టాలీవుడ్ లో భాగ్యశ్రీ క్రేజ్

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో ప్రస్తుతం మారుమోగుతున్న పేరు భాగ్యశ్రీ బోర్సే. మొన్నటివరకూ పూజా హెగ్డే, శ్రీలీల, పేర్లు టాలీవుడ్ లో తెగ వినిపించేవి. శ్రీలీల రాకతో చాలా మంది  స్టార్ హీరోయిన్స్ వెనకపడిపోయారు. రెండేళ్లలో అరడజను కి పైగా సినిమాలు చేసింది శ్రీలీల. కానీ కొన్ని డిజాస్టర్లు తో కెరియర్ డౌన్ అయిపోయింది. కృతి శెట్టి కూడా ఉప్పెన సినిమాతో వచ్చిన ఫేమ్ తో వరససినిమాలు కమిట్ అయ్యింది. వాటిలో ఏది తనకి కలిసి రాలేదు. దీనితో కృతి కూడా మాయం అయిపోయింది. రీసెంట్ గా మనమే సినిమాతో పర్వాలేదనిపించుకుంది. పూజా హెగ్డే వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించినా ఇప్పుడు అవకాశాలు లేక ఎదురుచూస్తోంది. ఇంచుమించుగా ఇలాగే భాగ్యశ్రీ బోర్సే కూడా టాలీవుడ్ లోకి దూసుకు వస్తోంది. 


ఈ ముంబై భామ తెలుగులో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తోంది. తాను నటించిన ఒక్క  సినిమా కూడా రిలీజ్ కాకముందే ఇంకో రెండు సినిమాలకి ఫిక్స్ అయ్యింది. బాలీవుడ్ లో 'యారియాన్ 2' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, టాలీవుడ్ కంట్లో పడింది. హరీష్ శంకర్, రవితేజ కాంబోలో వస్తున్న 'మిస్టర్ బచ్చన్' సినిమాకి బాగ్యశ్రీని తీసుకున్నారు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే మరిన్ని అవకాశాలు అందుకుంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో భాగ్యశ్రీ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాలో మొదట శ్రీలీలని తీసుకున్నారు. పూజా కార్య క్రమాల్లో కూడా పాల్గొంది, ఇప్పుడు ఆ ప్లేస్ భాగ్యశ్రీ కొట్టేసింది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా, సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్న సినిమాలో భాగ్యశ్రీకి ఛాన్స్ దక్కినట్లు సమాచారం. తక్కువ కాలంలో స్టార్ హీరోలు, దర్శకులు దృష్టిలో పడి బ్యాక్ టు బ్యాక్‌ ఆఫర్లు కొట్టేస్తుంది. సమంత, రష్మిక, లాంటి స్టార్ హీరోయిన్స్ బాలీవుడ్ పై ద్రుష్టి పెట్టడంతో కొత్తవారికి టాలీవుడ్ లో అవకాశాలు దక్కుతున్నాయి. ఈ వరుసలో భాగ్యశ్రీ ముందు ఉంది. ఈ మూడు సినిమాలు హిట్ అయితే అమ్మడి క్రేజ్ ఇంకా పెరిగి టాలీవుడ్ మోస్ట్  వాంటెడ్ హీరోయిన్ గా మారటం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS