నటీనటులు: సంధ్యారాజు, కమల్ కామరాజు, శుభలేఖ సుధాకర్, భానుప్రియ తదితరులు
దర్శకుడు: రేవంత్ కోరుకొండ
నిర్మాతలు: నిశ్రింకళ ఫిల్మ్
సినిమాటోగ్రఫీ: రేవంత్ కోరుకొండ
సంగీత దర్శకుడు: శ్రవణ్ భరద్వాజ్
ఎడిటర్: రేవంత్ కోరుకొండ
రేటింగ్: 2.5/5
టాలీవుడ్ లో నాట్యం నేపధ్యంలో వచ్చిన సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. 'స్వర్ణకమలం' 'సాగర సంగమం' , సిరిసిరిమువ్వ లాంటి క్లాసిక్స్ వున్నాయి. మోడరన్ టైమ్స్ లో లారెన్స్ 'స్టైల్'తో డ్యాన్స్ ని అభిమానించే ప్రేక్షకులని ఉర్రూతలూగించాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత తెలుగు తెరపై మరో నాట్య ప్రధాన సినిమా వచ్చింది. అదే 'నాట్యం'. ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు టైటిల్ రోల్ చేసిన ఈ సినిమా ట్రైలర్, టీజర్ ఆసక్తిని పెంచాయి. దానికి తోడు సినిమాకి పాజిటివ్ ప్రమోషన్స్ కూడా దక్కాయి. కళని అభిమానించే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని యూనిట్ ధీమాగా చెప్పింది. మరి ఇంతకీ 'నాట్యం' ఎలా వుందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.
కథ:
సితార(సంధ్యారాజు)కు చిన్నప్పటి శాస్త్రీయ నాట్యం అంటే ఇష్టం. ఎప్పటికైన గొప్ప నృత్యకారిణి కావాలని, అదే గ్రామంలో కాదంబరి కథను నాట్య రూపంలో ప్రదర్శించాలని లక్ష్యం పెట్టుకుంటుంది. పట్నం ఉండే రోహిత్(రోహిత్ బెహాల్) ఓ వెస్ట్రన్ డ్యాన్సర్. ఓ పనిపై సితార వుండే గ్రామానికి వస్తాడు. అక్కడ సితారతో పరిచమవుతుంది. రోహిత్ కారణంగా సితార జీవితంలో అనుకోని మలుపులు తిరుగుతాయి. సితార గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తర్వాత సితార జీవితంలో ఎలాంటి సంఘనలు చోటు చేసుకున్నాయి ? సితార చిన్నప్పటి నుంచి కలలు కన్న కాదంబరి నాట్య ప్రదర్శన చేయగలిగిందా ? ఇంతకీ కాదంబరి ఎవరు ? అనేది తెరపై చూడాలి.
విశ్లేషణ:
ముందు చెప్పుకునట్లు నాట్యం ప్రధానంగా తెలుగులో కొన్ని క్లాసిక్స్ వున్నాయి. ఇందులో పాయింట్ నాట్యమే. అయితే ఆ పాయింట్ ని ఎంత ఆసక్తికరంగా చూపించమనే అంశంపై సినిమా విజయం ఆధారపడి వుంటుంది. నాట్యంలో కూడా పాయింట్ వుంది. అయితే ఆ పాయింట్ కి వెండితెర రూపం ఇవ్వడంలో దర్శకుడి తడబాడు కనిపిస్తుంది. ఒక క్లాసికల్ డ్యాన్స్ కథాంశంతో వచ్చిన సినిమా ఇది. పాయింట్ ని ఆసక్తికరంగానే ఎత్తుకున్నాడు దర్శకుడు. ఈ జనరేషన్‌కి తగ్గట్టుగా కమర్షియల్ ఎలిమెంట్స్‌ని కూడా జత చేశాడు. కాదంబరి ప్లాష్ బ్యాక్ ని కూడా బాగానే రాసుకున్నాడు.
అయితే ఇవన్నీ కూడా సమన్వయ పరచడంలో విఫలమయ్యాడు. పాత్రల మధ్య సంఘర్షణ ఉంటేనే ప్రేక్షకుడికి కధతో కనెక్షన్ ఏర్పడుతుంది. నాట్యంలో ఆ సంఘర్షనే కొరవడింది. పాత్రలన్నీ చాలా సాదా సీదాగా సాగుతుంటాయి. సంధ్యారాజు, రోహిత్‌ల ప్రేమ కూడా అంత బలంగా రాసుకోలేకపోయాడు దర్శకుడు. వీటికి తోడు ప్రేక్షకుడి సహనానికి పరీక్షా అన్నట్టు సాగాదీతగా సీన్స్ సాగుతుంటాయి. ఇంటర్వెల్ బాంగ్ సెకండ్ హాఫ్ పై కొంచెం అంచనాలు పెంచినప్పటికీ... సెకండ్ హాఫ్ మొత్తాన్ని చాలా ఎమోషనల్ నోట్ లో నడిపాడు దర్శకుడు. కాదంబరి ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్పితే మిగతా సన్నీవేషాలన్నీ కధకు అవసరం లేనివిగా అనిపిస్తాయి. వీటికి తోడు స్లో నేరేషన్ .. వెరసి నాట్యం కాస్త నీరసంగా అనిపిస్తుంది.
నటీనటులు :
సంధ్యారాజు స్వతహాగా డ్యాన్సర్. ఆమె నాట్యం ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. నటనలో మాత్రం కొన్ని లోపాలు కనిపించాయి. రోహిత్ బెహాల్ డ్యాన్స్ కూడా బావుంది. నటన ఓకే. హరి పాత్రలో కనిపించిన కమల్ కామరాజు పాత్రకు న్యాయం చేశాడు. ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్, భానుప్రియ పరిధి మేర నటించారు.
సాంకేతిక వర్గం: శ్రవణ్ బరద్వాజ్ సంగీతం బావుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకా షార్ఫ్ గా వుండాల్సింది. నిర్మాణ విలువలు ఓకే.
ప్లస్ పాయింట్స్ :
సంధ్యారాజు
ఫ్లాష్ బ్యాక్
మైనస్ పాయింట్స్ :
బోరింగ్ స్క్రీన్ ప్లే
ఎమోషన్ మిస్ ఫైర్ కావడం
ఫైనల్ వర్డిక్ట్ : నీరసంగా సాగిన 'నాట్యం'