నీదారే నీ కథ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం:  నీదారే నీ కథ
నటీనటులు: సురేశ్, ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ 


దర్శకత్వం: వంశీ జొన్నలగడ్డ
నిర్మాతలు: వంశీ జొన్నలగడ్డ, తేజేష్ వీర, శైలజ జొన్నలగడ్డ
రచయితలు : మురళి కాంత్, వంశీ జొన్నలగడ్డ


సంగీతం: ఆల్బర్ట్టో గురియోలి
సినిమాటోగ్రాఫర్ : ఎలెక్స్ కావు


బ్యానర్స్: జె వి ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 13  జూన్ 2024 

 

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 3/5


జీవితంలో ప్రతి ఒక్కరికి  ఒక లక్ష్యం అంటూ  ఉంటుంది. లైఫ్ లో ఎదో  సాధించాలని కలలు కంటూ  ఉంటారు. కానీ చాలా మందికి అవి నెరవేరవు, కలలుగానే  మిగిలిపోతుంటాయి. జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కోలేక  రాజీ పడి, ఇష్టం లేని పనిని చేస్తూ     బ్రతుకుతుంటారు. కానీ  కొందరు ఎన్ని  కష్టాలు వచ్చినా  ధైర్యంగా ఎదుర్కొని లైఫ్ లో తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఈ నేపథ్యంలో వచ్చిన చిత్రమే 'నీదారే నీ కథ'.  జె.వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై వంశీ జొన్నలగడ్డ నిర్మాత కమ్ దర్శకుడుగా తెరకెక్కించారు. తేజేష్ వీర, శైలజ సహ నిర్మాతలుగా. ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ ముఖ్య పాత్రల్లో నటించారు. మరి  ఈ  మూవీ ఎలా ఉంది? ఎవ‌రికి నచ్చుతుంది? అనేది ఈ  రివ్యూ లో చూద్దాం. 


కథ: అర్జున్ (ప్రియతమ్ మాంతిని) కి సంగీతం అంటే చాలా ఇష్టం. తన  ఫ్రెండ్స్ (విజయ్ విక్రాంత్, అనంత్) తో కలిసి ఒక స్టూడియో పెట్టుకొని మూవీస్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా రాణించాలని ప్రయత్నాలు చేస్తాడు. ఒక సినిమాకి అవకాశం వచ్చినా  కానీ దర్శకుడు అడిగిన రొటీన్ సీన్స్, సాంగ్స్ కి కంపోజ్ చేయడం ఇష్టం లేక తప్పుకుంటాడు.  అదే సమయంలో తన  గురువు (అజయ్) ఇచ్చిన సలహాతో ఒక ఆర్కెస్ట్రా ఈవెంట్ లో  పాల్గొనాలని నిర్ణయించుకుంటాడు. ఈ ఈవెంట్ లో పాల్గొని ఫైనల్ కి వెళ్ళడానికి అర్జున్ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి ? అసలు తాను అనుకున్నది సాదించాడా లేదా అనేది థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే !


విశ్లేషణ: మనసుకు నచ్చింది చేసుకుంటూ, సంతోషంగా బ్రతకగలిగితే అంతకంటే ఏం  కావాలి ఎవరికైనా....అన్నది నీదారే నీ కథ లో ఒక డైలాగ్. అవును ఇది జీవితంలో ప్రతి ఒక్కరు అనుకునేదే. కానీ చాలా తక్కువ మందికి ఇది సాధ్యం అవుతుంది. ఈ లైన్ తోనే నేటివిటీకి తగినట్టుగా దర్శకుడు వంశీ జొన్నలగడ్డ  తను అనుకున్నది అనుకున్నట్టు చూపించాడు. ముఖ్యంగా సంగీత ప్రియులకి,  యూత్ కి ఈ మూవీ ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. కుటుంబ సమేతంగా ప్రశాంతంగా చూడదగ్గ  చిత్రం అని చెప్పవచ్చు. 


నటీ నటులు : అందరు  కొత్తవాళ్లు అయినా చాలా బాగా నటించారు. ముఖ్యంగా హీరో అండ్ ఫ్రెండ్స్ మధ్య కామెడీ టైమింగ్ బాగుంది.  హీరో తండ్రిగా సీనియర్ హీరో  సురేశ్ నటించారు.  వీళ్లిద్దరి మధ్య వచ్చిన సన్నివేశాలు, తండ్రి కొడుకుల మధ్య అనుబంధం ప్రేక్షకుడి కి నచ్చుతాయి. 


టెక్నికల్ : టెక్నీకల్ టీమ్ లో ఆల్బర్ట్టో గురియోలి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ  మూవీకి  హైలైట్.  జె.వి ప్రొడక్షన్స్ నిర్మాణ  విలువలు  బాగున్నాయి. అలెగ్జాండర్ కావో కెమెరా పనితనం పర్వాలేదనిపిస్తుంది. 

 

ప్లస్ పాయింట్స్:
నటీనటులు 
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
సురేష్

 

మైనస్ పాయింట్స్:
స్లో నేరేషన్ 


ఫైనల్ వర్దిక్ట్ : మ్యూజిక్ ఫీల్ కథ!

ALSO READ : IN ENGLISH


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS