణి) విక్రమ్ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. అయితే ఇద్దరి మధ్య తేడాలు వస్తాయి. విక్రమ్ తనలోకం తాను బ్రతుకుతాడు. ఇది నిషాకి నచ్చదు. విడాకులు కోరుతుంది. విడాకులకు అంగీకరిస్తాడు విక్రమ్. ఇద్దరూ మ్యచువల్ గా విడాకులకు అప్లయ్ చేస్తారు. విడాకుల తర్వాత వంటరి జీవితం అనుభవించిన విక్రమ్, పవిత్ర ( నైనా గంగూలి) కి దగ్గరౌతాడు.  పవిత్రని ప్రేమిస్తాడు. తర్వాత ఏం జరిగింది ? పవిత్ర,  విక్రమ్ ని ప్రేమించిందా ? విడాకుల తీసుకున్న వ్యక్తి ప్రేమని అంగీకరించిందా ? చివరికి విక్రమ్ కథకి ఎలాంటి ముగింపు దొరికింది ? అనేది మిగిలిన కథ. 


విశ్లేషణ:


విక్రమ్ అనే కన్ఫ్యుజన్ క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథ 'మళ్ళీ మొదలైయింది'. పెళ్లి, భార్య విషయంలో విక్రమ్ కి క్లారిటీ వుండదు. ప్రేమించిన పెళ్ళాడిన అమ్మాయికి విడాకులు ఇచ్చేస్తాడు. వెంటనే మరో అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమని అంగీకరించి పెళ్లి చేసుకుందామంటే మళ్ళీ వెనక్కి తగ్గుతాడు. ఇలా అంతా కన్ ఫ్యుజనే విక్రమ్ ది. అయితే ఈ డ్రామా నేచురల్ గా వుండదు. మొదట విడాకులు ఇవ్వడనికి బలమైన కారణాలు వుండవు. తర్వాత ప్రేమలో పడటానికి కూడా కారణాలు లేవు. దీంతో డ్రామా ఎక్కడా ఆసక్తిగా పెంచదు. మళ్ళీ ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకొనిమని అడగడంతో మళ్ళీ పెళ్ళా ? అనే ఇంటర్వెల్ బ్యాంగ్ వేసిన దర్శకుడు .. ఇంటర్వెల్ తర్వాత కూడా సినిమాని ఆసక్తిగా మలచలేకపోయాడు. 


ఇంటర్వెల్ తర్వాత వచ్చిన సన్నీవేషాలు ఇంకాస్త బోరింగా సాగుతాయి. ''ఇప్పుడే విడాకులయ్యాయి మళ్ళీ పెళ్లి అంటే ? అని అమాయకంగా అడుగుతాడు హీరో. ''పెళ్లి చేసుకోకుండా నీతో ఉండటానికి నేనెలా కనిపిస్తున్నా?'' అని అతడి ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తుంది హీరోయిన్. ఏం చేయాలో తోచక వంట చేయడం వచ్చు కాబట్టి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి బిజీ కావాలని ప్రయత్నిస్తాడు హీరో. ఈ రెస్టారెంట్ గురించి ఒకమాట చెప్పుకోవాలి. చాలా విచిత్రమైన రెస్టారెంట్ ఇది. ఈ రెస్టారెంట్ లో కస్టమర్లు కనిపించరు. హీరో, హీరో గర్ల్ ఫ్రండ్ మాట్లాడుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి, గర్ల్ ఫ్రండ్ లవర్ గొడవ పడటానికి, లాయర్ వచ్చి హీరోకి క్లాస్ పీకడానికి వాడుకున్నారు. వంటరితనం గురించి హీరోకి లాయర్ క్లాస్ పీకగానే బ్రతకడానికి ఒక తోడు కావాలని రియలైజైన హీరో మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం, హీరోయిన్ పాత్ర  ఓ సినిమాటిక్ డ్రామా ప్లే చేసి చివరికి సగటు శుభం కార్డు సినిమాలానే ఎండింగ్ కార్డు పడిపోతుంది. విడాకుల తర్వాత కూడా జీవితం వుంటుంది. అదే రీసెట్..అని ఒక కాన్సెప్ట్ అనుకున్నాడు దర్శకుడు. అయితే ఆ కాన్సెప్ట్ ని ఆసక్తిగా చూపించడంలో విఫలమయ్యాడు. 


నటీనటులు :


విక్రమ్ పాత్రని సులువుగానే చేశాడు సుమంత్. అయితే ఆ పాత్రలో కన్ఫ్యుజన్ ఎక్కువైయింది. దీంతో చాలా చోట్ల క్లూ లెస్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ కనిపిస్తాడు. అయితే ఎప్పటిలానే సుమంత్ లో సెటిల్ పెర్ఫార్మమెన్స్ కనిపించింది. విక్రమ్ భార్యగా చేసిన వర్షిణి పర్వాలేదనిపిస్తుంది. అయితే ఆమె పాత్ర అసహజంగా వుంది. డైలాగ్స్ బట్టిపట్టి చెప్తున్నట్లు అనిపిస్తుంది.


పవిత్ర పాత్రలో కనిపించిన నైనా గంగూలీ తన పాత్రకు న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రని బలంగా మలచలేకపోయాడు దర్శకుడు. సుహాసిని పాత్రని సరిగ్గా వాడుకోలేదని అనిపిస్తుంది. వైశాలి పాత్రలో కనిపించిన పావనీ రెడ్డికి పాత్ర ఓకే. లాయర్ పాత్ర కనిపించిన పోసాని పాత్రలో కొత్తదనం ఏమీ లేదు. బామ్మగా అన్నపూర్ణ పాత్ర మెప్పిస్తుంది. వెన్నల కిషోర్ చేసిన కామెడీ కొంత ఊరట. ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా నటులు పరిధి మేర చేశారు. 


సాంకేతిక వర్గం :


అనూప్ రూబెన్స్ ఇచ్చిన పాటలు రిజిస్టర్ కావు. సిద్ శ్రీరాం పాడిన పాట ఓకే. కొన్ని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. కెమరా పనితనం డీసెంట్ గా వుంది. నిర్మాణ విలువలు ఓకే.. 


ప్లస్ పాయింట్స్ 


సుమంత్, నైనా గంగూలీ 
వెన్నల కిషోర్ కామెడీ 
కొన్ని డైలాగులు 


మైనస్ పాయింట్స్

 
కథలో గంధరగోళం
ఆకట్టుకొని కధనం 
పాత్రల మధ్య సంఘర్షణ లేకపోవడం 


ఫైనల్ వర్దిక్ట్ : మళ్ళీ నిరాశే


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS