చేతులు మారిన అల్లరి నరేష్ 'సభ..'

మరిన్ని వార్తలు

'నాంది' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు అల్లరి నరేష్. చాలా రోజులుగా ఊరిస్తున్న హిట్ నాందితో దిరికింది నరేష్ కి. ఈ సినిమా తర్వాత 'సభకు నమస్కారం'అనే టైటిల్ తో మరో సినిమాని ప్రకటించారు. సతీష్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం. ప్రీ ప్రొడక్షన్, కాస్టింగ్ పూర్తి దశకు వచ్చాయి. మరి కొన్ని రోజుల్లో షూటింగ్ అనుకున్నారు.అయితే ఇంతలో సినిమాకి ఓ అవాంతరం వచ్చి పడింది.

 

సినిమా నిర్మాత మహేష్ కోనేరు ఆకస్మిక మరణంతో ప్రాజెక్ట్ డైలామాలో పడింది. నిర్మాత లేని సినిమా ఎలా ? అనే అనుమానాలు వచ్చాయి. అయితే ఇప్పుడీ సినిమా చేతులు మారింది. ప్రాజెక్ట్ లోకి మరో నిర్మాత వచ్చారు. ఆయనే అనిల్ సుంకర. ఏకే ఎంటర్ట్రైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తారని తెలిసింది. ఈ విషయంలో చర్చలు పూర్తయ్యాయి. హీరో నరేష్ ప్రాజెక్ట్ విషయంలో చొరవ తీసుకొని నిర్మాత అనిల్ కలవడం, ఆయనకి స్టొరీ నచ్చి ఓకే చేయడం చకచక జరిగిపోయాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుంది. నవంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS