అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాలని దిల్ రాజు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. వేణు శ్రీరామ్ ని తీసుకొచ్చి `ఐకాన్` కథ చెప్పించాడు. అప్పట్లో బన్నీ ఓకే చేసిన కథ ఇది. కానీ ఆ తరవాత పక్కన పెట్టేశారు. ఐకాన్ టాపిక్ ఎప్పుడొచ్చినా `చేస్తాం చేస్తాం..` అంటారు తప్ప ఎప్పుడో చెప్పరు. నిజానికి ఐకాన్ ఇక రాదని, ఆ సినిమా చేయడానికి బన్నీ సిద్ధంగా లేడన్నది ఇంకో టాకు. ఆ విషయం చెప్పలేక.. బన్నీ సతమతమవుతున్నాడట. పోనీ.. మరో దర్శకుడ్ని తీసుకెళ్లి కథ చెప్పిద్దామంటే.. బన్నీ రేంజ్‌కి తగిన దర్శకుడు దిల్ రాజుకి దొరకడం లేదు.
తాజాగా బన్నీ ఇప్పుడు మరో సినిమాని అధికారికంగా ప్రకటించాడు. సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. పుష్ప 2 తరవాత త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఓసినిమా చేస్తాడని టాక్. ఆ తరవాత.. సందీప్ రెడ్డి సినిమా ఉంటుంది. అంటే రాబోయే మూడేళ్లూ బన్నీ ఫుల్ బిజీ అన్నమాట. దీన్ని బట్టి దిల్ రాజుకి బన్నీ హ్యాండిచ్చినట్టు అర్థం అవుతోంది. సో.. ఐకాన్ కోసం దిల్ రాజు మరో హీరోని వెదుక్కోక తప్పదు.