ఆర్గానిక్‌ మామ.. హైబ్రిడ్‌ అల్లుడు మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: సోహెల్, మృణాళిని రవి, రాజేంద్ర ప్రసాద్, మీనా తదితరులు

దర్శకుడు : ఎస్ వి కృష్ణా రెడ్డి

నిర్మాతలు: కోనేరు కల్పన

సంగీత దర్శకులు: ఎస్ వి కృష్ణా రెడ్డి

సినిమాటోగ్రఫీ: సి.రామ్ ప్రసాద్

ఎడిటర్: ప్రవీణ్ పూడి

 

 

రేటింగ్: 2/5

 

 

ఎస్వీ కృష్ణారెడ్ఢి ఒకప్పుడు టాప్ డైరెక్టర్. చిన్న సినిమాలతో పెద్ద విజయాలు అందుకున్న దర్శకుడు. మాయలోడు, యమలీల, మావిచిగురు, శుభలగ్నం ఎన్నో వందరోజుల సినిమాలు ఇచ్చిన ఆయన తర్వాత ఫామ్ కోల్పోయి సినిమాలకి దూరంగా వున్నారు. ఇప్పుడు ఆర్గానిక్‌ మామ.. హైబ్రీడ్ అల్లుడు తో మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నారు. మరి ఈ కొత్త ఇన్నింగ్ ఆయనకి విజయాన్ని ఇచ్చిందా ? ఎస్వీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చారా ? ఇంతకీ ఆర్గానిక్‌ మామ.. హైబ్రిడ్‌ అల్లుడు కథ ఏమిటి ? 

 

 

కథ :

 

 

విజయ్ (సోహెల్) రెండు సినిమాల ఫ్లాఫ్ డైరెక్టర్. మూడో సినిమా అవకాశం కోసంవెదుకుతుంటాడు. వీళ్ళది కొండపల్లి బొమ్మలు తయారుచేసుకొని బ్రతికే కుటుంబం. తన తెలివి తేటలతో ఓ స్టార్ హోటల్ బొమ్మల స్టాల్ పెట్టుకునేలా చేస్తాడు. అక్కడ హాసిని (మృణాళిని రవి) విజయ్ ని చూసి ప్రేమలో పడిపోతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. హాసిని తండ్రి వెంకటరమణ (రాజేంద్ర ప్రసాద్) ది ఆర్గానిక్ వ్యాపారం. విజయ్‌తో తన కూతురు ప్రేమాయణం గురించి తెలుసుకున్న వెంకటరమణ ఏం చేశాడు ? హైబ్రిడ్ అల్లుడు.. ఆర్గానిక్ మామ మనసుని ఎలా గెలుచుకుంటాడు? అనేది మిగతా కథ.

 

 

విశ్లేషణ :

 

 

ఇప్పటి చాలా మంది దర్శకులకు ఒకపుడు ఫేవరేట్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్ఢి. కథని చెప్పడంలో ఆయన వాడే టెక్నిక్ మ్యూజిక్కు చాలా మందికి ప్రేరణ. ఆయన కథల్లో ఒక రిజినల్ పాయింట్ వుంటుంది. ఆర్గానిక్‌ మామ.. హైబ్రిడ్‌ అల్లుడు విషయానికి వస్తే ఆ ఒరిజినాలిటీనే మిస్ అయ్యింది. పెద్ద ఆడంబరాలు లేకుండా కథని చెప్పడం, ప్రేక్షకులని యంగేజ్ చేసే నేర్పు వున్న ఆయన.. హీరోకి ఫైట్లు డ్యాన్సులు పెట్టి ఆర్గానిక్‌ మామ.. హైబ్రిడ్‌ అల్లుడు లాగిద్దామని అనుకున్నారు. అయితే ఇలాంటి ట్రీట్ మెంట్ ప్రేక్షకులకు ఎప్పుడో బోర్ కొట్టేసింది.

 

 

పాత్రల డిజైన్ చేసిన తీరు, సన్నివేశాల్లో కొత్తదనంలేకపోవడం, హీరోకి అనవసరమైన హీరోయిజం ఆపాదించడంతో కథ కృత్రిమంగా మారిపోయింది. అసలు విరామం వరకూ ఇందులో కథే ముందుకు వెళ్ళదు. కథలో ఏ పాత్ర మధ్య కూడా సరైన సంఘర్షణ వుండదు. లవ్ ట్రాక్ రొటీన్ గా వుంటుంది. అందులో బలం లేదు. సెకండ్ హాఫ్ లో వచ్చే అజయ్ ఘోష్ ఎపిసోడ్, ఫస్ట్ ఎపిసోడ్ లో సునీల్ ట్రాక్ కొంతలో కొత్త బెటర్. క్లైమాక్స్ అయితే మరీ బలహీనంగా తయారైయింది. 

 

 

నటీనటులు:.

 

 

విజయ్ పాత్రలో సోహెల్ నటన బావుంది. ఫైట్లు డ్యాన్సులు కూడా చేశాడు. మృణాళిని రవి అందంగా పద్దతిగా కనిపించింది. రాజేంద్ర ప్రసాద్ కొన్ని సీన్స్ సహజంగా ఇంకొన్ని సీన్లలో అసహజంగా కనిపించారు. ఇది ట్రీట్ మెంట్ లోని లోపం. మీనాది క్లాసులు పీకే పాత్ర. సునీల్, అజయ్ ఘోష్ పాత్రలు కొంత నవ్విస్తాయి. వరుణ్ సందేశ్, రష్మీ అతిధి పాత్రల్లో కనిపించారు. సప్తగిరి, ప్రవీణ్, హేమ, పృధ్వి, కృష్ణ భగవాన్ నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి. 

 

 

టెక్నికల్ :

 

 

పాటలు గుర్తుండవు. చిత్రీకరణ మాత్రం పర్వాలేదు. నేపధ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కెమరా పనితనం డీసెంట్ గా వుంది. కథకు తగ్గట్టు నిర్మాణ విలువలు వున్నాయి. డైలాగుల్లో సాగదీత ఎక్కువైయింది. సినిమాకి సన్నివేశబలం లేదు. సూపర్ అన్న ఒక సీన్ కూడా పడలేదు. 

 

 

ప్లస్ పాయింట్స్

 

 

కొన్ని కామెడీ సీన్లు 

డీసెంట్ ఫిల్మ్ మేకింగ్ 

 

 

మైనస్ పాయింట్స్

 

 

కథనంలో కొత్తదనం లేకపోవడం 

రొటీన్ ఎలిమెంట్స్ 

సాగదీత 

 

 

ఫైనల్ వర్దిక్ట్ : అవుట్ డేటడ్ మామ అల్లుడు!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS