నటీనటులు: తాప్సీ పన్ను, హర్ష్ రోషన్, భాను ప్రక్షన్, జయతీర్థ మొలుగు మరియు తదితరులు
దర్శకత్వం : స్వరూప్ RSJ
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్
సినిమాటోగ్రఫీ: దీపక్ యెరగరా
ఎడిటర్ : రవితేజ గిరిజాల
రేటింగ్: 2.5/5
తాప్సీ గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి కథకు ప్రాధాన్యం వున్న సినిమాలే చేస్తుంది. ఈ దశలో ఆమె నుంచి మంచి కంటెంట్ వున్న సినిమాలు వచ్చాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో సూపర్ హిట్టు కొట్టిన దర్శకుడు స్వరూప్. తొలి సినిమాతోనే కంటెంట్ వున్న దర్శకుడనే పేరు తెచ్చుకున్నాడు, ఈ ఇద్దరు కలసి `మిషన్ ఇంపాజిబుల్` సినిమా చేశారు. మరి ఈ మిషన్ ఎలా వుంది ? స్వరూప్ మరో విజయం అందుకున్నాడా? లేదా ద్వితీయ విఘ్నానికి దొరికిపోయాడా ? ఇంతకీ ఏమిటీ `మిషన్ ఇంపాజిబుల్` కథ.
కథ:
శైలజా (తాప్సి) ఓ ఇన్వెస్టిగేటీవ్ జర్నలిస్ట్. రామ్ శెట్టి అనే మాఫియా డాన్ బెంగళూరు నుంచి పిల్లల్ని.. దుబాయ్ తరలించడానికి ప్లాన్ వేస్తాడు. దాన్ని ఎలాగైనా అడ్డుకొని, రామ్ శెట్టిని పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టివ్వాలనుకుంటుంది శైలు.
ఇక్కడ కట్ చేస్తే.. తిరుపతికి దగ్గర్లోని ఓ పల్లెటూరులో రఘుపతి, రాఘవ, రాజారామ్ అనే ముగ్గురు పిల్లలు. చూడ్డానిక్కే పిల్లల్లా అనిపిస్తారు తప్పా ఆలోచనలు మాత్రం అండర్ వరల్డ్ రేంజ్ లో వుంటాయి.
ఏదైనా చేసిన ఫ్యామస్ అయిపోవాలని డిసైడ్ అవుతారు. సరిగ్గా ఇదే సమయానికి దావూద్ ఇబ్రహీంని పట్టిస్తే… రూ.50 లక్షల బహుమతి ఇస్తామన్న వార్త చ్సుతారు. దావూద్ ని పట్టుకోవడానికి ముంబై బయల్దేరతారు. అయితే బెంగళూరులో ఛైల్డ్ ట్రాఫికింగ్ ని అడ్డుకోవాలని చూసిన శైలజాకి ముంబై వెళ్లి దావూద్ ని పట్టిచ్చి. రూ.50 లక్షల ఫ్రైజ్ మనీ కొట్టేయాలని చూసిన.. రఘుపతి రాఘవ రాజారామ్‌కీ లింకు ఎక్కడ కుదిరింది? ముగ్గురు పిల్లలు దావూద్ ని పట్టుకున్నారా ? శైలు మిషన్ సక్సెస్ అయ్యిందా ? అనేది తెరపై చూడాలి
విశ్లేషణ:
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిన్న పాయింటే. అయితే ఆ పాయింట్ ని ఆసక్తికరంగా ఎక్కడా బోర్ కొట్టకుండా చూపించడంలో విజయం సాధించాడు స్వరూప్. మిషన్ ఇంపాజిబుల్` ని కూడా అలా ఓ పాయింట్ చుట్టూ ఆసక్తికరంగా మలచడానికి ఒక సెటప్ వేసుకున్నాడు. అయితే పాయింట్ మరీ సిల్లీగా మారిపోవడంతో వినోదం పండలేదు.
మొదటి పావుగంట పల్లెటూరిలో పిల్లల చుట్టూ నడిపిన వినోదం ఆసక్తికరంగా వుంటుంది. అయితే రానురాను ఇది సిల్లీ అనిపిస్తుంది. ఎప్పుడైతే పిల్లలు ముంబాయి బయలుదేరుతారో అక్కడి నుంచి వ్యవహారం సిల్లీగా మారిపోతుంది. ముగ్గురు పిల్లలు తాప్సీకి కలసిన తర్వాత కూడా కథలో వేగం రాదు. రెండో సగానికి వస్తే కథ గాడి తప్పుతుంది. చివరి గంట అయితే మరీ బోరింగ్ వ్యవహారంలా తయారౌతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ స్క్రిప్ట్ చాలా స్ట్రాంగ్ వుంటుంది. ప్రతి సీన్ కథకు ముడిపెడుతూ తీసుకెళ్ళిన దర్శకుడ.. `మిషన్ ఇంపాజిబుల్` మాత్రం లెక్క తప్పాడు. స్క్రిప్ట్ పై సరిగ్గా పని చేయలేదనే సంగతి అడుగడుగునా అర్ధమౌతుంటుంది.
నటీనటులు:
తాప్సీ నటనకి వంక పెట్టలేం. ఆమె స్క్రీన్ ప్రజన్స్ బావుంది. అయితే తన పాత్ర నిడివి తక్కువే. పిల్లలతో పోల్చుకుంటే ఆమెకున్న సీన్లు కూడా తక్కువ, ముగ్గురు పిల్లలు చక్కగా చేశారు. అమాయకత్వం, అతి తెలివి, తింగరితనంతో నవ్వించారు. మిగతా నటులు పరిధి మేర చేశారు.
టెక్నికల్:
సాంకేతికంగా చూస్తే.. సినిమా ఓకే అనిపిస్తుంది. కథకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. నేపధ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ కూడా బాగానే కుదిరింది. సెకండ్ హాఫ్ ఇంకాస్త ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువలు ఓకే.
ప్లస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్లు
తాప్సీ నటన
మైనస్ పాయింట్స్
బలహీనమైన కథ
అక్కట్టుకొని కధనం
లాజిక్ లేకపోవడం
ఫైనల్ వర్దిక్ట్ : మిషన్ .. మిస్ ఫైర్