రాజా మీరు కేక మూవీ రివ్యూ & రేటింగ్స్

మరిన్ని వార్తలు

తారాగణం: లాస్య, రేవంత్, నోయెల్, నందమూరి తారక రత్న
నిర్మాణ సంస్థ: కే స్టూడియోస్
ఎడిటర్: ఏవి. ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: రాంరెడ్డి
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
ఆర్ట్ డైరెక్టర్: మహేష్ బల్లంకి
యాక్షన్: సోలమన్
ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
డైరెక్టర్: కృష్ణ కిషోర్

ట్యాగ్ లైన్: 'రాజా మీరు కేక' కాదు


యావరేజ్ యూజర్ రేటింగ్: 2.25/5

కథ:

రవి (రేవంత్), శ్వేత (లాస్య), శశాంక్ (నోయెల్), శీను (హేమంత్) నలుగు స్నేహితులు. రవి, శ్వేత ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ లో పని చేస్తూ ఉంటారు. ఆ కంపెనీ సీఈఓ నాగరాజు (తారక రత్న) తన కంపెనీ షేర్లను బోర్డు మెంబర్లు వద్దు అని చెప్తున్నా వినకుండా ముఖ్య మంత్రి (పోసాని) తో కలిసి రియల్ ఎస్టేట్ లో పెడతారు. బోర్డ్ మెంబర్ల రాజీనామా తో కంపెనీ మూత పడుతుంది. అనుకోని సమయం లో అందరి ఉద్యోగాలు పోతాయి. సడన్ గా ఆర్థికంగా దెబ్బ తినడం తో శ్వేత ఆత్మ హత్య చేసుకొని చనిపోతుంది. దీనికి అంతటికి కారణం అయిన నాగరాజు మీద ఏ విధంగా మిగిలిన ముగ్గురు స్నేహితులు ప్రతీకారం తీసుకున్నారు అనేది ఈ చిత్ర కథ.

నటీనటుల ప్రతిభ:

ఈ చిత్రంలో ఎక్కువ మంది నటీ నటులు లేరు. ప్రధానం గా ఉన్న నలుగురు నటులు పరిచయస్తులే. రేవంత్, నోయెల్, లాస్య, హేమంత్ అందరూ తమ పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేసారు. వారి నటన చూస్తే వారు బయట కుడా స్నేహితులే అన్నంతలా అనిపిస్తుంది. లాస్య తన సహజ నటన తో మెప్పించింది. ఇంటింటా అన్నమయ్య చిత్ర హీరో రేవంత్ కూడా మంచి ప్రతిభ కనబరిచాడు. మిగిలిన నటులు కూడా బాగా చేసారు. తారక రత్న ను ఎంపిక చేసుకోవడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం. పోసాని కూడా తనదైన నటన తో మెప్పించాడు.

 

చిత్ర సమీక్ష: 

మొదటి నుండి ఈ చిత్రం సత్యం రామ లింగ రాజు కు సంబందించిన కథ గా రూమర్లు వచ్చాయి. ఒకేసారిగా టాప్ లో ఉన్న కంపెనీ సడన్ గా పడిపోవడం, ఆ తర్వాత చోటు చేస్కున్న పరిణామాల నడుమ ఈ చిత్ర కథ ను రాసుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రానికి సంబందించిన వరకు కథ చాలా ముఖ్యం. మంచి అంశాల తో ఇంటరెస్టింగ్ గా కథ ను అనుకున్నారు. దానిని సరి అయిన ప్రక్రియ లో నే చెప్పే ప్రయత్నం చేసారు. ఈ చిత్ర నిడివి ని దృష్టి లో పెట్టుకొని, నిర్మాతలు అనవసరమైన వాణిజ్య పరమైన అంశాలను జోడించకుండా ఉండి ఉంటె కథ సరిగ్గా హైలైట్ అయ్యేది. కాని ఇక్కడ అది జరగలేదు.

లాజిక్ లాంటి అంశాలను పక్కన పెడితే ఈ చిత్రం లో ఇంటర్వెల్ అంశం చాలా బాగుంటుంది. ఈ చిత్ర ప్రథమార్ధం లో అక్కడక్కడ స్లో గా అనిపించినా సెకండ్ హాఫ్ మొత్తం చాలా బాగా తెరకెక్కించడం జరిగింది. మొదటి భాగం మొత్తం మన ఓపిక కు పరీక్ష లాగా అనిపించినా రెండో భాగం మాత్రం చాలా చక్కగా కుదిరింది. ఈ చిత్రం లో స్నేహితులు తమ ప్రతీకారం తీర్చుకొనేందుకు చేసే ప్రయత్నాలు మెప్పిస్తాయి. సెకండ్ హాఫ్ లో చాలా భాగం లో వచ్చే సీన్లు అందంగా తెరకెక్కించ బడ్డాయి. అనవసరం గా చేర్చిన అంశాల వాళ్ళ చిత్ర కథనం చెడిపోయింది అనిపిస్తుంది. కమర్షియల్ విలువల మీద అనవసరం గా ఎక్కువ దృష్టి పెట్టినట్టు అయింది.

చిత్ర కథనం చాలా సహజంగా ఉంటుంది. చెప్పాల్సిన కంటెంట్ కూడా చాలా చక్కగా ప్రెసెంట్ చేసారు దర్సకుడు. అక్కడక్కడ కొన్ని థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ జోడించే ఆస్కారం ఉన్నా కానీ వాటిని జోడించకుండా చిత్రాన్ని అలా వదిలేయడం కొంచెం నిరాశాజనకం. అన్ని పక్కన పెడితే టెక్నికల్ డిపార్ట్మెంట్ పని తీరు చక్కగా కుదిరింది. కంటెంట్ పరంగా, చిత్రం డల్ గా ఉంటుంది. కాని టెక్నికల్ గా అబ్బురపరిచే స్థాయి లో చిత్రాన్ని తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించారు. కెమెరా పనితనం చక్కగా కుదిరింది. అందరు నటీ నటులను చక్కగా చూపించారు. ఎడిటింగ్ మామూలు గా ఉంది. సంగీతం చక్కగా కుదిరింది. నేపథ్య సంగీతం కూడా చిత్రానికి తగ్గట్టుగా ఇవ్వడం జరిగినది.​

బాగున్నవి:

+ నటీ నటుల ప్రతిభ
+ సంగీతం
+ కెమెరా పనితనం
+ కథ

బాగోనివి:

- కథనం
- దర్సకత్వం

తీర్పు:

చక్కని కథ ఉన్న చిత్రం రాజా మీరు కేక. కాని అనవసరంగా కాస్త వాణిజ్యం అంశాలు ఎక్కువగా జోడించడం తో కథనం ఆసక్తి కరంగా లేకుండా సాగుతుంది. చివరగా ఒక మామూలు చిత్రం గా మిగిలిపోయే చిత్రం రాజా మీరు కేక.

రివ్యూ బై రామ్

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS