మేడమీద అబ్బాయి రివ్యూ & రేటింగ్స్

మరిన్ని వార్తలు

తారాగణం: అల్లరి నరేష్‌, నిఖిలా విమల్‌, సత్యం రాజేష్‌, శ్రీనివాస్‌ అవసరాల, హైపర్‌ ఆది, తులసి తదితరులు
సంగీతం: షాన్‌ రెహమాన్‌
సినిమాటోగ్రఫీ: ఎన్‌.శివకుమార్‌
దర్శకత్వం: జి.ప్రజీత్‌
నిర్మాత: బొప్పన చంద్రశేఖర్‌
నిర్మాణం: జాహ్నవి ఫిలింస్‌

యూజర్ రేటింగ్: 2.75/5

కథా కమామిషు..

ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌తో, తన రెగ్యులర్‌ ఫార్మాట్‌కి భిన్నంగా ఓ కొత్త ప్రయత్నం నరేష్‌ చేస్తున్నాడని టీజర్‌తో, ట్రైలర్‌తోనే అర్థమయ్యింది. మరి, సినిమాలో ఆ కొత్తదనం ఉందా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళాలి. బీటెక్‌లో అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిలయిన శ్రీను (నరేష్‌), సినిమా దర్శకుడైపోదామనుకుని ముందుగా ఊళ్ళో స్నేహితులతో కలిసి షార్ట్‌ ఫిలిం తీస్తాడు. అది ఫలించదు. ఇంకో వైపున తన ఇంటి ఎదురుగా ఉండే మరో ఇంట్లో అద్దెకు దిగిన సింధు (నిఖిల)ని ప్రేమిస్తాడు. స్నేహితుల దగ్గరేమో, సింధు తనకి పడిపోయిందంటూ లేనిపోని గొప్పలు చెప్పేసుకుంటుంటాడు శ్రీను. తండ్రి (జయప్రకాష్‌) పోరు పడలేక, హైద్రాబాద్‌కి శ్రీను చెక్కేస్తోంటే, ఆ రైలులో సింధు కన్పిస్తుంది. సింధుతో సెల్ఫీ దిగి, దాన్ని స్నేహితులకి శ్రీను పంపుతాడు. అంతే, ఆ సెల్ఫీ శ్రీను జీవితాన్ని మార్చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది తెరపైనే చూడాలి. 

నటీనటులెలా చేశారు.. 

స్ఫూఫ్‌లకు దూరంగా అల్లరి నరేష్‌ చేసిన సినిమా ఇది. కామెడీ టైమింగ్‌తో అలరించేందుకు ప్రయత్నించాడు, కొంతమేర సక్సెస్‌ అయ్యాడు కూడా. తన వరకు తాను ఎంత చెయ్యాలో అంతా చేశాడుగానీ, ఎందుకో తెరపై అల్లరి నరేష్‌ అంత కంఫర్ట్‌గా ఫీలయినట్లు అనిపించదు. 'జబర్‌దస్త్‌' హైపర్‌ ఆది మాత్రం తనదైన కామెడీ టైమింగ్‌తో, పంచ్‌లతో రెచ్చిపోయాడు. హీరోని ఒక్కోసారి డామినేట్‌ చేసేస్తుంటాడు కూడా. హీరోయిన్‌ నిఖిల ఓకే. బాగానే చేసింది. అవసరాల శ్రీనివాస్‌ ఆకట్టుకుంటాడు. మిగతా పాత్రధారులంతా ఓకే.  

విశ్లేషణ... 

సరదా సరదా సాగే సన్నివేశాలతో నడిస్తోన్న సినిమాలోకి ట్విస్ట్‌లు వచ్చి చేరతాయి. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయిగానీ, సినిమాలో ఎంటర్‌టైనింగ్‌ పార్ట్‌ ఆశించినమేర కన్పించదు. అక్కడక్కడా నవ్వులు ఓకే అనిపించడం మినహా, అదిరిపోయే కామెడీని ఆశించడం కష్టం. అల్లరి నరేష్‌ సినిమాలంటేనే ఓ రేంజ్‌ కామెడీని ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు ఆడియన్స్‌. ఆ రకంగా చూస్తే కొంత నిరాశపరుస్తుంది. సరదా సన్నివేశాల జోరు తగ్గి, సీరియస్‌నెస్‌ పెరిగే సరికి ఏదో లోటు అనిపించడం మామూలే. ఓవరాల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌ మీద ఇంకాస్త దృష్టిపెట్టి ఉంటే ఔట్‌పుట్‌ మరింత బాగా వచ్చేదన్న భావన కలుగుతుంది. 

సాంకేతిక వర్గం పనితీరు..  

బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఓకే. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. పాటలు ఫర్వాలేదు. డైలాగులు బాగున్నాయి. కొన్ని పంచ్‌లు గట్టిగా పేలితే, కొన్ని రిపీట్‌ అనిపించేశాయి. ఎడిటింగ్‌ ఇంకా అవసరం అనిపిస్తుంది. కథనం పరంగా కూడా కొన్ని లోపాలున్నాయి. నిర్మాణపు విలువలు బాగానే ఉన్నాయి. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి తగ్గట్టుగానే అనిపిస్తాయి.   

ఫైనల్‌ వర్డ్‌: మేడమీద అబ్బాయ్‌ జస్ట్‌ ఓకేనోయ్‌

రివ్యూ బై శేఖర్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS