చిత్రం: మెకానిక్ రాకీ
దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
కథ - రచన: రవితేజ ముళ్లపూడి
నటీనటులు: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేశ్, హైపర్ ఆది, హర్ష వర్థన్ తదితరులు
నిర్మాత: రామ్ తాళ్లూరి
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: మనోజ్‌రెడ్డి కాటసాని
ఎడిటర్: అన్వర్ అలీ
బ్యానర్: ఎస్.ఆర్. టీ. ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ: 22 నవంబర్ 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.5/5
ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విశ్వక్ సేన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఇదే ఏడాదిలో విశ్వక్ ది ఇది మూడో సినిమా కావటం గమనార్హం. వరుస సినిమాలతో కెరియర్ లో బిజీగా ఉన్నాడు. విశ్వక్ మాటల్లానే ఉంటాయి అతని సినిమాలు కూడా. మెకానిక్ రాకీ మూవీ రిలీజ్ ముందే రివ్యూవర్లకి హెచ్చరిక జారీ చేసాడు విశ్వక్. అదంతా సినిమా పై ఉన్న నమ్మకమని అంతా అనుకున్నారు. ఈ వారం రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాల్లో కొంచెం బజ్ ఉన్న మూవీ ఇదే కావటం విశేషం. విశ్వక్ కి పోటీగా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా, విశ్వక్ మూవీపైనే అంచనాలున్నాయి. ఫైనల్ గా మెకానిక్ రాకీ మూవీ ఈ శుక్రవారం థియేటర్స్ లో సందడి చేస్తోంది. సినిమా ఎలా ఉంది? మెకానిక్ రాకీ విశ్వక్ కి బ్రేక్ ఇచ్చిందో లేదో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
రాకీగా పిలవబడే రాకేష్(విష్వక్‌సేన్) బీటెక్ మధ్యలోనే ఆపేసి తండ్రి రామకృష్ణ (నరేష్ వీకే) నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్‌గా సెటిల్ అయిపోతాడు. గ్యారేజ్‌లో రిపేర్లు చేస్తూ, డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. గ్యారేజ్ సైట్ మీద రంకిరెడ్డి (సునీల్) ఆశ పడతాడు. రాకీ గ్యారేజ్ కాపాడుకోవడం కోసం లోన్ తీసుకోవాలనుకుంటాడు. అందుకోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతాడు. ఒకరోజు రాకీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడానికి మాయ (శ్రద్ధా శ్రీనాథ్), ప్రియ (మీనాక్షి చౌదరి) వస్తారు. రాకీ కాలేజ్ డేస్ లో ప్రేమించిన అమ్మాయే ప్రియ. రాఖీ ఫ్రెండ్ సిస్టర్ కూడా ప్రియ. వీళ్లిద్దరి లవ్ ట్రాక్ స్టార్ట్ అయిన వెంటనే కొన్ని కారణాల వలన రాకీ కాలేజ్ మానేయాల్సి వస్తుంది. డ్రైవింగ్ నేర్చుకోవటానికి వచ్చిన మాయ రాకీకి సాయం చేయాలి అనుకుంటుంది. ప్రియ, రాఖీ లవ్ ట్రాక్ మళ్ళీ డ్రైవింగ్ స్కూల్ లో మొదలవుతుందా? ప్రియ గురించి రాకీకి తెలిసిన నిజాలేంటి? ప్రియ కోసం రాకీ ఏం చేస్తాడు?వీరిద్దరి మధ్యలో మాయ పాత్ర ఏంటి? రాకీ చివరికి గ్యారేజ్ కాపాడుకున్నాడా? లేదా? దానికోసం రాకీ ఏం చేశాడు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఒక్కోసారి ఒక్కో కొత్త కథతో వచ్చే విశ్వక్ ఈ సారి కూడా ఎదో కొత్తగానే ట్రై చేస్తాడనుకుంటే మంచి కమర్షియల్ సినిమాతో మెప్పించాడు. టీజర్, ట్రైలర్ లోనే ఈ విషయం అర్థం అయినా సినిమా చూస్తే పక్కా కమర్షియల్ లెక్కలు కనిపిస్తాయి. స్క్రీన్ ప్లే, మధ్య మధ్య వచ్చే ట్విస్ట్ లు ఆడియన్స్ ని మెప్పిస్తాయి. కానీ కొన్ని సీన్లు ముందే ప్రేక్షకుడికి తెలిసిపోతాయి. కొత్త కథేమీ కాదు రొటీన్ సినిమా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా, స్లో గా ఉంది. ఎంటర్‌టైన్ మెంట్ ఎక్కువ ఎక్సపెక్ట్ చేయటానికి లేదు. తండ్రితో అస్తమాను తిట్లు తినే కొడుకు, కాలేజీ లవ్ స్టోరీ, అర కొరా కామెడీ, విలన్ ట్రాక్ అన్ని రొటీన్ గా ఉన్నాయి. పాత కథనే తిప్పి తిప్పి చెప్పారు. హీరో, కొన్ని డైలాగ్స్ కొత్తవి అంతే. మిగతా ట్రాక్ అంతా సేమ్ టూ సేమ్. ఎలాగో ఇంటర్వెల్ తర్వాత కథ మొదలవుతుంది. శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ ట్విస్ట్ బాగానే ఉంది.
