స్కంద మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: స్కంద

నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్
దర్శకత్వం: బోయపాటి శ్రీను


నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
 
సంగీతం: ఎస్ఎస్ థమన్
ఛాయాగ్రహణం: సంతోష్ డిటాకే
కూర్పు: తమ్మిరాజు


బ్యానర్స్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
విడుదల తేదీ: 28 సెప్టెంబర్ 2023

 

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.25/5

 

బోయ‌పాటి శ్రీను స్పెషాలిటీ ఊర మాస్. కేవలం మాస్ ఆడియన్స్ ని మెప్పించేలా సినిమాలు తీయడంలో ఆయన దిట్ట. ఇప్పుడు ఆయన రామ్ తో స్కంద చేశారు. ‘అఖండ‌’ త‌ర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడం, రామ్ తో తొలి కాంబినేషన్ కావడంతో  ‘స్కంద‌’ పై ఆసక్తి పెరిగింది.  మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది?  బోయ‌పాటి మార్క్ ప్రేక్షకుల్ని ఏ మేర‌కు మెప్పించింది?


కథ:  రుద్రగంటి రామ‌కృష్ణ రాజు (శ్రీ‌కాంత్‌) అనే ఓ పారిశ్రామిక వేత్త చేయ‌ని నేరానికి  జైలుకి వెళ్తాడు. కోర్టు త‌న‌కు ఉరిశిక్ష విధిస్తుంది. కట్ చేస్తే.. ఆంధ్రా సీమ్‌, తెలంగాణ సీమ్‌.. ఇద్దరి కూతుర్లని  ఓ యువకుడు ( రామ్ పోతినేని) ఎత్తుకొచ్చేస్తాడు. అసలు  రుద్రగంటి రామ‌కృష్ణ రాజు ఎందుకు జైలుకి వెళ్ళాడు ? ఆ యువకుడు సిఎం కూతుర్లని ఎందుకు టార్గెట్ చేశాడనేది మిగతా కథ. 


విశ్లేషణ: తనదైన మార్క్ తో ఈ కథని ప్రారంబించాడు బోయపాటి. హీరో పరిచయానికి ముందు ఇద్దరి ముఖ్యమంత్రుల కథని నడిపాడు. అయితే సడన్ హీరో పాత్రని ఎలాంటి పరిచయం, కనీసం పేరు కూడా లేకుండా తెరపైకి తీసుకొస్తారు. హీరో వెనుక ఎదో ఒక బలమైన కారణం ఉంటుందని ప్రేక్షకులు భావించినప్పటికీ దాన్ని సస్పెన్స్ లో పెట్టడంతో తెరపై తను చేస్తున్న హింసకి ఒక ఎమోషన్ అంటూ లేకుండా వుంటుంది. దాదాపు ఫస్ట్ హాఫ్ అంతా ఇదే ధోరణిలో నడిపేశారు. 


సెకండ్ హాఫ్ లో రుద్రగంటి రామ‌కృష్ణ రాజు క‌థ మొద‌లెట్టారు. అసలు ఎమోషన్ ఇక్కడే మొదలౌతుంది. ఫస్ట్ హాఫ్ లో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం నయం. దర్శకుడు దీనికి రాసుకున్న ట్రీట్మెంట్ మాత్రం చాలా రోటీన్ గా వుంటుంది. అసలు ఈ కథలో హీరో వచ్చిన తీరు చాలా కుత్రిమంగా వుంటుంది. పైగా హీరోకి క్యారెక్టర్ ఆర్క్ లేకపోవడంతో అతడి ప్రయాణం కేవలం ఫైట్లు చేయడానికి తప్పితే ఇంకేం ఎమోషన్ ఇవ్వదు. 


పైగా ఇందులో చాలా సన్నివేశాలు లాజిక్ లెస్ గా క‌నిపిస్తాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు, వారి పాత్రలు తీర్చిద్దిన విధానం అసహజంగా వుంటుంది.  ఇంటర్వెల్ ఫైట్ ఐతే మరీ టూమచ్.  ఇక యాక్షన్ సన్నివేశాలు శృతి మించి ఒక దశలో నవ్వుకూడ తెప్పిస్తాయి. 


నటీటులు: రామ్ రెండు కోణాలు వున్నా పాత్ర చేశాడు. తెలంగాణ, చిత్తూరు యాసలు బాగానే పలికాడు యాక్షన్ సీన్లలో ఆకట్టుకున్నాడు.  డ్యాన్సులు బావున్నాయి. శ్రీ‌లీల కూడా డాన్సుల్లో అద‌ర‌గొట్టింది. ఐతే ఆమెకు న‌టించ‌డానికి అవకాశం లేని పాత్ర. శ్రీ‌కాంత్ పాత్ర హుందాగా ఉంది. తెరపై చాలా మంది నటులు కనిపిస్తారు కానీ చెప్పుకునేలా ఏ పాత్ర వుండదు 


టెక్నికల్ : సాంకేతికంగా చూస్తే.. తమన్ ఇచ్చిన పాటలు మరీ అంత క్యాచిగా లేవు. గండర బాయ్ పాటలో డ్యాన్సులు బాగా కుదిరాయి.  ఫొటోగ్రఫీ బాగానే వుంది ఉంది. సినిమాని క‌ల‌ర్‌ఫుల్ గా తీశారు. డైలాగ్స్ లో గుర్తు పెట్టుకొనేవేం లేవు.  బోయ‌పాటి హీరో పాత్రకి ఇచ్చిన ఎలివేషన్స్ కోసం స్పెషల్ బడ్జెట్ పెట్టారేమో అనిపిస్తుంది. అన్ని ఎలివేషన్స్ వున్నాయి ఇందులో. బోయపాటి విజయ రహస్యం యాక్షన్ లో ఎమోషన్ వర్క్ అవుట్ కావడం. స్కందలో అదే మిస్ అయ్యింది.  

 

ప్లస్ పాయింట్స్ 

రామ్ 
యాక్షన్ సీన్స్ 
నిర్మాణ విలువలు 

 

మైనస్ పాయింట్స్ 

కథ కథనం 
లాజిక్ లెస్ సీన్స్ 
బోరింగ్ ఫస్ట్ హాఫ్ 


ఫైనల్ వర్దిక్ట్: స్కంద.. యాక్షన్ ఫుల్లు..  ఎమోషన్ నిల్లు...


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS