రవితేజ నుంచి వస్తున్న మరో సినిమా ఖిలాడి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. క్రాక్ తరవాత.. రవితేజ చేసిన సినిమా ఇది. పాటలు బాగున్నాయి. ట్రైలర్ అదిరింది. అన్ని చోట్లా పాజిటీవ్ బజ్ వచ్చేసింది. అయితే ప్రి రిలీజ్ తో అది కాస్త పెరగాల్సింది పోయి..కాస్త తగ్గింది. రవితేజ మాటలతో తొలిసారి నెగిటీవ్ వైబ్రేషన్స్ కనిపించాయి. ఈ సినిమా తీసిన.. రమేష్ వర్మ గురించి రవితేజ ఏం మాట్లాడలేదు.
రమేష్ వర్మ సుడిగాడని, అందుకే మంచి నిర్మాతలు, టెక్నీషియన్లు, నటీనటులు దొరికారని సెటైర్ వేశాడు రవితేజ. ఈ సినిమా ఒప్పుకోవడానికి ఏకైక కారణం.. శ్రీకాంత్ విస్సా అనే రచయిత అని, ఈ క్రెడిట్ మొత్తం.. తనకే అని చెప్పి, దర్శకుడి గాలి తీసేశాడు. అంతేకాదు.. నిర్మాతకూ జాగ్రత్తలు చెప్పాడు. సెట్ కి వచ్చి అన్నీ చూసుకోవాలని, అప్పుడే ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయని.. సూచించాడు. అంటే.. నిర్మాత ఈ సినిమా సెట్ కి రాలేదని, రాకపోవడం వల్ల చాలా అవకతవకలు జరిగాయన్నది రవితేజ ఇన్నర్ మీనింగ్ కావొచ్చు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో... రవితేజ ఎనర్జిటిక్ స్పీచ్ ఇచ్చినా.. తను ఈ సినిమా రిజల్ట్ పై అంతగా కాన్ఫిడెన్ట్ గా లేడన్న విషయం అర్థమైంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.