ట్రైలర్ చూస్తే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకున్నారంతా కానీ ఇదొక క్రైమ్ థ్రిల్లర్. అదే థ్రిల్లర్ జోనర్ లో వెళ్తే దర్శకుడు సక్సెస్ అయ్యేవాడు. సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో కమర్షియల్ అంశాలు జోడించడం వలన గందరగోళంగా తయారయింది. ఇక్కడే దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అవసరం లేని కామెడీ సీన్స్, పాటలు వీటితో ఫస్ట్ హాఫ్ మొత్తం వేస్ట్ అనిపిస్తుంది. అన్నీ సినిమాటిక్ గా అనిపించి ప్రేక్షకుడు కథకి కనక్ట్ కావటం కష్టం అవుతుంది. విశ్వక్ ఓల్డ్ గెటప్ కాస్తా బెటర్ అనిపించింది. సెకండ్ హాఫ్ సినిమాకి కొంత ప్లస్. ఊహించని ట్విస్ట్స్ ఆసక్తి కలిగిస్తాయి. అప్పటివరకు ఏదో సాగుతోంది అనుకున్న కథకి సెకండ్ హాఫ్ బలం చేకూర్చింది. ఎవరో ఏదో చెపితే నమ్మిమోసపోయే మధ్య తరగతి ఆశలు, జీవితాలు కనిపిస్తాయి. ఎమోషన్స్ కొరవడ్డాయి.
నటీ నటులు:
విశ్వక్ సేన్ ఎప్పటిలా తన పాత్రకి వందకి వంద శాతం న్యాయం చేసాడు. తన నటనలో చాలా ఈజ్ కనిపించింది. రాకీ పాత్రలో చాలా హుషారుగా కనిపించాడు. ఫైటుల్లో అగ్రెసివ్ గా కనిపించాడు. విశ్వక్ నోట వచ్చిన పంచ్ డైలాగ్స్ కొన్ని బాగున్నాయి. వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న మీనాక్షి ఇప్పుడు మెకానిక్ రాఖీతో వచ్చింది. ఈ సినిమాలో విశ్వక్ కి జోడి గా మీనాక్షి బాగానే ఉంది. తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర సినిమాలో కీలకంగా ఉంది. ఆమె పాత్రలో ఉన్న ట్విస్ట్ సూపర్. హీరోయిన్స్ గ్లామర్ మెరుపులు కూడా సినిమాకి కలిసొచ్చాయి. మిగతా పాత్రల్లో కనిపించిన సునీల్, నరేష్, హర్షవర్ధన్, రోడీస్ రఘు, హర్ష చెముడు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్:
దర్శకుడు రవితేజ ముళ్లపూడి మొదట ఎంచుకున్న జోనర్ లోనే కథ కొనసాగితే బాగుండేది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ అంటూ ఏవేవో చొప్పించి ఫెయిలయ్యాడు. సెలక్ట్ చేసుకున్న కథా నేపథ్యం బాగున్నా, ప్రేక్షకుడ్ని ఆకట్టుకోవటంలో తడబడ్డాడు. ఎమోషన్స్ లోపించటం వలన కథలో సోల్ మిస్ అయ్యింది. స్క్రీన్ ప్లే పై కొంచెం శ్రద్ద పెడితే బాగుండేది. టెక్నీకల్ గా సినిమా పరవాలేదని పించింది. ముఖ్యంగా జేక్స్ బిజోయ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, చాలా బాగుంది. కెమెరా వర్క్ కూడా సూపర్. ఛేజ్ సీక్వెన్సులు బాగా తీశారు. ఎడిటింగ్ పై ఇంకొంచెం ద్రుష్టి పెట్టి ఉంటే ఫస్ట్ హాఫ్ మెరుగయ్యి ఉండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. టోటల్ గా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్, ప్రొడక్షన్ వేల్యూస్ అన్ని పక్కా కమర్షియల్ సినిమా హంగులతో ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ట్విస్ట్ లు
విశ్వక్ సేన్
సెకండ్ హాఫ్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్
స్లో నేరేషన్
కామెడీ
ఎమోషన్స్
రొటీన్ స్టోరీ
ఫైనల్ వర్దిక్ట్ : థ్రిల్ మిస్ అయిన 'మెకానిక్ రాకీ'