త్వరలోనే 'డీజె - దువ్వాడ జగన్నాధమ్' సినిమాతో సందడి చేయనున్నాడు అల్లు అర్జున్. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ కొత్త సినిమా సందడి కూడా మొదలైపోయింది. వక్కంతం వంశీ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ కొత్త సినిమా రాబోతోందన్న సంగతి తెలిసిందే. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే టైటిల్‌ని ఈ సినిమాకి పెట్టడం జరిగింది. ఈ సినిమాలో బన్నీతో జత కట్టబోయే హీరోయిన్స్ గురించి చర్చ జరుగుతోంది ప్రస్తుతం. ఇప్పటికే కన్నడ బ్యూటీ రష్మికని బన్నీకి జోడీగా తీసుకునేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సినిమాలో బన్నీ ఇద్దరు ముద్దుగుమ్మలతో ఆడి పాడనున్నాడట. మరో హీరోయిన్‌గా ముద్దుగుమ్మ కేథరీన్ ట్రెసా పేరు వినిపిస్తోంది. ఈ హాట్ బ్యూటీతో బన్నీకి మంచి స్నేహం ఉంది. 'ఇద్దరమ్మాయిలతో', సరైనోడు' తదితర చిత్రాల్లో బన్నీకి గర్ల్ ఫ్రెండ్‌గా నటించింది కేథరీన్. అలాగే 'రుద్రమదేవి' సినిమాలోనూ కేథరీన్‌కి బన్నీ ఛాన్సిప్పించాడనే టాక్ కూడా ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకి బన్నీ మరో ఛాన్స్ ఇవ్వనున్నాడనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్. ప్రస్తుతం కేథరీన్ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో నటిస్తోంది. తేజ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రానా హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో కేథరీన్‌ది లేడీ పొలిటీషియన్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. బన్నీ సినిమాలో ఒకవేళ ఛాన్స్ దొరికితే కేథరీన్ జాక్ పాట్ పట్టేసినట్లే.